భారత రాజ్యాంగ ప్రవేశిక
భారత రాజ్యాంగ ప్రవేశిక
భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్య్రాన్ని, అంతస్థుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాం.
భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది.
రాజ్యాంగ ప్రవేశికను పీఠిక అని, అవతారిక అని, రాజ్యాంగ మూలతత్వమని, రాజ్యాంగం ముందుమాట అని, భారత రాజ్యాంగ ఉపోద్ఘాతం అని, రాజ్యాంగ భూమిక (PREAMBLE) అని అంటారు.
భారత రాజ్యాంగంలో వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు
దేశ రాజ్యాంగ గ్రహించిన అంశాలు
ఆస్ట్రేలియా : ఉమ్మడి జాబితా, పీఠికలో వాడిన భాష
రష్యా : ప్రాథమిక విధులు
అమెరికా : ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఉపరాష్ట్రపతి ఎన్నిక, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి తొలగింపు
దక్షిణాఫ్రికా : రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక
ఫ్రాన్స్ : గణతంత్ర వ్యవస్థ
కెనడా : బలమైన కేంద్రప్రభుత్వం, కేంద్రానికి అవశిష్టాధికారాలు, సమాఖ్య విధానం
బ్రిటన్ : సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, స్పీకర్ హోదా, విధులు, క్యాబినెట్ తరహా పార్లమెంటరీ విధానం
జపాన్ : న్యాయసూత్రాలు, చట్టం నిర్ధారించిన విధానం
జర్మనీ : అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలు
ఐర్లాండ్ : ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం, రాష్ట్రపతి ఎన్నిక