<b>భారత ప్రభుత్వ చట్టం 1935</b>


<b>భారత ప్రభుత్వ చట్టం 1935</b>

భారత ప్రభుత్వ చట్టం 1935

భారత ప్రభుత్వ చట్టం 1935

రాష్ట్రపతికి, రాష్ట్రగవర్నర్లకు విశిష్ట అధికారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన, ద్విసభా విధానం

రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాలు

ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది.- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది- ఎం.ఎ. నానీఫాల్కీవాలా

ఇదొక నిశ్చయాత్మక తీర్మానం, ఒక హామీ- జవహర్ లాల్ నెహ్రూ

ప్రవేశిక అనేది మన కలలు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం- అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది - జె. డయ్యర్

అమెరికా స్వతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదేవిధమైన సంబంధం భారత రాజ్యాంగ ప్రవేశికకు, భారత రాజ్యాంగానికి మధ్య ఉంది- కె.ఆర్. బాంజ్‌వాలా

భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు - జస్టిస్ హిదయతుల్లా

ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగానికి బంగారు ఆభరణ తాళంచెవి లాంటిది- పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ

ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను- సర్ ఎర్నస్ట్ బార్కర్

ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం- కె.ఎం. మున్షి

భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యలు

కె.సి.వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా అభివర్ణించారు.

ఐవర్ జెన్నింగ్ న్యాయవాదుల స్వర్గం అని పేర్కొన్నారు.

గాడ్విన్ ఆస్టిన్ సహకార సమాఖ్యగా వర్ణించారు.

హెచ్.వి. కామత్ ఐరావతంతో పోల్చారు.

ఐ.పి. గోయల్ సర్దుబాటు సమాఖ్యగా పేర్కొన్నారు.

రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలుపరిచేవారిని నిందించాలి - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

రాజ్యాంగ రచనలో వివిధ కమిటీలు - అధ్యక్షులు

 

కమిటీలు  అధ్యక్షులు
 ప్రాథమిక హక్కులు  సర్దార్ వల్లభాయ్ పటేల్
రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ  సర్దార్ వల్లభాయ్ పటేల్
నిబంధనల కమిటీ  డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
స్టీరింగ్ కమిటీ డాక్టర్  డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
ప్రాథమిక హక్కుల ఉప కమిటీ  జె.బి. కృపలానీ
డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్  బి.ఆర్. అంబేద్కర్
ఈశాన్య రాష్ట్రాల (గిరిజన), అస్సాం ప్రాంతాల కమిటీ

 గోపీనాథ్ బార్డోలి

మైనారిటీల కమిటీ  హెచ్.సి. ముఖర్జీ
సుప్రీంకోర్టు అడహాక్ కమిటీ  ఎస్. వరదాచారి
కేంద్ర అధికారాలు, కేంద్ర రాజ్యాంగ కమిటీ  జవహర్‌లాల్ నెహ్రూ
ఆర్థిక, స్టాఫ్ కమిటీ  డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
క్రెడెన్షియల్ కమిటీ  అల్లాడి కృష్ణస్వామి అయ్యర్      
సభా కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య     
అస్సాం ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల సబ్‌కమిటీ   ఎ.వి. ఠక్కర్
ఆర్థిక అంశాలపై కమిటీ  నళినీ రంజన్ సర్కార్
రాజ్యాంగ పరిశీలనా కమిటీ  అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, జవహర్‌లాల్ నెహ్రూ
జాతీయ పతాక తాత్కలిక కమిటీ  డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
చీఫ్ కమిషనర్‌ల ప్రాంతాలపై కమిటీ   డాక్టర్ పట్టాభి సీతారామయ్య
సలహా సంఘం    సర్దార్ వల్లభాయ్ పటేల్    
కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్  ఎస్.కె. థార్   
ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ  కె.ఎం. మున్షి
రాజ్యాంగ పరిషత్ విధులపై కమిటీ    గణేశ్ వాసుదేవ మౌలంకర్