<b> వందేమాతరం ఉద్యమం, బెంగాల్ విభజన </b>


<b> వందేమాతరం ఉద్యమం, బెంగాల్ విభజన </b>

వందేమాతరం ఉద్యమం, బెంగాల్ విభజన

1905లో పాలనా సౌలభ్యం కోసం అనే కారణంతో బెంగాల్‌ను తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్‌గా లార్‌‌డ కర్జన్ విభజించాడు. హిందూ, ముస్లింల ఐక్యతను దెబ్బతీసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. తూర్పు బెంగాల్‌లోని ప్రధాన ప్రాంతాలు.. అస్సాం, చిట్టగాంగ్, ఢాకా, రాజాషాహీ, తిప్పెరా. దీని రాజధాని ఢాకా. ఉప రాజధాని చిట్టగాంగ్. పుల్లర్‌ను బెంగాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించి కర్జన్ ఇండియా వదిలి బ్రిటన్‌కు వెళ్లిపోయాడు. 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది.

1905 ఆగస్టు 7న కలకత్తాలో స్వదేశీ ఉద్యమం (లేదా) వందేమాతర ఉద్యమం (లేదా) బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ప్రారంభమైంది. వందేమాతరం అని నినదిస్తూ ప్రజలు కుల, మత, లింగ భేదాలకు అతీతంగా బ్రిటిష్ వారి విభజన చర్యను వ్యతిరేకించారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు.. మితవాదులు, అతివాదులుగా విడిపోవడానికి బెంగాల్ విభజన ఒక కారణం.

ఐదో జార్జి: బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు 1911 డిసెంబర్ 11న ఢిల్లీలో ప్రకటించారు. ఈయన ఆనాటి బ్రిటిష్ సార్వభౌముడు.

లార్‌‌డ హార్డింజ్: 1911 బెంగాల్ విభజన రద్దు సమయంలో ఆనాటి భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్.