విజయనగర సామ్రాజ్యం
మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణాన స్థాపించిన హిందూ రాజ్యం విజయనగరసామ్రాజ్యం.
క్రీ.శ. 1336లో తుంగభద్రా నది ఒడ్డున విద్యారణ్య స్వామి సహాయంతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
వీరు సంగమ వంశస్థులు. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పరిపాలించాయి.
రాయచూర్ దోఆబ్ గురించి బహమనీ సుల్తానులకు విజయనగర రాజులకు నిరంతరంయుద్ధాలు జరిగేవి.
సంగమ వంశంలో గొప్పవాడు రెండో దేవరాయులు.
ఇతడి కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారశీక రాయబారి క్రీ.శ. 1443లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు.
సంగమ వంశం తర్వాత సాళువ వంశస్థులు పరిపాలించారు.
సాళువ వంశం తర్వాత తుళువ వంశస్థులు పరిపాలించారు.
తుళువ వంశంలో గొప్ప పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు.
శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 15091529) :
విజయనగర సామ్రాజ్య పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు.
ఉమ్మత్తూరు, శివసముద్రాల పాలకులను ఓడించాడు.
పోర్చుగీసు వారితో స్నేహసంబంధాలు పెంపొందించుకున్నాడు.
క్రీ.శ. 1510లో వారితో సంధి చేసుకుని మేలు జాతి అశ్వాలను పొందాడు.
శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రలతో కటక్‌ను పరిపాలించే గజపతులను, బీజాపూరు సుల్తానులను ఓడించాడు.
ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, బెజవాడ, రాజమండ్రి మొదలైన దుర్గాలను ఆక్రమించాడు.
సింహాచలంలో విజయస్తంభాన్ని ఏర్పాటు చేశాడు.
గజపతి కుమార్తెను రాయలు వివాహం చేసుకున్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు బీజాపూరు సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్షాను రాయచూరు దగ్గర యుద్ధంచేసి ఓడించాడు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో పోర్చుగీసు వర్తకుడు డోమింగ్ పేయిజ్ విజయనగరాన్ని సందర్శించాడు.
రాయలు యుద్ధవీరుడు మాత్రమే కాదు పరిపాలనా దక్షుడు కూడా. ప్రజలను పన్నులతో బాధించలేదు.
నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు.
రాయలు గొప్ప కవి, పండితపోషకుడు.
ఆముక్తమాల్యద కావ్యాన్ని రాశాడు. భువనవిజయం అనే పండిత సభను ఏర్పాటుచేసి పండితులను సత్కరించాడు.
అష్టదిగ్గజాలనే కవులు రాయల ఆస్థానంలో ఉండేవారు.
కన్నడ, తమిళ భాషల కవులను ఆదరించాడు.
ఈయన కాలంలో హజార రామాలయం ప్రసిద్ధిచెందింది.
రామాయణ గాథను శిల్పులు హజార రామాలయం గోడలపై చెక్కారు.
క్రీ.శ. 1529లో శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు.
విజయనగర సామ్రాజ్య పతనం :
క్రీ.శ. 1565లో తళ్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో బీజాపూర్, గోల్కొండ, అహ్మద్‌నగర్ సుల్తానులు ఒక కూటమిగా ఏర్పడి విజయనగరంపై దండెత్తి రామరాజును ఓడించి చంపారు.
తళ్లికోట యుద్ధంలో ఓటమి చెందడంతో విజయనగర సామ్రాజ్య పతనం మొదలైంది.
తిరుమల రాయలు పెనుకొండకు పారిపోయాడు.
తర్వాత విజయనగరాన్ని అరవీటి వంశం పెనుకొండ నుంచి పరిపాలించింది.