తెలంగాణ ప్రాంతం – ముఖ్యమైన కమిటీ లు
కుమార్ లలిత్ కమిటీ
1969 జనవరిలో కుమార్ లలిత్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీఏర్పాటుకుప్రధానంగా దోహదం చేసిన పరిస్థితి.... తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందిఆతరువాత, పెద్దమనుషుల ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదనే భావన ఏర్పడింది. ఆ ఒప్పందం ఏంటంటే... తెలంగాణప్రాంతరెవెన్యూ ఖాతాలోని మిగులును ఆ ప్రాంతంలో మాత్రమే ఖర్చు చేయాలి. అయితే, అలా జగడం లేదనీ... తెలంగాణ ప్రాంతంవివక్షకుగురౌతోందని, అభివృద్ధి కుంటు పడుతోందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఒప్పంద ప్రకారం పొందాల్సినవాటాలనుపొందలేకపోతోందన్న అభిప్రాయం ప్రజల్లో బాగా పెరిగింది. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతప్రజలనుంచిఆయనకు ఇదే వివక్షపై ఫిర్యాదులు అందాయి. దాంతో తెలంగాణ ప్రాంతంలోని మిగులును సక్రమంగా అంచనా వేసేందుకు కుమార్లలిత్నేతృత్వంలో ఒక కమిటీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనల మేరకు ఏర్పాటు చేశారు.1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకూ గలమధ్యకాలంలో రెవెన్యూ మిగులును ఈ కమిటీ అంచనా వేసింది. 1969 మార్చి నెలలో సమగ్ర నివేదికను సమర్పించింది.
నివేదికలోఅంశాలు
ప్రజా ప్రతినిధుల అంగీకరించిన సూత్రాల ఆధారంగానే మిగులు అంచనా వేయడం జరిగింది.ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే, తెలంగాణలో మిగులు అనేది ఆంద్రాలో అదనపువ్యయంతెలంగాణలోని రెవెన్యూ ఖాతాలోని మిగులును ఒక రిజర్వ్ ఫండ్‌గా భావించి, దానికి సమానమైన వ్యయాన్ని ఆంధ్రాలోతగ్గించాలనికమిటీ పేర్కొంది. పైగా, తెలంగాణ ప్రాంతంలో అదనపు వ్యయం అవసరం అని కమిటీ పేర్కొంది.
ఈకమిటీ నివేదిక ప్రకారం..1956-57 నుంచి 1967-68 మధ్య కాలంలో తెలంగాణ రెవెన్యూ మిగులు రూ. 64 కోట్లు. అదే కాలంలోఆంధ్రాలో రాబడి రూ. 719 కోట్లు, రెవెన్యూవ్యయం రూ. 772 కోట్లు. తెలంగాణలో జరిగిన మూలధన వ్యయంలో 35.3శాతం.దాని ప్రకారం తెలంగాణ వాటా రూ. 517 కోట్లు, వాస్తవ వ్యయంరూ. 527 కోట్లు. తెలంగాణ రెవెన్యూ మిగులు రూ.54 కోట్లు.
కేంద్ర పన్నులతో వాటా, భారీ నీటి పారుదల, గ్రాంట్లు,పరిపాలనలాంటి ఖర్చులు, ఆదాయాల్లో 2 : 1నిష్పత్తిలో ఉండాలని కమిటీ సూచించింది.
వాంఛూ - భార్గవ్ కమిటీలు
1969, ఏప్రిల్11నతెలంగాణ ప్రాంతఅభివృద్ధి కోసం 8 పాయింట్ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫార్ములాకు సంబంధించి రెండు కమిటీలనునియమించింది.అవే.. వాంఛూ, భార్గవ్ కమిటీలు. ఈ 8 పాయింట్ ఫార్ములాకు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే.. ఆసమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనేడిమాండ్ బాగా పెరిగింది. ఉద్యమం కూడా ఊపందుకుంది. దీంతో తెలంగాణప్రాంతంలో శాంతిభద్రతలు కూడా క్షీణించారు. ఈ దశలోపార్లమెంటులోతెలంగాణ అంశమై ప్రతిపక్ష నాయకులతో చర్చించారు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఆ చర్చలో ఒక్క స్వతంత్ర పార్టీమాత్రంప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతును ఇచ్చింది. మిగతా ఏ పార్టీలూ మద్దతు ఇవ్వలేదు. అప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం 8 సూత్రాలపథకాన్నిప్రకటించారు.
వాంఛూ కమిటీ
ఈ కమిటీ అధ్యక్షుడు కె.ఎమ్. వాంఛూ. నిరెన్ డే, ఎం.పి.సెతల్వాడ్‌లు సభ్యులు. ఉపాధికి సంబంధించి రాజ్యాంగ పరమైన రక్షణను తెలంగాణ ప్రజలకు కల్పించేందుకు అవసరమైన సూచనలుచేసేందుకు ఈ కమిటీ ఏర్పడింది. 1969 సెప్టెంబర్ 9న ఈ కమిటీ తన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆనివేదికలో... తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునేందుకు ఆంధ్రా ప్రాంత ప్రజలు కూడా అర్హులే అని కమిటీ తేల్చి చెప్పింది. ఒక రాష్ట్రంలోఉంటూఉద్యోగాల విషయంలో ఏ ప్రాంతంలో వారికి ఆ ప్రాంతంలో ప్రాధాన్యత ఇవ్వాలనే చట్టం చేసే అధికారంపార్లమెంటుకు లేదని కమిటీ పేర్కొంది.
భార్గవ్ కమిటీ
తెలంగాణ రెవెన్యూ మిగులును ప్రభుత్వగణాంకాల ఆధారంగా కుమార్ లలిత్ కమిటీ అంచనా వేసిందన్న ఆరోపణల నేపథ్యంలో... మిగులను అంచనా వేసేందుకు 1969ఏప్రిల్ 22న జస్టిస్ వశిష్ఠ భార్గవ్ అధ్యక్షత కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తెలంగాణ మిగులును రూ. 28 కోట్లుగా అంచనా కట్టింది. మిగుల వినియోగం విషయమై తెలంగాణ, ఆంధ్రాల మధ్య కుదిరినఒప్పందాల్ని కమిటీ సమీక్షించింది.
గిర్‌గ్లానీ కమిటీ
జీవో 610 అమలును సమీక్షించేందుకు ఐ.ఎ.యస్.అధికారి జె.ఎం. గిర్‌గ్లానీ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈకమిటీనిఏర్పాటు చేసి, మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందా కోరారు. తెలంగాణలోని ఓపెన్ పోస్టులను లోకల్, నాన్ లోకల్‌గా విభజించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఓపెన్ కేటగిరీలో బ్యాక్ లాగ్ పోస్టను చేర్చి తెలంగాణేతరులకు ఇచ్చారనికమిటీ పేర్కొంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అక్రమాలు జరుగుతున్నట్టు కమిటీ అభిప్రాయ పడింది.న్యాయశాఖలోఅక్రమ నియామకాలు జరిగాయని తమ నివేదికలో వెల్లడించింది.
జయభారత్ రెడ్డి కమిటీ
1984లో తెలుగుదేశం ప్రభుత్వంఎన్టీఆర్నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరు సూత్రాల పథకం అమలు (1973), రాష్ట్రపతి ఉత్తర్వులు (1975)అమలులో ఉల్లంఘన జరుగుతున్నట్టు తెలంగాణీ ఎన్జీవో సంఘం ఫిర్యాదు చేసింది. దాంతో ప్రభుత్వం స్పందించి జయభారత్‌రెడ్డిఅధ్యక్షుడిగా కమిటీని నియమించింది. ఈ ప్రాంతంలో ఆంధ్రా ఉద్యోగాలు ఎంతమంది అనేది కమిటీ లెక్కలువేసింది. అలాగే... ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలుచేస్తున్నవారి విషయంలో ఏం చేయాలన్నది కూడా ఈ కమిటీ చర్చించింది. 58,962 మంది స్థానికేతరులు ఉన్నట్టు కమిటీ నివేదించింది.శ్రీరాంసాగర్, జూరాల, శ్రీశైలం ఎడమగట్టులో గెజిటెడ్ ఉద్యోగుల్ని సొంత జోన్లకు పంపాలని పేర్కొంది. నకిలీ స్థానిక ధ్రువ పత్రాలతో ఉద్యోగాలుపొందినవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
సుందరేశన్ కమిటీ
ఈ కమిటీ కూడా ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రభుత్వమే నియమించింది. జయభారత్‌రెడ్డి కమిటీ చేసిన సిఫార్సులను సమీక్షించేందుకు ఏర్పడిన ఈ కమిటీ, 1985 డిసెంబర్‌లో నివేదిక సమర్పించింది. ఈ కమిటీ సూచనల ఆధారంగా 1985 డిసెంబర్ 30న జీవో 610ను ప్రభుత్వం విడుదల చేసింది.