రాజ్యసభ ప్రత్యేక అధికారాలు
రాజ్యసభ ప్రత్యేక అధికారాలు
రాజ్యసభ లోక్‌సభతో సమానంగా అధికారాలను కలిగి ఉంటుంది. (ఒక ఆర్థిక అధికారాలను మినహాయించి).
అంతేకాకుండా రాజ్యసభ క్రింది ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటుంది
దీనిని కలరబుల్ లెజిస్లేషన్ అంటారు. అనగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ తనకు చట్టాలను రూపొందించే అధికారం ఉన్నదని చట్టాలను రూపొందించడం.
లోక్‌సభ ప్రత్యేక అధికారాలు:
1) అది ఆమోదించవచ్చు. 2) తిరస్కరించవచ్చు 3) సూచనలను ప్రతిపాదించవచ్చు.
4) 14 రోజుల లోపు లోక్‌సభకు త్రిప్పి పంపాలి.
* ఆర్థిక బిల్లుల విషయంలో రాష్టప్రతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేయలేరు.
ద్రవ్య బిల్లు మరియు ఆర్థిక బిల్లు మధ్య తేడాలు:
* 110 నిబంధనలోని అంశాలన్నీ ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు. ప్రధానంగా భారత సంఘటిత నిధిపై భారం మోపే/ ప్రభావం చూపే బిల్లులను ద్రవ్య బిల్లులు అంటారు.
ఉదా: పన్నులను విధించటం, రద్దు చేయడం, మార్చడం మొదలైనవి. ప్రభుత్వ రుణాల క్రమబద్దీకరణ.
భారత సంఘటిత నిధినుండి ఖర్చుచేసే అంశాలు.
ప్రజాధనానికి వచ్చే ఆదాయం:
ఆర్థిక బిల్లులు: (117 నిబంధన)
ప్రభుత్వ ఆదాయ వ్యయాలతో కలిసి ఉన్న బిల్లును ఆర్థిక బిల్లు అంటారు. ఆర్థిక బిల్లులో మొదటి తరగతి ఆర్థిక బిల్లు, 2వ తరగతి ఆర్థిక బిల్లు అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
110వ నిబంధనలోని అంశాలతోపాటు ఇతర అంశాలు ఉన్నట్లైతే మొదటి తరగతి ఆర్థిక బిల్లుగా పరిగణిస్తారు.
ఒక బిల్లులో వ్యయానికి సంబంధించిన అంశాలుంటే (110 నిబంధనను మినహాయించి) దానిని రెండవ తరగతి ఆర్థిక బిల్లు అంటారు. దీనికి లోక్‌సభ స్పీకర్ ధృవీకరణ అవసరం లేదు.
1) రాష్టప్రతి పూర్వానుమతి అవసరం లేదు.
2) దీనిని మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు.
కార్యనిర్వాహక వర్గంపై పార్లమెంటు నియంత్రణ:
ప్రశ్నోత్తరాల సమయం:
పార్లమెంట్ ప్రారంభమయ్యే మొదటి గంటను ప్రశ్నోత్తరాల సమయం అంటారు. ఇది 11 గం. నుండి 12 గంటల వరకు ఉంటుంది.
పార్లమెంట్ సభ్యులు సంబంధిత మంత్రులను వారు నిర్వర్తించిన విధులను మంత్రులను ప్రశ్నించగా వారు సమాధానాలు ఇవ్వాలి.
ప్రశ్నోత్తరాల సమయంలో క్రింది మూడు రకాల ప్రశ్నలు అడుగవచ్చు.
ఈ రకమైన ప్రశ్నకు సంబంధిత మంత్రి వౌఖిక సమాధానాలు ఇవ్వాలి. వాటిపై సభ్యులు అనుబంధపు ప్రశ్నలను వేయవచ్చు.
ఈ రకమైన ప్రశ్నలకు మంత్రులు వ్రాతపూర్వక సమాధానాలివ్వాలి. అనుబంధ ప్రశ్నలకు చోటుండదు.
పై రెండు రకాల ప్రశ్నలను అడగడానికి కనీసం 10 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.
అత్యవసర, ప్రజా ప్రాముఖ్యానికి సంబంధించిన/ కలిగిన ప్రశ్నలను ఈ విధంగా పిలుస్తారు.
ఈ ప్రశ్నలను అడగటానికి మూడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.
* ఒక ప్రశ్న నక్షత్రపు గుర్తుగల ప్రశ్న లేక నక్షత్రపు గుర్తులేని ప్రశ్న లేక స్వల్ప వ్యవధి ప్రశ్న అనేది స్పీకర్ నిర్ణయిస్తారు.
శూన్యకాలము (జీరో అవర్):
ఇది 12 నుండి 1 గం. వరకు ఉంటుంది.
ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండా ప్రారంభవౌతుంది. కానీ ఒక్కోసారి ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండాకు గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్‌నే శూన్యకాలము అంటారు. ఈ శూన్యకాలంలో ఎటువంటి నోటీసు లేకుండా ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశంపైన అయినా ప్రశ్నలను అడుగవచ్చు.
* శూన్యకాలం ఇవ్వాలా? వద్దా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారు.
జీరో అవర్ అనేది భారత పార్లమెంట్ ప్రజాస్వామ్యం సృష్టించిన ఒక నూతన భావన.
అర్థగంట చర్చ:
ఏదైనా ఒక ప్రజాసమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి సంబంధించినది. దీనికి స్పీకర్ అనుమతించాలి.
* ఇందులో ప్రశ్నలను అడగటానికి 3 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.
* అర్థగంట చర్చ అనేది సోమ, బుధ, శుక్ర వారాల్లో మాత్రమే ఉంటుంది.
పాయింట్ ఆఫ్ ఆర్డర్:
* సభలో సభ్యుడి ప్రసంగం సభా నియమాలను ఉల్లంఘించినప్పుడు సభ సాంప్రదాయాలను కాల రాసినప్పుడు సభలోని సభ్యుడు ఎవరైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తవచ్చు.
* పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇవ్వాలా? వద్దా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారు.
సమాపణ తీర్మానం:
పార్లమెంటు సమావేశాలు గడుపు ముగియడానికి సమయం ఆసన్నం కాగా ఆమోదించాల్సిన బిల్లుల సంఖ్య అధికంగా ఉంటే, అన్ని బిల్లులను సమఘ్రంగా పరిశీలించి, చర్చించి ఆమోదించడం సాధ్యంకాదు. అటువంటి పరిస్థితిలో సమాపణ తీర్మానం చేసి అన్ని బిల్లులను మూకుమ్మడిగా ఆమోదిస్తారు. దీనినే ‘గిలిటెన్ ఓటింగ్’ లేక బిల్లులను గిలిటెన్ చేయడం అంటారు.
సభా హక్కుల తీర్మానం:
సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సరియైన సమాధానం ఇవ్వకున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా, సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా సభా సాంప్రదాయాలను అగౌరవ పరచినా, సభాహక్కుల తీర్మానంను ప్రవేశపెడతారు.
దీనికి స్పీకర్ అనుమతి అవసరం.
ఓట్ ఆన్ అకౌంట్: (తాత్కాలిక బడ్జెట్):
ఏ కారణం చేత అయినా మార్చి 31లోపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆమోదించానికి సమయం చాలనపుడు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదం పొందుతుంది.
* దీని మూలంగా ఏప్రిల్ 1నుండి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ శాఖలు తాత్కాలిక అవసరాల నిమిత్తం కొంత బడ్జెట్‌ను అడ్వాన్స్‌గా పొందుతారు.
పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆమోదించే సందర్భంలో తాత్కాలిక బడ్జెట్‌ను క్రమబద్ధం చేస్తారు.
రాజ్యాంగంలోను, పార్లమెంటరీ రూల్స్ బుక్‌లోనూ తాత్కాలిక బడ్జెట్ ప్రస్తావించలేదు. ఇప్పటివరకు 11సార్లు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అవిశ్వాస తీర్మానం:
ఈ తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.దీనికి కారణమే అనవసరం. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని పడగొట్టడం.
ముఖ్యంగా ఈ తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడ్తుంది.
అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది స్పీకర్ నిర్ణయాధికారం.
అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరుగుతుంది.
చర్చ తరువాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్‌లో ప్రభుత్వం ఓడిపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాలి.
* అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టదలచిన సభ్యుడు సమావేశానికి అర్థగంట ముందు నోటీసు ఇవ్వాలి.
అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్‌ను ఓటింగ్ అనరు. ట్రూత్ ఓట్ అంటారు.
తీర్మానంను ప్రవేశపెట్టిన పది రోజుల్లోగా చర్చ జరగాలి. దీనికి 50 మంది సభ్యుల మద్దతు కావాలి.
అభిశంసన తీర్మానం:
దీనిని కూడా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి.
దీనికి కారణాలు అవసరం.
దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని విమర్శించడం.
దీనికి 50 మంది సభ్యుల మద్దతు కావాలి. దీనికి స్పీకర్ అనుమతించాలి.
* ఒక మంత్రి లేదా ఇద్దరు మంత్రులు లేక మొత్తం మంత్రి మండలిపై దీన్ని ప్రవేశపెట్టవచ్చు. ఆ తర్వాత చర్చ జరుగుతుంది. చర్చ తరువాత ఓటింగ్ ఉంటుంది.
* ఓటింగ్‌లో ప్రభుత్వం ఓడిపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.
ఇది రాజ్యాంగ, పరిపాలనా, రాజకీయపరమైన బాధ్యత కాదు. కేవలం నైతిక బాధ్యత.
వాయిదా తీర్మానం:
ఒక ప్రజా ప్రాముఖ్యం కలిగిన ఆకస్మిక లేక హఠాత్ సంఘటన చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
దీనికి 50 మంది సభ్యుల మద్దతు కావాలి.
ఓటింగ్ ఉండదు.
సావధాన తీర్మానం:
ప్రజాప్రాముఖ్యం కలిగిన ఒక సమస్యను అత్యవసరంగా చర్చించడానికి దీనిని ప్రవేశపెడతారు. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్‌కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి. స్పీకర్ అనుమతి లభించినట్లైతే 2 2/1 గం. చర్చ జరగడానికి వీలుంటుంది. అపుడు సంబంధిత మంత్రి, సంబంధిత అంశంపై ప్రకటన చేయాల్సి ఉంటుంది.
కోత తీర్మానం: ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరుతూ సమర్పించిన బడ్జెట్ మొత్తంలో కొంత తగ్గింపును కోరుతూ చేసే ప్రతిపాదనలను కోత తీర్మానాలు అంటారు. వీటికి స్పీకర్ అనుమతించాలి.
ఇవి మూడు రకాలుగా ఉంటాయి.
పొదుపు కోత: ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తాన్ని కొంత మేరకు (నిర్ణీత మొత్తం) తగ్గించమని చేసే ప్రతిపాదన.