ఏప్రిల్ 2020 కరెంట్‌ అఫైర్స్‌

ఏప్రిల్ 2020 కరెంట్‌ అఫైర్స్‌

ఏప్రిల్ 2020 అంతర్జాతీయం

అమెరికా వీసాలపై తాత్కాలిక నిషేధం
అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు. అమెరికన్ల ఉద్యోగాల రక్షణ కోసం అధికారిక ఉత్తర్వులపైఏప్రిల్ 22న సంతకం చేశానన్నారు. కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పలు మినహాయింపులు ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్ కార్డ్ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు.

యూకేలో హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం
యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృది చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు ఏప్రిల్ 23న మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన సారా గిల్బర్ట్ నేతృత్వంలోని బందం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. గతంలో ఈమె ‘ఎబోలా’ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. తాజా కార్యక్రమానికి దాదాపు రూ.180 కోట్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది.

కోవిడ్‌పై చైనా, పాక్ ఉమ్మడి ప్రయోగాలు
కోవిడ్-19 టీకాపై ప్రయోగాల నిర్వహణకు సహకరించాలని పాకిస్తాన్‌ను చైనా కోరింది. ఇస్లామాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) ద్వారా పాక్‌లో కోవిడ్ టీకా ప్రయోగాలు నిర్వహించాలని చైనా సంస్థ సైనోఫార్మ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకూ ఒక నిర్ణయం తీసుకోలేదని, ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తమకు మేలు జరుగుతుందని పాక్ అంటోంది.

డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఏటా ఇచ్చే రూ.152 కోట్లకు అదనంగా మరో రూ.228 కోట్లు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తున్నట్లు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన వెంటనే తాము ఎక్కువ నిధులు ఇస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే.
చైనాలో 2.32 లక్షల కేసులు
చైనాలో కరోనా కేసులను ఆ దేశ ప్రభుత్వం తక్కువగా చెబుతోందని ప్రపంచ దేశాలన్నీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ, చైనాలో దాదాపు 2.32 లక్షల కేసులు నమోదై ఉంటాయని హాంకాంగ్ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 20 నాటికి చైనా 55 వేల మందికి కరోనా సోకినట్లు చెప్పిందని, కానీ అప్పటికే దాదాపు 2.32 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. చైనా చెబుతున్న సంఖ్యకు, నిజమైన సంఖ్యకు వ్యత్యాసం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
5జీ వల్ల కరోనా సోకదు
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి కొట్టి పారేసింది. మొబైల్ ప్రపంచంలో 5జీ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీ ఓ విప్లవం లాంటిది. అయితే ఈ 5జీ టెక్నాలజీ కరోనా వ్యాప్తికి కారణం అవుతోందంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వైరస్ వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదని ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన విభాగం అధికార ప్రతినిధి మోనికా గెనెర్ స్పష్టం చేశారు.

అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న మూడో దేశంగా భారత్
ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

  • 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ.
  • మొత్తమ్మీద టాప్-5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది.
  • సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, చైనా, భారత్ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి.
  • ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
  • 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
  • ఆసియాలో శక్తివంతమైన జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది.

సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు.

వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకం ఎత్తివేత: డబ్ల్యూటీవో
2020 సంవత్సరానికి వివిధ ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాల కింద డబ్ల్యూటీవో(వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) సభ్య దేశాలు దాదాపు 84 శాతం వైద్య పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశాయని డబ్ల్యూటీవో తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. తమ వైద్య పరికరాల ఎగుమతుల్లో చైనా 27 శాతం, ఇటలీ దాదాపు 75 శాతం తమతో ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలున్న సభ్య దేశాలకు చేస్తాయని నివేదికలో పేర్కొంది. 1995 నుంచి భారత్ డబ్ల్యూటీవో సభ్య దేశంగా ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతం వెంటిలేటర్లు, మాస్క్‌లు తదితర వైద్య ఉపకరణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. వైద్య ఉత్పత్తులను ఎగుమతి చేసే టాప్ 10 దేశాలు.. ఏదో ఒక ప్రాంతీయ వాణిజ్య ఒప్పంద పరిధిలోనే ఉన్నాయి.

ఆరోగ్య సంక్షోభంలో దక్షిణాసియా చిన్నారులు
దక్షిణాసియాలో కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలకు అంతరాయం కలుగుతోంది. చిన్నారుల ప్రాణరక్షక టీకాలను అందించకపోతే దక్షిణాసియాలో మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీయవచ్చనని ‘యూనిసెఫ్’ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయించుకోని, లేదా అరకొరగా టీకాలు వేయించుకున్న చిన్నారుల్లో దాదాపు పావుభాగం అంటే 45 లక్షల మంది దక్షిణాసియాలోనే ఉన్నారనీ, వారిలో 97 శాతం మంది భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉన్నారని ఏప్రిల్ 28న వెల్లడించింది. రవాణాపై ఆంక్షలు, విమానాల రద్దు కారణంగా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటిపోయాయని, వ్యాక్సిన్‌ల తయారీ కూడా తీవ్రంగా ప్రభావితమైందనీ యూనిసెఫ్ రీజనల్ హెల్త్ అడ్వైజర్ పాల్ రట్టర్ అన్నారు.
యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాదులు కుట్ర..
యువత, శాంతిభద్రతలు అనే అంశంపై చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించి అయిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటై మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో పనిలేక తీవ్ర నిరాశ నిస్పహల్లో ఉన్న యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసాధారణ పరిస్థితులున్న ఈ తరుణంలో ఒక తరాన్ని పోగొట్టుకోలేమని అన్నారు.

వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మరణాలు
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్ అమెరికాలో వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మందిని బలితీసుకుంది. అమెరికాలో పదిలక్షలకుపైగా కోవిడ్ కేసులు ఉండగా, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60వేలు దాటింది. ఇది ఇరవై ఏళ్లపాటు వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 1955లో మొదలైన వియత్నాం యుద్ధం 1975లో ముగియగా 58,220 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. పదిలక్షల కంటే ఎక్కువమంది కరోనా బాధితులున్న తొలిదేశంగానూ అమెరికా ఓ రికార్డు సష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 32 లక్షలకు చేరువలో ఉంది.
నిపుణుల బృందం ఏర్పాటు
లాక్‌డౌన్ ఎత్తివేత ఎలా జరగాలన్న అంశంపై ప్రభుత్వం ఒక నిపుణుల బందాన్ని ఏర్పాటు చేసింది. మాస్టర్‌కార్డ్ సీఈవో, భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా, టండన్ కేపిటల్ అసోసియేట్స్‌కు చెందిన చంద్రిక టండన్, హోటల్స్ అసోసియేషన్ సీఈవో విజయ్ దండపాణిలు ఈ బృందం సభ్యులుగా నియమితులయ్యారు.

30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం: ఐఎల్‌ఓ
కరోనా వైరస్ కారణంగా 2020 ఏడాది రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. లాక్‌డౌన్ పెరగడం కారణంగా ఈ సంఖ్య పెరిగిందని పేర్కొంది.. లాక్‌డౌన్ కారణంగా 19.5 కోట్ల ఉద్యోగాలుపోయే ప్రమాదం ఉందని ఐఎల్‌ఓ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
చైనా పార్లమెంట్ సమావేశాలు
కరోనా నేపథ్యంలో రద్దయిన పార్లమెంటు సమావేశాలను 2020, మే 22వ తేదీ నుంచి నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మూడో సమావేశాలను మార్చిలో నిర్వహించాల్సి ఉండగా కరోనాతో వాయిదాపడ్డాయి. వైరస్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో వీటిని మే 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారిక వార్తా పత్రిక షిన్‌హువా ఒక కథనాన్ని ప్రచురించింది.

దక్షిణ కొరియాలో అధికార పార్టీ విజయం
సియోల్: కరోనా కట్టడిలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు చూపించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆధ్వర్యంలో అధికార డెమొక్రాటిక్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. మొత్తం 300 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో మూన్ నేతృత్వంలో లెఫ్ట్ పార్టీల కూటమికి 180 సీట్లు వస్తే, ప్రతిపక్ష కన్జర్వేటివ్ యునెటైడ్ కూటమి 103 స్థానాలు దక్కించుకుంది. 1987 తర్వాత దక్షిణ కొరియాలో ఏ పార్టీకి ఈ స్థాయి విజయం దక్కలేదు. కరోనాని అరికట్టడంలో అధ్యక్షుడు చూపించిన పనితీరుకే ప్రజలు మూన్‌కే మళ్లీ పట్టం కట్టారు.
టీకా ఒక్కటే మార్గం..
కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు.
ఆఫ్రికాలో 3 లక్షల మంది మరణిస్తారు: యూఎన్
కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసినప్పటికీ 2020 ఏడాది ఆఫ్రికా ఖండంలో 3 లక్షల మరణాలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ ఆఫ్రికా విభాగం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మృతుల సంఖ్య 33 లక్షల వరకు కూడా ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్ సోకుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా కేసులు 20 వేలకు చేరుకున్నాయి.
దక్షిణాఫ్రికాకు భారత్ సహకారం: మోదీ
కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను తక్షణమే సరఫరా చేస్తామని ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాపోసాతో కోవిడ్ మహమ్మారిపై చర్చించినట్టు ప్రధాని ట్వీట్ చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్‌సీసీతోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంక్షోభం గురించి చర్చించినట్టు ప్రధాని వెల్లడించారు.

కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 18న ప్రకటించారు.
వూహాన్ మార్కెట్‌లో ఆ గబ్బిలాలు లేవా ?
కరోనా వైరస్ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్ న్యూస్ చానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి పేషెంట్ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది.
ల్యాబ్‌లో భద్రత కరువు?
వూహాన్‌లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది.
ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు?
వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్ మార్కెట్ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి.

వైరస్ ల్యాబ్ నుంచి రాలేదు: వూహాన్ ల్యాబ్ చీఫ్
చైనాలోని వూహాన్‌లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కోవిడ్-19(కరోనా వైరస్) బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ తోసిపుచ్చారు. కరోనా వైరస్ బట్టబయలు అయ్యాక తొలిసారిగా ల్యాబ్ డెరైక్టర్ యాన్ జిమింగ్ ఏప్రిల్ 19న మీడియాకి ఇంటర్వూ ఇచ్చారు. ‘‘ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు. మరోవైపు వూహాన్‌లో వైరస్ అత్యంత తక్కువ ప్రమాదకరంగా ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

చైనా నుంచి మరో 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
కోవిడ్-19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను భారత్‌కు పంపినట్లు చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కిట్లను గ్వాంగ్‌ర నుంచి విమానంలో రాజస్తాన్, తమిళనాడుకు పంపామన్నారు. చైనా గతవారం 6.50 లక్షల యాంటీబాడీ కిట్లు, ఆర్‌ఎన్‌ఏ కిట్లను భారత్‌కు పంపింది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది రక్షణ కోసం భారత్ ఇప్పటికే 1.50 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ దుస్తుల కోసం చైనా కంపెనీలకు ఆర్డరిచ్చింది.

అమెరికా విచారణకు చైనా నిరాకరణ
కరోనా వైరస్ పుట్టుకపై విచారణకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది.మేము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదని ఏప్రిల్ 20న తెలిపింది. కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది. ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. ‘వైరస్ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు.

భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నేపథ్యంలో చైనా సహా పొరుగుదేశాలు ’ఆవకాశవాద టేకోవర్’లకు పాల్పడకుండా భారత్ కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న, లేదా భవిష్యత్తు ఎఫ్‌డీఐల (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విషయంలోనూ ఓనర్‌షిప్ బదిలీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

తొలిసారిగా మైనస్‌లోకి ముడి చమురు ధరలు
అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా ‘నెగిటివ్’(మైనస్)లోకి జారిపోయాయి. అమెరికాలో నిల్వ సామర్థ్యం లేకపోవడం, కరోనా వైరస్ కల్లోలంతో పలు దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో డిమాండ్ బాగా తగ్గడం, లాక్‌డౌన్ ముగిసి డిమాండ్ ఎప్పుడు పుంజుకుంటుందో స్పష్టత లేకపోవడం, ట్రేడర్లు చమురు డెలివరీలకు ఇష్టపడకపోవడంతో ధరలు ఈ రేంజ్‌లో పడిపోయాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు ధర (మే ఫ్యూచర్స్) ఏప్రిల్ 17న ఒక్క బ్యారెల్‌కు 18.27 డాలర్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 20న ఒక దశలో 220 శాతం (40 డాలర్లకు) పైగా నష్టంతో మైనస్ 28 డాలర్లకు పడిపోయింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్‌లో డబ్ల్యూటీఐ చమురు 1983 ఏప్రిల్ నుంచి ట్రేడవడం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అత్యధిక కనిష్ట ధర. కాగా జూన్ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ మాత్రం 22.25 బ్యారెల్ వద్ద ట్రేడ్ అవుతోంది. మే, జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా (స్ప్రెడ్) భారీగా (40 డాలర్లకు మించి) ఉండటం విశేషం. రెండు వరుస నెలల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా ఈ రేంజ్‌లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి.

కరోనాతో ఆకలికేకలు రెట్టింపు: ఐరాస
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య కోవిడ్-19 కారణంగా రెట్టింపు కానుందని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఒక నివేదికను సమర్పించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన ప్రపంచ ఆర్థిక రంగం అంతర్జాతీయంగా ఆకలికేకలను మరింత పెంచే అవకాశం ఉన్నదని ఈ నివేదికలో వెల్లడైంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తోంటే, కోవిడ్ ప్రభావంతో 2020 యేడాదికి ఈ సంఖ్య మరో 13 కోట్లు పెరిగి, 26.5 కోట్లకు చేరుతుందని ఆ రిపోర్టు అంచనా వేసింది. 50 దేశాలకు చెందిన 2019 ఏడాది రిపోర్టులను 2020 ఏడాదితో పోల్చి చూస్తే ఆహార సంక్షోభం 12.3 కోట్లకు అంటే పది శాతం పెరిగింది.
158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు ఆటంకం
కరోనా వైరస్ ప్రపంచ విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు 191 దేశాల్లో విద్యాసంస్థలు మూతపడగా.. 158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఇలా అన్ని సంస్థల్లోని బోధన నిలిచిపోయింది. విద్యారంగంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అధ్యయనం చేస్తూ నివేదికలను విడుదల చేస్తోంది.

కరోనా జంతువుల నుంచే పుట్టింది: డబ్ల్యూహెచ్‌ఓ
కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని, ల్యాబ్‌లో వైరస్ ఉద్భవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అన్నిరకాల ఆధారాలు కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని రుజువు చేస్తున్నాయని ఏప్రిల్ 21న తెలిపింది. కోవిడ్-19 లేబొరెటరీలో సృష్టించింది కాదని స్పష్టం చేసింది. అయితే గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా ఎలా వ్యాపించిందన్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు కనుగొనాల్సి ఉందని పేర్కొంది.
ప్రపంచానికి చెమటలు పట్టిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తమ సృష్టి కాదని, అపనవసరంగా నిందలు వేయడం తగదని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారులు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్‌వో వ్యక్తం చేసింది.

ఇమిగ్రేషన్ వీసాలపై నిషేధం: ట్రంప్
అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే అధికారిక ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదృశ్య శత్రువైన కరోనా వైరస్ దాడి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు, అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 20న ట్వీట్ చేశారు.
హెచ్1బీ పైనా ప్రభావం
ట్రంప్ సంతకం చేయనున్న ఉత్తర్వుల్లో ఏం ఉండబోతోందన్నది, ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేయనున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇమిగ్రేషన్ వీసాలపైననే తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ట్రంప్ ట్వీట్ చేసినప్పటికీ.. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ఆ ట్వీట్‌లో ప్రస్తావించినందువల్ల నాన్- ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే.. విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా ఇప్పటికే యూరోప్, చైనా, కెనడా, మెక్సికోల నుంచి విదేశీయులెవరూ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. అన్ని వీసా సేవలను నిలిపేసింది. కరోనా కారణంగా అమెరికా ఆర్థికంగా భారీగా దెబ్బ తిన్నది. ఇప్పటికే 2.2 కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కోవిడ్-19 ఫండ్‌కు పాక్ 3 మిలియన్ డాలర్ల విరాళం
సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం మూడు మిలియన్ డాలర్లు(రూ.22.81కోట్లు) విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నిధులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సార్క్ కార్యదర్శి నియంత్రణలోనే ఉండాలని తెలిపింది. అలాగే, నిధుల వినియోగం విషయంలో అన్ని సభ్యదేశాలను సంప్రదించి.. విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరింది. కరోనాపై పోరుకు సార్క్ దేశాలు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు.

చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ దేశాలు అంగీకారం
రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్, భాగస్వామ్య దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ ఏప్రిల్ 10న వెల్లడించింది. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు తాజా నిర్ణయం తీసుకున్నాయని... ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం.. 2020, జులై వరకు రోజుకు 10 మిలియన్ బ్యారెళ్లు, ఆ తర్వాత నుంచి ఏడాది చివరి వరకు రోజుకు 8 మిలియన్ బ్యారెళ్లు, 2021 ప్రారంభం నుంచి 16 నెలల వరకు రోజుకు 6 మిలియన్ బ్యారెళ్లు చొప్పున ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి ఉంటుంది.

కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత సూచీలో భారత్‌కు అగ్రస్థానం
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికా, బ్రిటన్ తదితర అగ్ర రాజ్యాల కంటే భారత్ ఎంతో మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వపరంగా సన్నద్ధత సూచీలో మన దేశం ఆగ్రస్థానంలో నిలిచిందని ‘ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్ (ఓఎక్స్‌సీ జీఆర్‌టీ) నివేదిక పేర్కొంది. ఆ నివేదికను ఏప్రిల్ 11న విడుదల చేశారు.
నివేదిక ప్రకారం...

  • కరోనా సన్నద్ధత సూచీలో మార్చి 9న 47.6 పాయింట్ల వద్ద ఉన్న భారత్ ఏప్రిల్ 10 నాటికి 100 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
  • స్పెయిన్, ఇటలీ 95.20 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. 80.90పాయింట్లతో జర్మనీ మూడో స్థానం, 71.40 పాయింట్లతో బ్రిటన్ నాలుగో స్థానం, 66.70పాయింట్లతో అమెరికా ఐదో స్థానంలో ఉన్నాయి.

6 దేశాలు.. 33 రోజులు

  • కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ ప్రభుత్వాల సన్నద్ధత, తీసుకున్న చర్యలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం జరిపింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
  • వైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉన్న మార్చి 9 నుంచి ఏప్రిల్ 10 వరకూ ప్రభుత్వాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు.
  • 12 అంశాల ప్రాతిపదికగా అధ్యయనం చేశారు. ఈ 12 అంశాల్లో లాక్‌డౌన్ అమలు, ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను చేపట్టడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తక్షణ చర్యలు, ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టడం, వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యవసర నిధుల కేటాయింపు, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం, వైరస్ సోకినవారు ఎవరెవరిని కలిశారో గుర్తించడం వంటివి ఉన్నాయి.

అమెరికాలో అత్యవసర పరిస్థితి విధింపు
కోవిడ్ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ కేసులు, మృతుల సంఖ్యలో అమెరికా అన్ని దేశాలను దాటేసి పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5 లక్షల 50 వేలకు చేరుకుంది. కోవిడ్ మతులు ఇటలీని మించిపోయి 20 వేలు దాటిపోవడంతో అమెరికా ప్రభుత్వం ఏప్రిల్ 12న మహా విపత్తుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారంతో వ్యోమింగ్ రాష్ట్రాన్ని కూడా కోవిడ్ విపత్తు పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితులు విధించినట్టయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
కోవిడ్‌ను మహా విపత్తుగా గుర్తించడం వల్ల వైరస్ ముప్పు ఉన్నంతకాలం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిధులను అన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు నేరుగా వైట్ హౌస్ నిధులు అన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది.

అమెరికాకు చేరుకున్న క్లోరోక్విన్ మాత్రలు
కరోనా వైరస్‌ను నిరోధించడంలో అత్యంత కీలకంగా భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే క్లోరోక్విన్ మాత్రలు భారత్ నుంచి అమెరికాకు చేరుకున్నాయి. అమెరికా కోరినట్టుగా 35.82 లక్షల మాత్రలతో పాటు ఇతర ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థం 9 మెట్రిక్ టన్నుల్ని ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపింది. అవన్నీ ఏప్రిల్ 11న న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ ట్వీట్ చేశారు.

స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు డేంజర్: డబ్ల్యూహెచ్‌వో
స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ కంటే కరోనా వైరస్ 10 రెట్లు అధిక ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కరోనా అనేది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని ఏప్రిల్ 13న తెలిపింది. కరోనా నియంత్రణ చర్యలను ఒకేసారి కాకుండా, దశల వారీగా ఎత్తివేయడమే సరైందని సూచించింది. కరోనా మహమ్మారిని సమూలంగా అంతం చేయాలంటే శక్తివంతమైన వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో చీఫ్ గా టెడ్రోస్ అధనామ్ ఉన్నారు.

డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తున్నాం: ట్రంప్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్(కోవిడ్-19 )సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 15న వెల్లడించారు. ‘‘కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిన తీరు సరైంది కాదు. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఏడాదికి 400 నుంచి 500 మిలియన్ డాలర్లు డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్నారు. చైనా కేవలం 40 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోంది. భారీ మొత్తంలో నిధులు సమకూరుస్తున్న అమెరికాకు.. సంస్థను జవాబుదారీగా ఉండాలని పట్టుబట్టడం అనేది తన కర్తవ్యంలో భాగమే’’అని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్ నిర్ణయం భేష్ : డబ్ల్యూహెచ్‌ఓ
లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ‘భారత్‌లో కరోనా కేసులు ఎంతవరకు తగ్గుముఖం పడతాయో ఇప్పట్నుంచో చెప్పలేంగానీ దేశం ఆరువారాల పాటు లాక్‌డౌన్‌లో ఉండడం వల్ల ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తారని, దీని వల్ల వ్యాప్తిని నిరోధించవచ్చు’అని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజనల్ డెరైక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రాపాల్ సింగ్ ఏప్రిల్ 14న అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శిస్తోందని ఆమె కొనియాడారు.

హాకీ చాంపియన్‌షిప్‌లు వాయిదా..
కోవిడ్-19 లాక్‌డౌన్ పొడిగింపుతో హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి జాతీయ చాంపియన్‌షిప్‌లన్నీ నిరవధికంగా వాయిదా వేసింది. ప్లేయర్లు, కోచ్‌లు, నిర్వాహకుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఐ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.

ఏప్రిల్ 24 నుంచి ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు
వైరస్‌లు, అంటురోగాల బారిన పడకుండా మానవ శరీరాన్ని కాపాడే వ్యాక్సిన్ విలువ వెలకట్టలేనిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ప్రపంచంలో దాదాపు 2 కోట్ల మంది చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. 2020, ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొంది. ఈ వారోత్సవాల్లో మానవ శరీరాన్ని రోగనిరోధకంగా మార్చేందుకు అవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలను మానవాళికి తెలపాలని సూచించింది. ‘వ్యాక్సిన్ ఫర్ ఆల్’ నినాదంతో ముందుకెళ్లాలని, ప్రపంచంలో అందుబాటులోకి రావాల్సిన అన్ని రకాల వైద్య సదుపాయాలను ప్రజలకు తెలపాలని పిలుపునిచ్చింది.

కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష అమలు
కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)పై ఇప్పటిదాకా చట్టపరమైన చర్యలు తీసుకున్న కువైట్... ఈసారి అత్యవసర క్షమాభిక్ష అమలు చేయడమే కాకుండా సొంత ఖర్చులతో వారిని స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను వారి సొంత దేశాలు పంపేందుకు గల్ఫ్ దేశాలు క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) అమలు చేస్తుండటం తెలిసిందే. 2018 జనవరిలో దీర్ఘకాలిక ఆమ్నెస్టీని అమలు చేసిన కువైట్ ప్రభుత్వం... ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో అత్యవసర క్షమాభిక్షను తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ షెడ్యూల్ ప్రకటించిన కువైట్.. భారత్‌కు సంబంధించిన కార్మికుల దరఖాస్తుల ప్రక్రియను ఏప్రిల్ 20 నుంచి మొదలుపెట్టనుంది.

కరోనా కాలంలో ఎన్నికలకు వెళ్ళిన తొలిదేశం
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నప్పటికీ దక్షిణ కొరియాలో జరిగిన ఎన్నికల్లో గతమూడు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కోవిడ్ ప్రబలిన తరువాత ప్రపంచంలో ఎన్నికలకు వెళ్ళిన తొలిదేశం దక్షిణ కొరియానే. కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణాచర్యల మధ్య ఓటింగ్ జరిపారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, చేతికి గ్లౌజ్ పెట్టుకొని ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈసారి అత్యధికంగా 66.2 శాతం పోలింగ్ నమోదు అయినట్టు జాతీయ ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 15న వెల్లడించింది. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో 300 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా మూన్ జే ఇన్ ఉన్నారు.

భారత్ అనుమతినిచ్చింది: మలేషియా
ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19)ను కట్టడి చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమకు విక్రయించేందుకు భారత్ అంగీకరించిందని మలేషియా మంత్రి కౌముర్దీన్ జాఫర్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 14న మలేషియాకు 89,100 టాబ్లెట్లు ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతినిచ్చింది. మరిన్ని టాబ్లెట్లు తెప్పించునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. హైడ్రాక్సీక్లోరోక్విన్ లభ్యతపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది’’అని రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే భారత ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కరోనా కట్టడిలో సత్పలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాల్సిందిగా మలేషియా భారత్‌ను అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్, మాల్దీవులు తదితర దేశాలకు భారత్ ఈ టాబ్లెట్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే.

అడవి జంతువుల మాంసం నిషేధించిన తొలి చైనా నగరం
కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా చైనాలోని షెన్‌జెన్ నగరం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు, సహా ఇతర అడవి జంతువుల మాంసంపై శాశ్వత నిషేధం విధించింది. 2020, మే 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని షెన్‌జెన్ నగర అధికారులు వెల్లడించారు. ’ఆధునిక సమాజానికి సార్వత్రిక నాగరికత అవసరం’ అని ప్రకటించారు. దీంతో పిల్లి, కుక్క మాంసం వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించిన చైనా మొట్టమొదటి నగరంగా షెన్‌జెన్ అవతరించింది. మరోవైపు ఇది చారిత్రాత్మక నిర్ణయంమంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రముఖుడు డాక్టర్ పీటర్ లి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో 2019, డిసెంబరులో మొట్టమొదట మొట్టమొదట కరోనా వైరస్‌ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో షెన్‌జెన్ నగరం తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్‌జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే.

భారత్‌కు ప్రపంచ బ్యాంకు భారీ అత్యవసర సాయం
మహమ్మారి కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించింది. ఈ మేరకు భారత్ చేసిన అభ్యర్థనపై వరల్డ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న జరిగిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల సమావేశం అనంతరం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు వరల్డ్ బ్యాంకు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలకు తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్ డాలర్లను కేటాయించింది. స్కీన్రింగ్, కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్, నూతన ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించనున్నారు.
పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు..
అభివద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్-19 నిర్మూలనకు నిధులు కేటాయించిన ప్రపంచ బ్యాంకు దక్షిణాసియాలో భారత్ తర్వాత.. పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న15 నెలల్లో 160 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రణాళికలు వేస్తున్నామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై, నిరుపేదలను ఆదుకునేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేస్తామని పేర్కొంది. భారత్‌లో ఇప్పటివరకు 2500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56 మంది చనిపోయారు.

కరోనా కట్టడిపై ఐక్యరాజ్యసమితి తొలిసారి తీర్మానం
కరోనా వైరస్‌పై పోరులో సభ్య దేశాలకు సహకారం అందించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేరకు ‘‘కోవిడ్-19 వ్యాధిపై పోరాటానికి ప్రపంచ దేశాల సంఘీభావం’’అన్న పేరుతో రూపొందించిన తీర్మానాన్ని ఐరాస సర్వ ప్రతినిధి సభ ఏప్రిల్ 3న ఆమోదించింది. తీవ్రంగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం కలిగిస్తున్న కోవిడ్-19పై యూఎన్ తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. మహమ్మారిపై పోరులో ఆయా ఆదేశాలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయ సహకారాన్ని ఐరాస అందించనుంది. ఈ తీర్మానంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంకా చర్చించాల్సి ఉంది. ప్రపంచ ప్రజల ఆరోగ్యం, భద్రతపై ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయని తీర్మానం పేర్కొంది.
గాలి ద్వారా వ్యాపించదు
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే ఈ వైరస్ సోకుతుందని తన తాజా మ్యాగజైన్లలో వెల్లడించింది.
2.5 కోట్ల ఉద్యోగాలకు కోత: అంతర్జాతీయ కార్మిక సంస్థ
కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని పేర్కొంది.
ఐఎల్‌ఒ నివేదికలోని అంశాలు..

  • అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
  • యూరప్‌లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్‌లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27 శాతం సిబ్బందిని తగ్గించారు.
  • స్పెయిన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది.
  • చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా.
  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్టియ్రాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది.
  • థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు.

జపాన్‌లో అత్యవసర పరిస్థితి విధింపు
కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నెల రోజులపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఏప్రిల్ 7న ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఇచ్చామని తెలిపారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కరోనాపై పోరుకు 993బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు వివరించారు.

భారత్‌లో కోవిడ్-19 పరీక్షలు విస్తృతంగా జరగాలి
భారత్‌లో కరోనా వ్యాప్తి, తద్వారా సమాజం, ఆర్థిక రంగాలపై పడే ప్రభావంపై కచ్చితంగా ఒక అంచనాకు రావాలంటే కనీసం 10 లక్షల మందికై నా కరోనా పరీక్షలు జరగాలని బ్రిటన్‌కు చెందిన ఏసీఏఎల్‌ఎమ్ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కరోనా పరీక్షలు విస్తతంగా జరగాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ సిఫారసు చేసింది.

వూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత
కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వూహాన్ నగరంలో 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. కరోనా వైరస్ విజంభణ నేపథ్యంలో వూహాన్‌లో జనవరి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రకటించారు. తాజాగా లాక్‌డౌన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడంతో వూహాన్ ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు.

ఏప్రిల్ 2020 జాతీయం

కరోనా పరీక్షలకు మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
కరోనా పరీక్షల నిర్వహణకు రూపొందించిన ‘మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లేబొరేటరీ (ఎంవీఆర్‌డీఎల్)’ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఏప్రిల్ 23న లైవ్ వీడియో ద్వారా ప్రారంభించి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి అందించారు. దేశ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో), ఈఎస్‌ఐసీ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ల్యాబ్.. కరోనా పరీక్షలతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై పనిచేయనుంది.
రోజుకు వెయ్యి పరీక్షల సామర్థ్యం
మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లేబరేటరీ అభివద్ధిలో ఈఎస్‌ఐసీతో కలిసి డీఆర్‌డీవో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) కీలకపాత్ర పోషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారైన ఈ వ్యాన్లలో బయోసేఫ్టీ లెవెల్ (బీఎస్‌ఎల్) -2, లెవెల్ -3 కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఇందులో అన్ని ఎలక్టాన్రిక్ కంట్రోలర్లతోపాటు కంప్యూటర్ నెట్‌వర్క్‌కు అవసరమైన ల్యాన్, టెలిఫోన్, సీసీటీవీలు ఉన్నాయి. దేశంలోనే తొలిదైన ఈ మొబైల్ ల్యాబ్‌లో వైరస్‌ను, దానికి మందులను గుర్తించేందుకు, అందుకు వీలుగా వైరస్‌ను పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ఎక్కడైనా ఏర్పాటు..
రోగ నిరోధక వ్యవస్థ స్వరూప స్వభావాలను అర్థం చేసుకునేందుకు కావాల్సిన పరీక్షలూ నిర్వహించవచ్చు. కరోనా టీకా అభివృద్ధి, వైరస్ కల్చర్, డ్రగ్ స్కీన్రింగ్, వ్యాక్సిన్ డెవలప్‌మెంట్, ప్లాస్మా థెరపీ, ఇమ్యూన్ ప్రొఫైలింగ్ పరీక్షలతో పాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. అవసరాన్ని బట్టి దీన్ని దేశంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. రోజుకు సగటున వెయి్య పరీక్షలు చేయవచ్చు.

ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం
కేవలం వందల రూపాయల ఖర్చుతో తయారయ్యే ‘కోవిడ్-19 డిటెక్షన్ కిట్’ను దేశీయ టెక్నాలజీతో ఢిల్లీ ఐఐటీ రూపొందించింది. దీనిని వైద్య పరిశోధనలో అత్యున్నత పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదించింది. కోవిడ్‌ను గుర్తించడంలో ఈ కిట్ వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారితంగా ఈ పరికరం పనిచేస్తుంది. సరైన పారిశ్రామిక భాగస్వామి దొరికితే వారం పది రోజుల్లో ఈ కిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఢిల్లీ ఐఐటీ సన్నాహాలు చేస్తోంది.
తక్కువ ధరలో అందుబాటులోకి..
కరోనా జన్యుక్రమంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో బలహీనమైన ఆర్‌ఎన్‌ఏ క్రమాలను గుర్తించారు. ఈ అంశం కోవిడ్-19ను గుర్తుపట్టడంలో కీలకంగా మారడంతో పీసీఆర్ ఆధారంగా కిట్‌ను రూపొందించారు. 2020, జనవరి నుంచి తక్కువ ఖర్చుతో తయారయ్యే పరికరాన్ని రూపొందించడంపై ఢిల్లీ ఐఐటీ బందం దృష్టి సారించింది. ఈ పరికరాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ధర కూడా తగ్గే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ పరికరంపై పేటెంట్ కోసం పరిశోధక బృందం దరఖాస్తు చేసింది.

తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బందాలను(ఐఎంసీటీ) పంపుతున్నట్టు కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 24న ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘విపత్తు నిర్వహణ చట్టం-2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది.

ఈ- గ్రామ స్వరాజ్ పోర్టల్ ప్రారంభం
స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ- గ్రామ స్వరాజ్..
పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ- గ్రామ స్వరాజ్’ పోర్టల్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ- ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది.

మే 15 నాటికి 38,220 మరణాలు?
దేశంలో కరోనా బాధితుల మరణాలు, కేసులు భారీగా పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రముఖ సంస్థలు. మే 15వ తేదీ నాటి కల్లా కరోనా వైరస్‌తో మరణించే వారి సంఖ్య 38,220కు చేరుకుంటుందని, మొత్తం కేసులు 30 లక్షలకు చేరుకోనుందని ఇవి అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయని లెక్కలు తేల్చాయి. ఇప్పటి వరకు ఇటలీ, న్యూయార్క్‌ల్లో కరోనా మరణాలు, కేసులపై వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయని తెలిపాయి. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు), ఐఐటీ బోంబే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ(పుణె)ఈ మేరకు ‘కోవిడ్-19 మెడ్ ఇన్వెంటరీ’ పేరుతో ఈ అంచనాలు రూపొందించాయి.
ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి
రాష్ట్రంలో ప్లాస్మాథెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేం దుకు కేంద్రం అనుమతిచ్చిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏప్రిల్ 24న వెల్లడించారు. 4రోజుల కింద ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అను మతినివ్వాలని కేంద్రాన్ని కోరగా, తాజాగా అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల్లో బాగా సీరియస్‌గా ఉన్నవారికి ఈ విధానం ద్వారా చికిత్స చేస్తామన్నారు.

అనంతపురంలో రెండు భారీ పరిశ్రమలు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యపడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్టిక్రల్ బస్ యూనిట్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా ఉత్తర్వులతో వీర్‌వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. అలాగే ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్టాన్రిక్స్ పార్క్‌కు కూడా అడ్డంకులు తొలిగాయి.

భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ను వచ్చే రెండు మూడు వారాల్లో అభివద్ధి చేస్తామని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తామని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఏప్రిల్ 26న ప్రకటించింది. ఈ సంస్థ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. తమ పరిశోధకుల బృందం ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి పనిచేస్తోందని, కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామన్న నమ్మకం ఉందని, మొదటి ఆరు నెలలపాటు నెలకు 50 లక్షల చొప్పున డోసులను తయారు చేస్తామని ‘సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. అనంతరం నెలకు కోటి డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.
వూహాన్‌లో కోవిడ్ రోగులు జీరో
కరోనా వైరస్ పుట్టిన చైనాలో వూహాన్ మరో విజయాన్ని సాధించింది. కోవిడ్-19తో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పతుల్లో లేరు. వ్యాధి నుంచి కోలుకొన్న 11 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చింది. 2019 డిసెంబర్ చివరి వారంలో వైరస్ బయటపడిన తర్వాత తొలిసారిగా కరోనా రోగుల విషయంలో జీరో అన్నది సాధించామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. 76 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉన్న వూహాన్‌లో ఏప్రిల్ 8న లాక్‌డౌన్ ఎత్తేశారు.

ముఖ్యమంత్రులతో పీఎం వీడియో కాన్ఫరెన్స్
రెండో విడత దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 3న ముగుస్తుండటంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 27 వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై వారు చర్చించారు. ‘ఇప్పటివరకు రెండు లాక్‌డౌన్‌లను ప్రకటించాం. రెండూ వేర్వేరు తరహా నిబంధనలున్నవి. ఆ దిశగా ఆలోచించాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు’అని సీఎంలతో మోదీ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నుంచి దశలవారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. కాన్ఫరెన్స్ లో హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయంలోని, ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్), కేసీఆర్(తెలంగాణ), కేజ్రీవాల్(ఢిల్లీ), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), పళనిస్వామి(తమిళనాడు), కన్రాడ్ సంగ్మా(మేఘాలయ), యోగి ఆదిత్యనాథ్(యూపీ) తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీ
మంగళగిరి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో ప్లాస్మా థెరపీకి కేంద్రప్రభుత్వం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్‌లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళగిరిలో ఎయిమ్స్‌లో ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

మైనారిటీ విద్యా సంస్థలకూ నీట్: సుప్రీంకోర్టు
వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రై వేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రై వేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని ఏప్రిల్ 29న తీర్పు వెలువరించింది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రై వేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను విచారించిన ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

జూమ్ సురక్షితమైనది కాదు: కేంద్రం
లాక్‌డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్‌ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 16న ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్‌ను వినియోగించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది.

రోనా బాధితులకు ప్లాస్మా చికిత్స: ఢిల్లీ సీఎం
కరోనా సోకిన వారికి త్వరలోనే ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్రయల్స్ ప్రారంభించామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16న ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ ప్రారంభమవుతుందని, ఇది విజయవంతమైతే త్వరలోనే కరోనా రోగులకు ఈ విధమైన చికిత్స అందిస్తామని వెల్లడించారు.
కరోనా నివారణకు మందు ఇంతవరకు ఎవరు కనుక్కొలేదు. ప్లాస్మా థెరపీలో కరోనా సోకి కోలుకున్న వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్రమంలో కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగులను బతికించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో సక్సెస్ కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేరళకు అనుమతిచ్చింది.

టైమ్స్ ర్యాంకింగ్స్ లో పాల్గొనం: ఐఐటీలు
ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఇచ్చే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్‌ఈ) ర్యాంకింగ్స్ ను ఈ సంవత్సరం(2020) బహిష్కరిస్తున్నట్లు భారత్‌లోని ఏడు ప్రఖ్యాత ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు ప్రకటించాయి. ఉత్తమ విద్యా సంస్థలుగా ప్రకటించేందుకు టీహెచ్‌ఈ అనుసరిస్తున్న ప్రక్రియ పారదర్శకంగా లేదని విమర్శించాయి. బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీలు ఏప్రిల్ 16న ఉమ్మడిగా ఈ ప్రకటన చేశాయి. ‘ఈ సంవత్సరం ర్యాంకింగ్‌‌సలో ఈ ఏడు ఐఐటీలు పాల్గొనడం లేదు. ర్యాంకింగ్ ప్రక్రియ విధి, విధానాలు, పారదర్శకతపై టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు సంతృప్తికర వివరణ ఇస్తే 2021 సంవత్సర ర్యాంకింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తాం’అని స్పష్టం చేశాయి.

ర్థిక మంత్రితో ప్రధాని మోదీ సమావేశం
కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశంపై చర్చించారు. అలాగే భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చలు జరిపారు.
2020-21లో భారత్ వృద్ధి 1.1 శాతం: ఎస్‌బీఐ
కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.1 శాతానికి పడిపోయే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏప్రిల్ 16న వెల్లడించింది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 29 కోట్ల టన్నులు
2020-21 పంట ఏడాదిలో (జులై-జూన్) ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 29.83 కోట్ల టన్నులుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్దేశించుకుంది. జూన్-సెప్టెంబరు మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2020-21 పంట ఏడాది ఖరీఫ్‌లో 14.99 కోట్ల టన్నులు, రబీలో 14.84 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యం విధించుకున్నట్లు వ్యవసాయ కమిషనర్ ఎస్‌కే మల్హోత్రా వెల్లడించారు.
మోదీ ప్రసంగానికి వీక్షకులు 20 కోట్లు
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా టీవీల్లో 20.3 కోట్ల మంది వీక్షించారని బార్క్(బ్రాడ్‌కాస్ట్ ఆడిఝెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) వెల్లడించింది. మొదటి లాక్‌డౌన్ ప్రకటన సమయంలో దేశవ్యాప్తంగా 19.3 కోట్ల మంది టీవీల్లో ప్రధాని ప్రకటనను వీక్షించినట్లు బార్క్ తెలిపింది. దీంతో తన రికార్డును తానే అధిగమించారని పేర్కొంది.

పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
పారాసిటమాల్ మాత్రల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఈ మాత్రలు కీలకంగా పనిచేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మందులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నందున ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఏప్రిల్ 17న కేంద్ర విదేశీ ఎగుమతుల డెరైక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పారాసిటమాల్‌లో వినియోగించే ముడి సరుకు ఎగుమతులపై మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

వ్యవసాయోత్పత్తుల రవాణాకు కిసాన్ రథ్ యాప్
వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ పోర్ట్ అగ్రిగేటర్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘కిసాన్ రథ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏప్రిల్ 17న ఆవిష్కరించారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు 5 లక్షల ట్రక్కులు, 20 వేల ట్రాక్టర్లు ఈ మొబైల్ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘లాక్‌డౌన్ సమయంలో రైతుల తమ ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రక్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మండీలు, ఇతర మార్కెట్లకు తరలించడానికి కిసాన్ రథ్ యాప్ ఉపయోగపడుతుంద’ని అధికారులు తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించడానికి కొద్దిరోజుల క్రితం ఇండియా అగ్రి ట్రాన్స్ పోర్ట్ కాల్ సెంటర్‌ను మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వ్యవసాయోత్పత్తుల రవాణాపై కాల్ సెంటర్
దేశంలో రాష్ట్రాల మధ్య పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇతర వ్యవసాయోత్పత్తుల రవాణా సులభతరం చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 14488 నంబర్‌లోగానీ, 18001804200 నంబర్‌లో గానీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.

రోనా మహమ్మారిపై పోరుకు కోవిడ్ వారియర్స్
కరోనాపై పోరాటంలో రాష్టాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డేటాబేస్‌ను ఏర్పాటు చేసింది. ఆయుష్ వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, నెహ్రూ యువకేంద్ర సభ్యులు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ సభ్యులు, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన సభ్యుల, వాలంటీర్ల పేర్లు, వివరాలతో ఈ డేటాబేస్ సిద్ధమైంది. కోవిడ్ వారియర్స్ అని పిలిచే వీరి సేవలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు, రేషన్ దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనాథలకు సేవలందించేందుకు వాడుకోవచ్చు. https://covidwarriors.gov.in వెబ్‌సైట్‌లో కొవిడ్ యోధుల సమాచారం అందుబాటులో ఉంటుందని కేంద్ర సర్కారు వెల్లడించింది. అలాగే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక సిబ్బంది, స్వచ్ఛంద సేవలకు శిక్షణ ఇచ్చేందుకు https://igot.gov.in/igot అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు నిధులు
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ) మూడు కంపెనీలను నిధులు అందజేయనుంది. ఇందుకోసం క్యాడిలా హెల్త్‌కేర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలను ఎంపిక చేసింది. భారత్ బయోటెక్ ‘ఇన్‌యాక్టివేటెడ్ రేబీస్ వెక్టార్ ప్లాట్‌ఫామ్’ను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేయనుంది. వైద్య పరికరాల తయారీకి మరో 13 కంపెనీలను కూడా డీబీటీ ఎంపిక చేసింది. ఈ 13 సంస్థలకు కూడా డీబీటీ ఆర్థిక సాయం చేయనుంది. నేషనల్ బయోఫార్మా మిషన్ నుంచి నిధులను అందించి, ఒక పరిశోధనా కన్సార్షియం ద్వారా వివిధ దశల్లో వీటి అభివృద్ధిని పరిశీలించనున్నట్లు డీబీటీ తెలిపింది.

చైనా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వాడొద్దు: ఐసీఎంఆర్
కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ను రెండు రోజుల పాటు వాడవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఏప్రిల్ 21న రాష్ట్రాలను కోరింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామంది. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్‌కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్‌ను సరఫరా చేయాలని కోరుతామన్నారు.
5.4 శాతం మాత్రమే..
చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించింది. ఆ కిట్స్ ద్వారా జరిపిన పరీక్షల్లో 90 శాతం సరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తెలిపింది.
రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కు ఆమోదం
ఇప్పటివరకు చేస్తున్న పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) పరీక్షల్లో గొంతు, ముక్కులో నుంచి తీసిన శాంపిల్‌ను పరీక్షించి, కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. అయితే, ఈ విధానంలో ఫలితాలు వచ్చేందుకు 5- 6 గంటల సమయం పడుతుంది. కానీ రక్త పరీక్ష ద్వారా జరిపే రాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌లో ఫలితం అరగంటలోపే వచ్చేస్తుంది. హాట్‌స్పాట్స్‌లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
యూరియాయేతర ఎరువులపై సబ్సిడీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ నిర్ణయం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాపై ఎరువుల సబ్సిడీ భారం రూ. 22,186.55 కోట్లకు తగ్గనుంది. ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై సబ్సిడీ రేట్లను నిర్ణయించేందుకు ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. నైట్రోజన్‌పై సబ్సిడీని కేజీకి రూ. 18.78కి, పొటాష్‌పై సబ్సిడీని కేజీకి రూ. 10.11కి, పాస్ఫరస్‌పై సబ్సిడీని కేజీకి రూ. 14.88కి, సల్ఫర్‌పై సబ్సిడీని కేజీకి రూ. 2.37కి తగ్గించినట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇది నైట్రోజన్‌పై రూ. 18.90గా, పొటాష్‌పై రూ. 11.12గా, ఫాస్ఫరస్‌పై రూ. 15.21గా, సల్ఫర్‌పై రూ. 3.56గా ఉంది. అలాగే, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ(ఎన్‌బీఎస్) ఎరువుల జాబితాలోకి అమ్మోనియం ఫాస్ఫేట్‌ను చేర్చాలన్న ప్రతిపాదనకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల జైలు
వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 22న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.
కొత్త చట్టం ప్రకారం..
మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని మంత్రి జవదేకర్ వివరించారు. ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్-19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై జీఓఎం సమావేశం
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏప్రిల్ 9న కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) చర్చించింది. భౌతిక దూరం పాటించడం సహా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించింది. కరోనాపై పోరు విషయంలో తాము చేపట్టిన, చేపట్టదలచిన చర్యలను వివరించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్ అధ్యక్షతన జరిగిన జీఓఎంకు అధికారులు వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రాలకు మరిన్ని వరులను సమకూర్చే విషయాన్ని కూడా జీఓఎం చర్చించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అమలును కూడా జీఓఎం సమీక్షించింది.

కోవిడ్-19 అత్యవసర ప్యాకేజీకి కేంద్రం ఆమోదం
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి ఏప్రిల్ 9న ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మొదటి దశ కింద రూ.7,774 కోట్లు..
2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు: కేంద్రం
కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకు సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) దశ రాలేదని కేంద్రం ప్రకటించింది. అలాంటిదేమైనా ఉంటే, ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు ముందు మీడియాకే చెప్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఏప్రిల్ 10న వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బారిన పడిన 104 మందిలో 40 మందికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ కానీ, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చరిత్ర కానీ లేదని తేలిందని ఐసీఎంఆర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా, లవ్ అగర్వాల్ పై సమాధానం ఇచ్చారు. మరోవైపు, కోవిడ్-9పై సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలంటూ పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, భారత్‌కు అవసరమైన స్టాక్ ఉన్న తరువాత, మిగతా స్టాక్‌ను ఎగుమతి చేయాలని నిర్ణయించామని తెలిపింది.

ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ ప్రారంభం
విరాళాల ప్లాట్‌ఫార్మ్ ‘గివ్ ఇండియా’ రూ.75 కోట్ల ఆరంభ విరాళంతో ‘ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్’ను (ఐసీఆర్‌ఎఫ్) ప్రారంభించింది. కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి ఐసీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించామని గివ్ ఇండియా ఏప్రిల్ 14న తెలిపింది. కనీసం కోటిమందికై నా సాయమందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గూగుల్.ఓఆర్‌జీ, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా, మ్యారికో, ఉబెర్ ఇండియా తదితర సంస్థలు విరాళాలు అందజేశాయని గివ్ ఇండియా డెరైక్టర్ గోవింద్ అయ్యర్ తెలిపారు.

దేశవ్యాప్తంగా రెడ్‌జోన్‌లో 170 జిల్లాలు
దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్(రెడ్‌జోన్) జిల్లాలుగా గుర్తిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏప్రిల్ 15న రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల ఆధారంగా జిల్లాలను హాట్‌స్పాట్ (రెడ్ జోన్), నాన్ హాట్‌స్పాట్ (ఆరెంజ్), నాన్ ఇన్ఫెక్టెడ్ (గ్రీన్ జోన్) జిల్లాలుగా వర్గీకరించింది. రెడ్‌జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో ఉన్నట్టు తెలిపింది. రెడ్ జోన్‌ను రెండు రకాలుగా ఉపవర్గీకరణ చేసింది. విస్రృతి ఎక్కువగా ఉన్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు, క్లస్టర్లలో విస్రృతి ఉన్నవి 47 జిల్లాలుగా గుర్తించింది. రాష్ట్రాలు ఆయా జోన్లవారీగా నిర్దేశిత కార్యాచరణ ద్వారా వైరస్‌ను అదుపులోకి తీసుకురావాలని సూచించింది. ఇకపై కూడా కేసుల సంఖ్య రెట్టింపయ్యే ప్రాతిపదికన రెడ్ జోన్లను గుర్తించాలని కోరింది. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, 28 రోజుల్లో కొత్త కేసులు లేనిపక్షంలో గ్రీన్ జోన్‌కు మార్చాలని సూచించింది. కేస్ లోడ్, నాలుగు రోజుల్లో రెట్టింపు సంఖ్య నమోదైన జిల్లాలు తదితర అంశాల ప్రాతిపదికన జోన్లుగా వర్గీకరించినట్టు తెలిపింది. ఏపీలో 11 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.

కరోనాపై అవగాహనకు ఆరోగ్య సేతు యాప్
దేశంలో కరోనా వైరస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కరోనాను దరి చేరకుండా అడ్డుకునేందుకు రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఏప్రిల్ 2న ప్రారంభించింది. ఎలక్టాన్రిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ యాప్ కోవిడ్-19 బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది. ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ కేవలం కొత్త కేసులను గుర్తిస్తుందని, కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికి అప్రమత్తత సందేశాలు పంపిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఆరోగ్య సేతు ప్రయోజనాలు..

  • దేశంలో కరోనా కేసుల అప్‌డేట్ తెలుసుకోవచ్చు.
  • కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది
  • కరోనావైరస్ ఉన్న వ్యక్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది.
  • కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించడానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది.
  • కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్రకటనలు, తీసుకునే చర్యలను తెలియజేస్తుంది.

నగరాలు, పట్టణాల్లో మెరుగైన వాయు నాణ్యత: సీపీసీబీ
దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత క్రమంగా పెరుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో వాహనాలు, ఇతరత్రా రూపాల్లోని కాలుష్యం గణనీయంగా తగ్గిపోవడంతో గాలి నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. 2019, మార్చి 29న వివిధ నగరాల్లోని వాయునాణ్యతతో.. 2020 ఏడాది మార్చి 29న అవే నగరాల్లోని గాలి నాణ్యతను పోల్చి చూడగా పలు అంశాలు వెల్లడయ్యాయి.
సమీర్‌యాప్ ద్వారా...
దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్) సీపీసీబీ వాస్తవ సమయం (రియల్‌టైం)లో పరిశీలించి ‘సమీర్‌యాప్’ద్వారా ఆ వివరాలను ఒక సూచీ ద్వారా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. 2019 వేసవి సందర్భంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ మహానగరం వంద పాయింట్లకు పైబడి ఉండగా, ప్రస్తుతం వాయునాణ్యత 68 పాయింట్లుగా ఉంది.
వాయునాణ్యత తీరు...
ఏక్యూఐలో 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛ మైన వాతావరణంతో పాటు అతినాణ్యమైన వాయువు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు లెక్కిస్తారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు మంచి వాయు నాణ్యత ఉన్నట్లు అంచనా వేస్తారు.

వ్యాధి నిర్ధారణ కిట్ల ఎగుమతులపై నిషేధం
కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిర్ధారణ కిట్ల (డయాగ్నొస్టిక్ కిట్ల) ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోఈ కిట్ల అవసరం చాలా వుందని పేర్కొంది. డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతులను (డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్ బ్యాకింగ్, ప్రిపరేషన్ డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్) నిలిపివేస్తున్నామని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. మరోవైపు కరోనావైరస్ నిరోధంలో అవసరమైన రక్షణ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఔషధాల ఎగుమతులపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత
ప్రాణాంతక కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఏప్రిల్ 7న ప్రకటన విడుదల చేశారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీని ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో క్లోరోక్విన్ సహా అవసరమైన ఇతర ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది.

ఎంపీల వేతనాల కోత ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం
కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30 శాతం కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 6న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్-1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్ గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపీల్యాడ్ పథకం నిలిపివేత..
ఎంపీల్యాడ్(ఎంపీ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్) ఫండ్ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020-21, 2021-22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్-19పై పోరుకు వినియోగిస్తారు. లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్‌‌స కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి.

కరోనా మరణాలకూ బీమా పరిహారం
జీవిత బీమా పరిహార ప్రయోజనాలను కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడిన పాలసీదారుల కుటుంబాలకు కూడా అందించనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది. కరోనాతో మరణించిన పాలసీదారుల క్లెయిమ్స్‌కు సైతం బీమా సంస్థలు చెల్లింపులు జరుపుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బీమా సంస్థలు ఇందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే కస్టమర్లకు తెలియజేశాయని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివరించింది. కరోనా క్లెయిమ్స్‌కు ఫోర్స్ మెజూర్ నిబంధన వర్తింపచేయడం లేదని తెలిపింది. సాధారణంగా ఊహించని, నియంత్రించలేని కారణాలతో తలెత్తే క్లెయిమ్‌లను ఈ నిబంధన కింద బీమా సంస్థలు తిరస్కరించవచ్చు. కరోనా వ్యాధికి కూడా ఇది వర్తిస్తుందేమోనని పాలసీదారుల్లో సందేహాలు నెలకొన్న నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్‌గా ఎస్‌ఎన్ భట్టాచార్య ఉన్నారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ
కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అత్యవసరమైతే తప్ప కోర్టులకు రావాల్సిన అవసరం లేదనీ, అన్ని కోర్టులు భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని కోర్టుల్లో విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 6న ఆదేశాలను జారీచేసింది. న్యాయప్రక్రియ సజావుగా సాకేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు దేశంలోని హైకోర్టులన్నింటికీ అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు
కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ 2,500 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. మొత్తం 5 వేల కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా మొదటి దశలో భాగంగా 2,500 కోచ్ లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటితో కొత్తగా 50 వేల ఐసోలేషన్ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.

18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
దక్షిణాది రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు 18 నెలలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌సీఐ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విక్టర్ అమల్‌రాజ్ ఏప్రిల్ 7న ప్రకటన విడుదల చేశారు.

అత్యంత విలువైన మూడవ కంపెనీగా హెచ్‌యూఎల్
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్‌‌స (ఎఫ్‌ఎంసీజీ) దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ ఏప్రిల్ 7న దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా హెచ్‌యూఎల్ అవతరించింది. గ్లాక్సోస్మిత్ కై ్లన్ (జీఎస్‌కే) పీఎల్‌సీకి చెందిన ఆసియా హెల్త్ ఫుడ్ డ్రింక్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించనుంది.

వైద్య సిబ్బంది కోసం పీఎం కల్యాణ్ బీమా పథకం
కోవిడ్-19(కరోనా వైరస్) బాధితులకు చికిత్స అందిస్తూ, లేదా అదే వైరస్ బారినపడి మృతిచెందే వైద్య సిబ్బందికి రూ.50 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్’ ద్వారా ఈ బీమాను అందించనున్నట్లు తెలిపింది. 2020, మార్చి 30 నుంచి 90 రోజులపాటు ఇది అమల్లో ఉంటుందని ఏప్రిల్ 7న పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, విశ్రాంత సిబ్బంది, వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆరోగ్య సేవలు అందించే అవుట్‌సోర్స్, దినసరి సిబ్బందికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకంలో చేరేందుకు వీరెవరూ ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఉచితంగా కరోనా పరీక్షలు: సుప్రీంకోర్టు
అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ లేబోరేటరీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ విషయంలో వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏప్రిల్ 8న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌ల పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు సేవలందించడంలో దాతత్వం చూపాలని వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలను ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, డబ్ల్యూహెచ్‌వో/ఐసీఎం ఆర్ అనుమతి పొందిన ల్యాబ్‌ల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల పేరిట విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, దీన్ని అరికట్టాలని కోరుతూ అడ్వొకేట్ శశాంక్‌దేవ్ సుధీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలకు ప్రజల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశంలో సామాజిక అత్యవసర పరిస్థితి
దేశంలో ప్రస్తుతం ‘సామాజిక అత్యవసర పరిస్థితి(సోషల్ ఎమర్జెన్సీ)’ తరహా అసాధారణ స్థితి నెలకొని ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా నెలకొన్న ఈ స్థితి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రతీ ప్రాణాన్ని కాపాడటమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా అప్రమత్తతను కొనసాగించాలని కోరారు. పార్లమెంట్‌లోని విపక్ష, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఏప్రిల్ 8న ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతల సూచనలను స్వీకరించారు.

2020-21లో వృద్ధి 1.6 శాతమే.గోల్డ్‌మాన్ శాక్స్
కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. 2020-21లో భారత్ వృద్ధి రేటు 1.6 శాతమే ఉండవచ్చని అంచనా వేసింది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే.
ప్యాకేజీ సరిపోదు..
కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60 శాతం ఉండే వినియోగం.. లాక్‌డౌన్ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది.

ఏప్రిల్ 2020 రాష్ట్రీయం

-లెర్నింగ్ యాప్ అభ్యాస ఆవిష్కరణ
ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం విద్యా శాఖ రూపొందించిన ఈ -లెర్నింగ్ యాప్ ‘అభ్యాస’ ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏప్రిల్ 23న సచివాలయంలో ఆవిష్కరించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్కూళ్ల మూతపడటంతో సమయ సద్వినియోగానికి, విద్యార్థుల అక్షరాస్యతను మరింత మెరుగుపర్చడానికిగాను ‘అభ్యాస’ను రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతులకు సంబంధించిన జనరల్ ఇంగ్లీష్, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల పాఠాల వీడియోలు, ఆన్‌లైన్ పరీక్షలు ఇందులో అందుబాటులో ఉంటాయని వివరించారు.
గన్నవరం టెర్మినల్ నిర్మాణానికి పీఐబీ ఆమోదం
గన్నవరం విమానాశ్రయంలో దేశీయ, విదేశీయ ప్రయాణికుల కోసం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ) ఆమోదం తెలిపింది. సుమారు రూ.613 కోట్లతో నిర్మించనున్న ఈ టెర్మినల్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఇక లాంఛనంగా ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రసుత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పాత టెర్మినల్ భవనాన్ని ఇంటర్నేషనల్ కార్యకలపాలకు తాత్కాలికంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీని స్థానంలో 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను నిర్మించనున్నారు.

శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్ ప్రారంభం
మూడు టీఎంసీల సామర్థ్యం, 1,10,718 ఎకరాలకు సాగునీరు అందించేలా సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను ఏప్రిల్ 24న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు ప్రారంభించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి అదనంగా నీరు ఇవ్వగలిగాం. నిజాంసాగర్‌ను పూర్తి చేసుకుంటున్నాం. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో జలకళ ఉట్టిపడు తుంది. సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ రైతుల కష్టాలు తీరి దేశానికే ఆదర్శవంతమైన వ్యవ సాయ కేంద్రంగా తెలంగాణ విరాజిల్లుతుంది’ అని మంత్రులు హరీశ్, కేటీఆర్ అన్నారు.
మెతుకుసీమగా పిలిచే ఉమ్మడి మెదక్ జిల్లా పేరే మెతుకు అనే పేరు నుంచి వచ్చిందని, గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లాను ముద్దాడిన తర్వాత మొత్తం తెలంగాణకు బువ్వపెట్టే జిల్లాగా కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీటివనరులు పెరిగితే ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

లాక్సాయ్ లైఫ్ సెన్సైస్‌తో ఐఐసీటీ ఒప్పందం
ఔషదాల తయారీలో అతిముఖ్యమైన యాక్టివ్ ఫార్మాసూటికల్స్ ఇంగ్రీడిఝెంట్స్ (ఏపీఐ), ఇతరత్రా ముడిపదార్థాలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఫార్మాసూటికల్ కంపెనీ లాక్సాయ్ లైఫ్ సెన్సైస్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో వినియోగిస్తున్న వుమిఫెనోవిర్, రెమిడిసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) వంటి ఔషదాల తయారీ మీద దష్టిపెడతామని ఐఐసీటీ ఏప్రిల్ 24న తెలిపింది. అయితే ఐఐసీటీలో మాత్రం ఆయా ఔషదాల మాలిక్యుల్స్, లాక్సాయ్‌లో ఫార్ములేషన్స్, డ్రగ్‌‌స తయారవుతాయని ఐఐసీటీ పేర్కొంది. లాక్సాయ్‌కు హైదరాబాద్‌లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన ఏపీఐ తయారీ కేంద్రాలున్నాయి.

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 24న తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లను పంపించారు. అనంతరం జిల్లాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆ వివరాలు ఇలా...

  • సున్నా వడ్డీ పథకంపథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్నంతటినీ ఇకపై ప్రభుత్వమే భరించనుంది.
  • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3 లక్షల పరిమితి వరకు ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు. ఈ లెక్కన సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7 శాతం నుంచి 13 శాతం వరకు ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి.
  • ఈ పథకం ద్వారా 8 లక్షల 78 వేల గ్రూపుల్లోని 91 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. ప్రతి గ్రూపునకు కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు లబ్ధి కలుగుతుంది. ప్రతి ఏటా ఈ పథకం ద్వారా ఆ మేరకు లబ్ధి పొందుతారు.

కోవిడ్-19 ఏపీ ఫార్మసీ యాప్ విడుదల
రాష్ట్రంలో కరోనా( కోవిడ్-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించి ఏప్రిల్ 25న విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలని మెడికల్ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది.
త్రీడీ ఫేస్ షీల్డ్, మాస్క్‌లు
కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడేలా త్రీడీ ప్రింటింగ్ పరిజ్ఞానంతో ఫేస్ షీల్‌‌డ్స, మాస్కులను హైదరాబాద్ జేఎన్‌టీయూ రూపొందించింది. యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీ విభాగం వీటిని తయారు చేసింది. మెడికల్ సిబ్బందికి, పోలీసులకు అత్యంత రక్షణగా ఉండేలా వీటిని రూపొందించారు. కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ టెక్విప్ ఆర్‌అండ్‌డీ సహకారంతో వీటిని తయారు చేశారు.
పదివేల రూపాయలకే ఆక్సిజన్ యంత్రం
కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్‌సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు.

ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభం
పేదరికం వల్ల ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, పిల్లల చదువుల కోసం కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని పునరుద్ఘాటించారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఏప్రిల్ 28న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాల కలెక్టర్లు, విద్యార్థులు, వారి తల్లులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ‘రాబోయే విద్యా సంవత్సరం (2020-21) నుంచి ప్రతి త్రైమాసికానికి సంబంధించిన పూర్తి బోధనా రుసుముల్ని విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తాం. 2020 ఏడాది మార్చి 31 వరకూ బకాయి ఉన్న బోధనారుసుములన్నీ చెల్లించాం. 2018-19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో పెట్టిన బకాయిలు.. దాదాపు రూ.1,880 కోట్లు కట్టాము. 2018-19, 2019-20ల బోధనారుసుములు రూ.4,200 కోట్లు విడుదల చేశాం. 2019-20కి సంబంధించి ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజులు చెల్లించే ఉంటే కళాశాలలు వాటిని తిరిగివ్వాలి’ అని సీఎం పేర్కొన్నారు.

ఏపీకి దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లు
కోవిడ్- 19 నివారణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 17న తన క్యాంపు కార్యాలయంలో ఈ కిట్లను ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ కోవిడ్-19 నివారణా చర్యలపై సమీక్షించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయో సెన్సార్ కంపెనీ ఈ కిట్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఈ కిట్లకు ఐసీఎంఆర్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల టెస్టు కిట్లను ఆర్డర్ చేసిందని, రానున్న రోజుల్లో వీటిని అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. సాంకేతిక పరమైన సహకారాన్ని కూడా ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు.
ట్రూనాట్ కిట్లతోనూ..
రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల కోసం ఇప్పటికే ట్రూనాట్ కిట్లను ఉపయోగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ట్రానాట్ కిట్లు మన దగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. సుమారు 240కి పైగా కిట్లను ఉపయోగించుకోవడం వల్ల పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. అందువల్లే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగానికి ముందే దేశంలో జానాభా ప్రాతిపదికన అత్యధిక కోవిడ్- 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది.
ముఖ్యమంత్రికి కోవిడ్-19 టెస్ట్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా వైద్యులు ఆయనకు పరీక్ష చేసి, నెగిటివ్‌గా నిర్ధారించారు.

రోనా పరీక్షల్లో ఏపీకి రెండో స్థానం
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఏపీ కంటే ముందు వరుసలో ఉన్న కేరళను వెనక్కినెట్టి 2వ స్థానానికి చేరుకుంది.

  • జాతీయ సగటులో మిలియన్ జనాభాకు 268 మందికి పరీక్షలు చేస్తుండగా.. ఏపీలో మాత్రం 539 పరీక్షలు చేస్తున్నారు.
  • ఒక్క రాజస్థాన్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకంజలోనే ఉన్నాయి.
  • పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ మాత్రం చాలా వెనుకబడి ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఏప్రిల్ 19న విడుదల చేసిన గణాంకాలను బట్టి తేలింది.
  • బెంగాల్‌లో మిలియన్ జనాభాకు 51 మందికే పరీక్షలు చేస్తున్నారు.

తాజా గణాంకాల ప్రకారం మిలియన్ జనాభాకు 300కు పైగా పరీక్షలు చేసిన రాష్ట్రాలు..

కరోనా పరీక్షల కోసం మొబైల్ వైరాలజీ ల్యాబ్
ఇప్పటివరకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ల్యాబ్‌లకే పరిమితం కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మొబైల్ వైరాలజీ కంటెయినర్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో బీఎస్‌ఎల్-3 ల్యాబ్‌ను నిమ్స్, డీఆర్డీఓ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. ఈ ల్యాబ్ రూపకల్పన, డిజైన్‌ను నిమ్స్ ఆస్పత్రి రీసెర్చ్ డెవలప్‌మెంట్ అధిపతి డాక్టర్ మధుమోహన్‌రావు అందించగా, ఈఎస్‌ఐ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్ దీనికి సంపూర్ణ సహకారం అందించారు. 2020, ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో తొలుత ఈ ల్యాబ్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ల్యాబ్‌కు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల బృందం సభ్యులు డాక్టర్ వై.శ్రీనివాస్, ఎంఎస్‌ఆర్ ప్రసాద్, బీఎల్‌వీఎస్ నారాయణమూర్తి మొబైల్ కంటెయినర్ నిర్మాణానికి కావాల్సిన సాంకేతికతను అందించారు. దీనికి కావాల్సిన రెండు భారీ కంటెయినర్లను ఐకామ్ సంస్థ ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. ఈ కంటెయినర్లలో బయోసేఫ్టీ లెవల్ (బీఎస్‌ఎల్)-3 ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలను కేవలం 15 రోజుల్లో సిద్ధం చేసింది. సాధారణంగా ఇలాంటి ల్యాబ్‌ను రూపొందించాలంటే కనీసం ఆర్నెల్ల సమయం పడుతుంది.

గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) ఏప్రిల్ 20న ప్రారంభమైంది. 1,500 బెడ్‌లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను సిద్దం చేశారు. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇందులో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్పత్రిని సిద్ధం చేయడంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయగా, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిరంతరం పర్యవేక్షించారు.

ఆర్‌బీఐ నుంచి తెలంగాణకు 2 వేల కోట్ల రుణం
లాక్‌డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న మరో రూ.2 వేల కోట్లను రుణంగా తీసుకుంది. స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (ఎస్‌డీఎల్) కింద బాండ్ల అమ్మకాలు, సెక్యూరిటీల ద్వారా ఈ రుణాన్ని పొందింది. మొత్తం 6 రాష్ట్రాలు ఆర్‌బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొన్నాయి. రాష్ట్రం తీసుకున్న రుణంలో వెయి్య కోట్ల రూపాయలను 2026కు, మరో రూ.వెయి్య కోట్లను 2028 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 2020, ఏప్రిల్ 13వ తేదీన కూడా ప్రభుత్వం బాండ్ల అమ్మకాల ద్వారా రూ.2 వేల కోట్లు ఆర్‌బీఐ నుంచి అప్పుగా తీసుకుంది. దీంతో ఏప్రిల్ నెలలోనే రూ.4 వేల కోట్ల రుణం తీసుకున్నట్లు అయింది.

దేశీయ థర్మామీటర్, ఫేస్ మాస్క్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ లాబ్స్ రూపొందించిన ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లను ఏప్రిల్ 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ మాస్క్, థర్మామీటర్ పని తీరును ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ ల్యాబ్స్ డెరైక్టర్స్ ఏ శృతి, ఎం సాయిరాం ముఖ్యమంత్రికి వివరించారు.

  • తొలిసారి దేశీయంగా ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లు తయారు చేస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో స్థానికంగా ఉన్న ఉద్యోగులతోనే ఈ పరికరాలను తయారు చేస్తున్నామని వెల్లడించారు.
  • కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులతోనే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
  • ప్రస్తుతం రోజుకు 1,000 థర్మామీటర్లు తయారు చేస్తున్నామని, మన రాష్ట్ర అవసరాల అనంతరం త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా ఉత్పత్తిని పెంచుతామని వారు ముఖ్యమంత్రికి వివరించారు.

టీ కోవిడ్-19 యాప్ ఆవిష్కరణ
కోవిడ్-19పై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘టీ కోవిడ్-19’యాప్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఏప్రిల్ 11న ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తోందన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రజలు, ప్రభుత్వానికి ఉపకరించేలా ఏడబ్ల్యూఎస్, సిస్కోతో పాటు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ క్వాంటెలా సహకారంతో రాష్ట్ర ఆరోగ్య, ఐటీ మంత్రిత్వ శాఖలు ‘టీ కోవిడ్-19’యాప్‌ను రూపొందించాయని తెలిపారు. ఈ యాప్ ద్వారా కోవిడ్-19కు సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కాల్ హెల్త్ అనే టెలీమెడిసిన్ మాడ్యూల్‌తో ఈ యాప్‌ను అనుసంధానం చేయడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వైద్యులతో సంప్రదింపులు జరపవచ్చని వెల్లడించారు.

సోషల్ మీడియాలో కోవిడ్ అధికారిక సమాచారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి సమగ్ర సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకునేందుకు వాట్సప్, పేస్‌బుక్ మెసెంజర్ చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 11న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేస్తూ.. ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అందించే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏర్పాట్లు చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్ష
కోవిడ్-19 వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏప్రిల్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు, పొగాకేతర ఉత్పత్తులు, ఖైనీ వంటి ఉత్పత్తులు నమిలి ఉమ్మివేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్ ప్రారంభం
కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 13న తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాల్ సెంటర్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ 14410కు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
టెలి మెడిసిన్ ఉద్దేశం..

  • కోవిడ్-19 కేసులను గుర్తించడం, ఐసొలేట్ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం.
  • ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు.
  • డాక్టర్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెన్స్ టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది.

ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్..

  • టెలి మెడిసిన్ అమలు కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరు 14410 కేటాయించారు.
  • ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌‌స ముందుకు వచ్చారు.
  • వీరంతా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు.

జీఎంఆర్‌కు భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టు
మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌కు చెందిన జీఎంఆర్ ఎయిర్‌పోర్‌‌ట్స.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు అభివృద్ధి, నిర్వహణ, కార్యకలాపాలకై కాంట్రాక్టు నిర్ధారణ పత్రాన్ని (లెటర్ ఆఫ్ అవార్డ్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు 2019 ఫిబ్రవరిలో జీఎంఆర్ ఎయిర్‌పోర్‌‌ట్స హైయె్యస్ట్ బిడ్డరుగా నిలిచింది. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో దీనిని నిర్మిస్తారు. కంపెనీ ఈ విమానాశ్రయాన్ని 40 ఏళ్లపాటు నిర్వహిస్తుంది. నిర్వహణ కాంట్రాక్టును అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా మరో 20 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌కు 27 వేల కోట్ల నాబార్డు రుణం
వివిధ రంగాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.27,992 కోట్ల రుణం అందించినట్లు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు) వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 41 శాతం అధికంగా రుణం విడుదల చేసినట్లు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) ఎస్.సెల్వరాజ్ ఏప్రిల్ 2న తెలిపారు.చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో తాగు, సాగునీటికి రూ.1,931 కోట్లు, ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థకు రూ.4,030 కోట్లను రుణంగా విడుదల చేశామన్నారు. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా వివిధ బ్యాంకులకు రీఫైనాన్స్ రూపంలో రూ.20,515 కోట్ల మొత్తాన్ని అందించామన్నారు.

ఏపీకి రూ.1,050.91 కోట్ల కేంద్ర నిధులు
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలకు రెవెన్యూ లోటు భర్తీ కింద, అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,050.91 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 3న ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల వివరాలు...

  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది.
  • రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 15వ ఆర్థిక సంఘం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్ గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
  • దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్ నెలకు రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్ గా తొలి విడతగా రూ.11,092 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

ఏపీలో ఉభయతారక ప్రయోజన పథకం
కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడిన తరుణంలో నష్టపోతున్న రైతులు, అవస్థలు పడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఉభయతారక ప్రయోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ఉద్యాన శాఖ తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలను రైతుల నుంచి నేరుగా సేకరించి.. గ్రామాలు, పట్టణ కాలనీలలో విక్రయించే నమూనాను రూపొందించి అమలు చేస్తోంది. ప్రస్తుత విపత్తు సమయంలోనే కాకుండా భవిష్యత్‌లో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ నమూనాను అమలు చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏప్రిల్ 4న సర్కులర్ జారీ చేసింది.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స
కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఏప్రిల్ 6న ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కింద మరో రూ. 5,631 చెల్లిస్తారు. అంటే మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లిస్తారు. నిర్ధారణ కేసులకు రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకూ కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు యాప్..
వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలో ప్రత్యేక యాప్ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున పంటలకు ధరల కల్పన, రైతుల ఉత్పత్తుల కొనుగోళ్ల తీరు తెన్నులపై ఏప్రిల్ 6న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా పంటలు, వాటి పరిస్థితి, ఉత్పత్తి, ధరలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రియల్ టైంలో తెలుసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైఎస్సార్ నిర్మాణ్, కోవిడ్-19 రెస్పాన్స్ పోర్టల్స్ ప్రారంభం
సిమెంట్ తయారీ కంపెనీలు, వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసే లక్ష్యంతో రూపొందించిన వైఎస్సార్ నిర్మాణ్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 8న ఆవిష్కరించారు. అలాగే వైద్య సంబంధిత ఉత్పత్తులను అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేందుకు రూపొందించిన ఏపీ ఇండస్ట్రీస్ కోవిడ్-19 రెస్పాన్స్ పోర్టల్ ను కూడా సీఎం ఆవిష్కరించారు.
వైఎస్సార్ నిర్మాణ్..
పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు, పేదల గృహ నిర్మాణం, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఏ పరిమాణంలో సిమెంటు కావాలో వైఎస్సార్ నిర్మాణ్ పోర్టల్, యాప్ ద్వారా ఇండెంట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పోర్టల్‌ను సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)కు అనుసంధానం చేశారు.
కోవిడ్-19 రెస్పాన్స్ పోర్టల్..

  • రాష్ట్రంలో ఉన్న మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెజైస్ (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు, సరఫరాదారులు ఏపీ ఇండస్ట్రీస్ కోవిడ్-19 రెస్పాన్స్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
  • కోవిడ్-19 మెడికల్ రిలేటెడ్ ఐటెంలు, మాస్క్‌లు, శానిటైజర్స్, బెడ్‌‌స, బెడ్ రోల్స్ వంటి వైద్య పరమైన సామగ్రి అమ్మేవారు, కొనేవాళ్లు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
  • దీని వల్ల ఎవరి దగ్గరి ఎలాంటి వైద్య పరమైన, ఇతర సంబంధిత ఉత్పత్తులున్నాయన్న వివరాలతోపాటు అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి వచ్చే వెసులుబాటు ఉంటుంది.
  • దీనిని డెస్క్‌టాప్ లేదా మొబైల్ యాప్ ద్వారా అందరూ వాడుకోవచ్చు. అవసరమైన సామగ్రి కొనుగోలు చేయుటకు సౌలభ్యంగా ఉంటుంది.

ఏపీలో కోవిడ్-19 టెస్టు కిట్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారైన కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టు కిట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 8న జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టు కిట్ల తయారీలో రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని అన్నారు. విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్‌లో మోల్ బయో సంస్థ త్రీడీ ప్రింటింగ్ ల్యాబొరేటరీలో ఈ కిట్లను తయారు చేస్తోంది. టెస్ట్ కిట్ల తయారీ, పనిచేసే విధానాన్ని మెడ్‌టెక్ జోన్ సీఈఓ డా.జితేంద్ర శర్మ, సిబ్బంది ముఖ్యమంత్రికి వివరించారు.
ఐసీఎంఆర్ అనుమతి...
దేశంలోనే తొలిసారిగా కరోనా వైరస్ నిర్ధారించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తయారు చేయడం ద్వారా ఏపీ రికార్డు సృష్టించిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. విశాఖలోని మెడ్‌టెక్ జోన్‌లో అభివృద్ధి చేసిన ఈ కిట్లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి లభించిందని తెలిపారు. ‘బహిరంగ మార్కెట్‌లో ఈ కిట్ ధర రూ. 4,500 ఉండగా కేవలం రూ. 1,200కే అందజేస్తున్నాం. ఒక్కో కిట్ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయవచ్చు. కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చు. బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ కిట్లను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చు‘ అని మంత్రి పేర్కొన్నారు.

ఏప్రిల్ 2020 ఎకానమీ

2020-21లో వృద్ధి 0.8 శాతమే: ఫిచ్
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్-2021 మార్చి) కేవలం 0.8 శాతమే నమోదవుతుందని (2019-20లో 4.9 శాతం) అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- ఫిచ్ అంచనావేసింది. కోవిడ్-19 ప్రభావాలు, అంతర్జాతీయంగా మాంద్యం వంటి అంశాలు దీనికి కారణంగా తన తాజా గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. అయితే 2021-22లో వృద్ధిరేటు 6.7శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. జనవరి-మార్చి మధ్య వృద్ధ్ధి రేటు 4.4 శాతం అయితే, ఏప్రిల్-జూన్‌లో -0.2 శాతం క్షీణత, జూలై-సెప్టెంబర్ మధ్య -0.1 శాతం క్షీణ రేటు నమోదవుతుందని పేర్కొంది.
ఆంక్షలు కొనసాగితే - 0.9 శాతం: సీఐఐ
ఇదిలావుండగా, భారత పారిశ్రామిక వేదిక- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తాజాగా ఒక నివేదిక విడుదల చేస్తూ, లాక్‌డౌన్ సంబంధిత ఆంక్షలు మరింతకాలం పొడిగిస్తే, 2020-21లో భారత్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా -0.9 శాతం క్షీణత నమోదవుతుందని పేర్కొంది. అయితే పరిస్థితులు వేగంగా మెరుగుపడితే 1.5 శాతం వృద్ధి నమోదయ్యే వీలుందని అంచనావేసింది.
భారత్‌లో ఫేస్‌బుక్ మెసెంజర్ కిడ్‌‌స
ఫేస్‌బుక్ తాజాగా భారత్‌లో మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్ కిడ్‌‌సను ఏప్రిల్ 23న ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ తెలిపింది.


ఆరు డెట్ స్కీమ్‌లను మూసివేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
కరోనా వైరస్ మహమ్మారి.. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్‌‌సను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏప్రిల్ 24న తెలిపింది.
మూతబడిన స్కీమ్‌లు ఇవే...
1. ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్
2. ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ ఎక్రువల్ ఫండ్
3. ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్
4. ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్‌కం ప్లాన్
5. ఫ్రాంక్లిన్ ఇండియా అల్టా్ర షార్ట్ బాండ్ ఫండ్
6. ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం ఆపర్చూనిటీస్ ఫండ్

మ్యూచువల్ ఫండ్స్ కు రూ.50,000 కోట్ల నిధులు
డెట్ మార్కెట్లో నిధుల లేమికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాత్కాలిక పరిష్కారం చూపించింది. రూ.50,000 కోట్ల నిధులను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు బ్యాంకుల ద్వారా అందించే ప్రత్యేక రెపో విండో ఏర్పాటును ఏప్రిల్ 27న ప్రకటించింది. డెట్ ఫండ్‌‌సకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెరగడం, అదే సమయంలో మార్కెట్లో కొత్తగా వచ్చే పెట్టుబడులు తగ్గడంతో నిధుల కటకట పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా ప్యాకేజీ ప్రకటించింది. దీంతో ఫండ్‌‌స సంస్థలకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా అవి తమకు ఎదురయ్యే పెట్టుబడుల ఉపసంహరణలకు చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది.
90 రోజుల కాల పరిమితితో..
మ్యూచువల్ ఫండ్స్ కు ప్రత్యేక నిధుల సదుపాయం (ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్) కింద ఆర్‌బీఐ 90 రోజుల కాల పరిమితితో రూ.50,000 కోట్ల మేర రెపో ఆపరేషన్స్ ను చేపడుతుంది. 4.4 శాతం ఫిక్స్‌డ్ రెపో రేటుపై ఈ నిధులను బ్యాంకులకు అందిస్తుంది. 2020, ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు ఈ పథకం (విండో) అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం కింద తీసుకునే నిధులను బ్యాంకులు మ్యూచువల్ ఫండ్‌‌స సంస్థల (అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిధుల అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఫండ్‌‌సకు రుణాలను అందించడం, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కలిగి ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు, డిబెంచర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల కొనుగోలుకు బ్యాంకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
గతంలో...
మ్యూచువల్ ఫండ్స్ కు నిధులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. వాటి అవసరాల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.25,000 కోట్ల రుణాలను అందించేందుకు 2013 జూలైలో ఆర్‌బీఐ ప్రత్యేక విండోను తెరిచింది. అదే విధంగా లెహమాన్‌ బ్రదర్స్ సంక్షోభం అనంతరం 2008 అక్టోబర్‌లోనూ ఆర్‌బీఐ ఇదే తరహా నిర్ణయంతో ముందుకు వచ్చింది.


భారత్ జీడీపీ వృద్ధి రేటు 2 శాతం లోపే
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం దిగువనకు పడిపోతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్- భారత్ వ్యవహారాల ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనావేశాయి. ఆయా సంస్థల తాజా అంచనాలను పరిశీలిస్తే... భారత్ జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతంగా నమోదవుతుంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత్‌కు రూ.10 లక్షల కోట్లు లేదా ఒక వ్యక్తికి తలసరి రూ.7,000 నష్టం జరుగుతుంది. సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ఒక్క లాక్‌డౌన్‌తో సరిపెట్టుకోకుండా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 29 సంవత్సరాల కనిష్టానికి పడిపోయి, కేవలం 1.9 శాతంగా నమోదవుతుంది. అయితే మే 15వ తేదీ దాటిన తర్వాతా లాక్‌డౌన్ కొనసాగే పరిస్థితి ఉంటే, ఆర్థిక వ్యవస్థలో అసలు వద్ధిలేకపోగా -2.1 శాతం క్షీణించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు 4.4 నుంచి 6 శాతం వరకూ ఉండవచ్చు.


రూ. 68,607 కోట్ల రుణాలు రైటాఫ్: ఆర్‌బీఐ
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్‌బీఐ ఏప్రిల్ 24న ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2019, సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. ఆర్‌ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్‌సమ్ డైమండ్‌‌స రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్‌‌స రూ. 1,962 కోట్లు, ట్రాన్స్ ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్‌టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేశారు. ఆ వివరాలను ఆర్‌బీఐ తాజాగా తెలిపింది.
టాప్-10 ఎగవేతదారులు..

సంస్థ

రూ. కోట్లలో

గీతాంజలి జెమ్స్

5,492

ఆర్‌ఈఐ ఆగ్రో

4,314

విన్‌సమ్ డైమండ్స్

4,076

రోటోమాక్ గ్లోబల్

2,950

కుడోస్ కెమీ

2,326

రుచి సోయా

2,212

జూమ్ డెవలపర్స్

2,012

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్

1,943

ఫరెవర్ ప్రెషియస్

1,962

డెక్కన్ క్రానికల్

1,915

 
2020లో ఆసియా వృద్ధి జీరో: ఐఎంఎఫ్
కోవిడ్-19 నేపథ్యంలో 2020లో ఆసియా వృద్ధిరేటు ‘జీరో’గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. దాదాపు 60 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితి ఇదని పేర్కొంది. అయితే ఆర్థిక క్రియాశీలత విషయంలో ఇతర ఖండాలతో పోల్చితే ఆసియా పరిస్థితి మెరుగ్గానే ఉండే వీలుందని కూడా ఐఎంఎఫ్ పేర్కొంది. ‘‘కోవిడ్-19 మహమ్మారి- ఆసియా-పసిఫిక్ ప్రాంతం’ అన్న శీర్షికతో ఒక బ్లాక్‌లో ఐఎంఎఫ్ ఈ వివరాలను వెల్లడించింది. కరోనా వైరస్ ప్రభావం ఆసియాలో తీవ్రంగా, మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 1997 ఆసియన్ ఫైనాన్షియల్ సంక్షోభంలో వృద్ధి ఆసియా వృద్ధి 1.3 శాతంగా ఉంటే, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిరేటు 4.7 శాతంగా ఉన్న విషయాన్ని ఐఎంఎఫ్ ప్రస్తావించింది.

ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ రెండో ప్యాకేజీ
దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకొన్న నెలరోజుల్లోపే ఏప్రిల్ 17న మరో ప్యాకేజీని అందించింది. ముఖ్యంగా బ్యాంకులు మరింత ఉత్సాహంగా రుణాలు మంజూరు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ... లిక్విడిటీ కవరేజీ రేషియోను 80 శాతానికి సవరించింది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ పెరిగేలా చర్యలు చేపట్టింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రెండో ప్యాకేజీ నిర్ణయాలను ప్రకటించారు.
ఎన్‌పీఏల వర్గీకరణకు 180 రోజులు
రుణ చెల్లింపుల్లో విఫలమైతే 90 రోజుల తర్వాత దాన్ని వసూలు కాని ఎన్‌పీఏ వర్గీకరించాలన్నది ప్రస్తుత నిబంధన. అయితే లాక్‌డౌన్ కారణంగా రుణ చెల్లింపులపై 3 నెలల మారటోరియంను ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. ఫలితంగా మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్న ఖాతాలకు ఇది 180 రోజులుగా అమలు కానుంది. 2020, మార్చి 1 నాటికి చెల్లింపుల్లో విఫలం కాకుండా ఉన్న రుణ ఖాతాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మారటోరియం వెసులుబాటు ఎన్‌పీఏలకు దారితీయకూడదని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
రివర్స్ రెపో పావు శాతం కోత
రివర్స్ రెపో రేటును పావు శాతం తగ్గించి ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి సవరించింది. రివర్స్ రెపో అంటే... బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గటం వల్ల బ్యాంకులు తమ నిధుల్ని ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి బదులు రుణాలివ్వటానికే మొగ్గు చూపిస్తాయి. బెంచ్‌మార్క్ రెపో రేటు 4.40 శాతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
ఎల్‌సీఆర్ కోత
లిక్విడిటీ కవరేజీ రేషియోను (ఎల్‌సీఆర్) 100 శాతం నుంచి 80 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ఎల్‌సీఆర్ అంటే... ఏ క్షణంలోనైనా నగదుగా మార్చుకోగలిగే స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్ల వంటి ఆస్తులు. 2020 అక్టోబర్ నాటికి తిరిగి దీనిని 90 శాతానికి, 2021, ఏప్రిల్ 1కి 100 శాతానికి తీసుకొస్తామని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
రాష్ట్రాలకు మరిన్ని నిధులు..
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం మేర అదనంగా ఆర్‌బీఐ నుంచి రుణాలను పొందేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. ఈ సదుపాయం 2020, సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాలను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసిందే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్.
ఆర్థిక సంస్థలకు మరో రూ.50వేల కోట్లు
జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలైన నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు మరో రూ.50,000 కోట్ల మేర రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని ఆర్‌బీఐ కల్పించింది. ఈ సంస్థలు ఆర్‌బీఐ అనుమతించిన నిర్దేశిత సాధనాల ద్వారా మార్కెట్ల నుంచి నిధులను సమీకరించుకోవచ్చు. ఒక్క నాబార్డ్‌కే రూ.25,000 కోట్లు అందించనుంది. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, సూక్ష్మ రుణ నంస్థలకు నాబార్డ్ అందించనుంది.
వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్ల నగదు
మార్చి 1 - ఏప్రిల్ 14 మధ్య వ్యవస్థలోకి ఆర్‌బీఐ ఏకంగా రూ.1.2 లక్షల కోట్ల నగదును విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వ్యవస్థలో నగదుకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసి ఈ విధానాన్ని అనుసరించింది.
మరికొన్ని నిర్ణయాలు..

  • ఎన్‌బీఎఫ్‌సీ, మైక్రో ఫైనాన్స్ రంగం నిధుల కొరత ఎదుర్కోవచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం కోసం లక్ష్యిత దీర్ఘకాల రెపో ఆపరేషన్స్ (టీఎల్‌టీఆర్‌వో 2.0) రూపంలో రూ.50,000 కోట్ల మేర నిధుల్ని ఆర్‌బీఐ అందించనుంది.
  • అన్ని వాణిజ్య, కో-ఆపరేటివ్ బ్యాంకులు తమ వాటాదారులకు, ప్రమోటర్లకు డివిడెండ్ చెల్లింపులు చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది.
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ అంచనా. 2019-20లో 1.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది.


జియోలో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు
దిగ్గజ సంస్థలు రిలయన్స్ గ్రూప్, ఫేస్‌బుక్ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్‌కు తెరతీశాయి. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఏప్రిల్ 22న వెల్లడించింది. ఈ డీల్ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్‌బుక్‌లో భాగమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఊతంతో దేశీ ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్ రిలయన్స్ కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్‌బుక్‌కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది. 2014లో వాట్సాప్ కొనుగోలు డీల్ తర్వాత ఫేస్‌బుక్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం.
డీల్ ఇలా..
తాజా ఒప్పందం ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్.. ఫేస్‌బుక్‌కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్ గ్రూప్ గతేడాది అక్టోబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్-ఎక్స్‌క్లూజివ్ డీల్‌గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్‌బుక్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా జియోమార్ట్..
తాజా డీల్ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్‌ఐఎల్ వివరించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది.

ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్ ఏర్పాటు
కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజ్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 22న ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోవిడ్‌చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు. ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్ వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు.

మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం: ఐఎంఎఫ్ చీఫ్
ప్రపంచ దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. కరోనా వైరస్ కారణంగా 1930 తీవ్ర మాంద్యం తర్వాత మరో విడత అటువంటి తీవ్ర పరిస్థితులు 2020లో రానున్నాయని, 170 దేశాలలో తలసరి ఆదాయం వద్ధి మైనస్‌లోకి వెళ్లిపోవచ్చన్నారు. వాషింగ్టన్‌లో ఏప్రిల్ 9న జరిగిన ఒక కార్యక్రమంలో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రాధాన్యతలు’ అనే అంశంపై జార్జీవా మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం ఇంతకుముందెన్నడూ లేనటువంటి సంక్షోభంతో పోరాడుతోంది. కరోనా వైరస్ కాంతి వేగంతో మన సామాజిక, ఆర్థిక క్రమాన్ని అస్తవ్యస్తం చేసింది’’ అని జార్జీవా పేర్కొన్నారు. ఫలితంగా 2020లో ప్రపంచ వద్ధి ప్రతికూల దశలోకి వెళ్లిపోతుందన్నది స్పష్టమన్నారు. వర్ధమాన దేశాలకు ట్రిలియన్ డాలర్ల నిధుల సాయం అవసరమని, ఇందులో ఆయా దేశాలు కొంత వరకే సమకూర్చుకోగలవని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ద్రవ్యపరమైన చర్యలు 8 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆమె తెలిపారు.

50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీ
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్ బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. మరోవైపు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఏప్రిల్ 10 నాటికి 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు.

అమెరికా-చైనా మధ్య మళ్లీ చిచ్చు
కరోనా వైరస్ అమెరికాను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సమయంలో చైనాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్ర చేసింది. అమెరికా మార్కెట్లో మొబైల్ సేవలు అందిస్తున్న ‘చైనా టెలికం (అమెరికా)’ను నిషేధిస్తామంటూ హెచ్చరించింది. భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. చైనాలో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ‘చైనా టెలికం’ సబ్సిడరీయే చైనా టెలికం (అమెరికా). అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు టెలికమ్యూనికేషన్ సర్వీసులకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలంటూ అమెరికా న్యాయ, రక్షణ, అంతర్గత భద్రత (హోం), వాణిజ్య శాఖలు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)ను కోరాయి. కీలక శాఖల డిమాండ్‌ను ఎఫ్‌సీసీ ఆమోదిస్తే కోట్లాది అమెరికన్ల ఫోన్ సేవలకు విఘాతం ఏర్పడనుందన్నది విశ్లేషకుల అంచనా. అమెరికా తాజా చర్యలను చైనా వ్యతిరేకించింది.

భారత్‌కు ఏడీబీ నుంచి రూ.16,500 కోట్లు
కరోనా మహమ్మారిపై పోరుకు భారత్‌కు తోడ్పాటునందించేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ.16,500 కోట్లు (220 కోట్ల డాలర్లు) ప్యాకేజీని ఇవ్వనుంది. ఈ మేరకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సు అసకవ తెలిపారు. నిర్మలా సీతారామన్‌తో ఆయన ఏప్రిల్ 10న ఫోన్‌లో మాట్లాడారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోందని ఆయన ప్రశంసించారు.
ఆరోగ్యరంగానికి తక్షణ సాయం...
భారత అత్యవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని ఏడీబీ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆరోగ్య రంగానికి తక్షణ సాయంగా రూ.16,500 కోట్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, కరోనా కల్లోలంతో కష్టాలు పడుతున్న పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు, ఆర్థిక రంగానికి కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తక్షణ సాయం, విధానపరమైన రుణాలివ్వడం, బడ్జెట్ తోడ్పాటునందించడం... పలు అంశాలపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


భారత వృద్ధి రేటు 1.5 శాతమే: ప్రపంచ బ్యాంకు
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వద్ధి రేటు గణనీయంగా మందగించనుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2020-21లో ఇది 1.5-2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాల్లో వృద్ధి రేటు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి కానుంది. దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 4.8-5 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాలు తగ్గే కొద్దీ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ పుంజుకోగలదన్నది బ్యాంక్ అంచనా.


సభ్య దేశాలకు ఏడీబీ 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
సంక్షోభ సమయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) భారీ ప్యాకేజీని ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకుగాను సభ్య దేశాలకు 20 బిలియన్ డాలర్ల (1.52 లక్షల కోట్లు సుమారు) సాయాన్ని అందించనుంది. నెల రోజుల క్రితం ప్రకటించిన ప్యాకేజీ కంటే ఇది మూడు రెట్లు అధికం. మార్చి 18న 6.5 బిలియన్ డాలర్లు (రూ.49 వేల కోట్లు) ఇవ్వాలని ప్రతిపాదించగా, పరిస్థితి తీవ్రత దష్ట్యా దానిని మూడింతలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాల్లో లౌక్‌డౌన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సంక్షోభ తీవ్రత నేపథ్యంలో సాయాన్ని ఏడీబీ పెంచుతున్నట్టు బ్యాంకు ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా ఏప్రిల్ 13న తన ప్రకటనలో తెలిపారు.

భారత్ వృద్ధి రేటు 1.9 శాతామే: ఐఎంఎఫ్
కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికే పరిమితమవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ పేర్కొంది.
అగ్రదేశాల్లో నెగెటివ్ వృద్ధి రేటు..
2020-21 ఏడాది అమెరికా (-5.9), జపాన్ (-5.2), బ్రిటన్ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్ -8 శాతం నెగెటివ్ వద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి.


లాక్‌డౌన్‌తో రూ.17 లక్షల కోట్లు నష్టం: బార్‌క్లేస్
దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 234.4 బిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువలో దాదాపు రూ.17,60,000 కోట్లు) నష్టపోతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనావేసింది. తొలి మూడు వారాల లాక్‌డౌన్ వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,00,000 కోట్లు) నష్టం జరుగుతుందని తొలుత బార్‌క్లేస్ అంచనా వేసింది. అయితే తాజాగా మే 3 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు వల్ల ఈ అంచనాలను 234.4 బిలియన్ డాలర్లకు పెంచింది. వెరసి 2020 క్యాలెండర్ ఇయర్‌లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని పేర్కొంది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధి రేటు స్వల్పంగా 0.8 శాతం ఉంటుందని తన తాజా పరిశోధనా పత్రంలో అభిప్రాయపడింది. తొలి 21 రోజుల లాక్‌డౌన్ సందర్భంలో దేశంలో 2020 క్యాలెండర్ ఇయర్‌లో 2.5 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసిన బ్రోకరేజ్ సంస్థ, 2020-21లో వృద్ధ్ధి 3.5 శాతం ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ శాతాలను వరుసగా ‘సున్నా’, ‘0.8 శాతాలుగా’ తగ్గించింది.


ఎస్డీఆర్‌ఎంఎఫ్ కింద రాష్ట్రాలకు 11 వేల కోట్లు
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎంఎఫ్) కింద రాష్ట్రాలకు రూ. 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు ఏప్రిల్ 3న హోంశాఖ పేర్కొంది. ఈ నిధులను క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

రాష్ట్రాలకు రూ 17,287 కోట్లు విడుదల
మహమ్మారి కరోనా వైరస్‌పై రాష్ట్రాలు మరింత సమర్ధంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ. 17,287 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3న విడుదల చేసిన ఈ నిధుల్లో 14 రాష్ట్రాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు గ్రాంటు రూ. 6195 కోట్లు కూడా కలిపి ఉన్నాయి. ఆదాయ లోటు గ్రాంట్‌ను ఏపీ, అసోం, హిమచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లకు ఆర్థిక శాఖ మంజూరు చేసింది. ఇక కరోనా మహమ్మారిని దీటుగా కట్టడి చేసేందుకు ఎస్‌డీఆర్‌ఎమ్‌ఎఫ్ తొలి వాయిదాగా అన్ని రాష్ట్రాలకు రూ 11,092 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

30 ఏళ్ల కనిష్టానికి భారత్ వృద్ధి రేటు: ఫిచ్
భారత ఆర్థిక వృద్ధికి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ గట్టిగానే తగలనుంది. ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020-21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్ .. తాజాగా 2 శాతానికి తగ్గించింది. లాక్‌డౌన్‌లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్‌పైనా గణనీయంగా ఉండబోతున్నాయని ఏప్రిల్ 3న వివరించింది.
3.6శాతమే: ఇండియా రేటింగ్స్
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ ఇటీవలే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి.

ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం: ఏడీబీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) దాకా నష్టపోవచ్చని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. గ్లోబల్ జీడీపీలో ఇది 2.3-4.8 శాతానికి సమానంగా ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) నివేదికను విడుదల చేసింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
భారత వృద్ధి రేటు 4 శాతం..
అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏడీబీ అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని తెలిపింది. ప్రస్తుతం ఏడీబీ ప్రెసిడెంట్‌గా మసాత్సుగు అసకావా ఉన్నారు.

సిడ్బి నుంచి అత్యవసర రుణాలు
చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ. కోటి వరకు మూలధన రుణాలుగా అందిస్తున్నట్టు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) ఏప్రిల్ 7న ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా అత్యవసర పరిస్థితులకు స్పందనగా 48 గంటల్లోనే ఈ రుణాన్ని అందిస్తామని, ఇందుకు ఎటువంటి తనఖా లేదా హామీ అవసరం లేదని సిడ్బి తెలిపింది. అలాగే, ఎంఎస్‌ఎంఈలకు రుణ సదుపాయాన్ని రూ.2 కోట్ల వరకు పెంచినట్టు పేర్కొంది.

భారత్ వృద్ధి రేటు 2 శాతమే: ఇక్రా
కరోనా ప్రభావంలో 2020-21లో భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2 శాతమే ఉంటుందని ఇక్రా రేటింగ్‌‌స అంచనావేసింది. ‘‘2019-20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారత్ జీడీపీలో వద్ధిలేకపోగా 4.5 శాతం క్షీణత నమోదయ్యే వీలుంది. అయితే క్రమంగా కోలుకుని 2020-21లో 2 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చు’’ అని పేర్కొంది.
కేంద్రానికి అదనంగా రూ.5 లక్షల కోట్లు కావాలి
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలకు సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 2-2.5 శాతం లేదా రూ.4-5 లక్షల కోట్ల మేర అదనంగా రుణాలు సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మార్కెట్ నుంచి కాకుండా ఆర్‌బీఐ నుంచి నేరుగా రుణాల రూపంలో తీసుకోవాలని, ఇందుకోసం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం)ను సవరించాలని గార్గ్ సూచించారు.

ఏప్రిల్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు

చైనా ర్యాపిడ్ కిట్లు వెనక్కి పంపండి: ఐసీఎంఆర్
కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం చైనా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను ఉపయోగించవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపింది. వాటికి వెనక్కి పంపించాలని ఏప్రిల్ 27న సూచించింది. వాటిని తాము చైనాకు తిరిగి పంపుతామని పేర్కొంది. చైనాలోని గాంగ్‌జౌ వోండ్‌ఫో బయోటెక్, ఝూజై లివ్‌సన్ డయాగ్నోస్టిక్స్ అనే రెండు సంస్థల నుంచి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను భారత్ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి నాణ్యత, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్లు కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కిట్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. వాటిని వెనక్కి పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ఇండోనేసియా అధ్యక్షుడితో మోదీ చర్చలు
కరోనా ఉత్పాతంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 28న ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా మధ్య సన్నిహిత సహకారం అవసరమని మోదీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరుదేశాల మధ్య ఔషధ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలగకుండా భారత్ తనవంతు కృషి చేస్తుందని ఇండోనేషియా అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఉపయోగపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ ఏప్రిల్ 28న తెలిపారు. అందుకు రూ.2,600 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భారత పీఎంవోను అన్‌ఫాలో చేసిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్విట్టర్’లో భారత ప్రధాని మోదీతో స్నేహానికి ముగింపు పలికారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్ ట్విట్టర్‌లో మోదీని అన్‌ఫాలో చేసింది. రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం(పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అనుసరించడం మానేసింది. కొన్ని రోజుల క్రితం వరకు మోదీసహా 19 మంది భారతీయులను ట్విట్టర్‌లో ఫాలో అయ్యేది. తాజాగా ఆ సంఖ్య 13కు పడిపోయింది. ఈ 13 మంది అమెరికా పరిపాలనతో సంబంధం ఉన్న భారతీయులు. వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను 2.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మూడు వారాల క్రితం మోదీ వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి వైట్‌హౌస్ మోదీ ట్విట్టర్ ఖాతాను అనుసరించడం ప్రారంభించింది.
వైట్‌హౌస్ వివరణ
ట్విటర్ ఖాతా ఆన్‌ఫాలోకు సంబంధించి ఏప్రిల్ 30న వైట్‌హౌస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన దేశాధినేతల అధికారిక ట్విటర్ ఖాతాలను వైట్‌హౌస్ అనుసరించడం సాధారణంగా జరుగుతుంటుందని తెలిపాయి. అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా.. వారి ట్విట్స్ ను రీట్విట్ చేసేందుకు కొద్దికాలం పాటు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవనున్నట్టు వెల్లడించాయి.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020, ఫిబ్రవరి చివరి వారంలో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో ఏరోస్ విలీనం
కోవిడ్ -19 మహమ్మారి విస్తరణతో ప్రపంచ మార్కెట్లలో మొత్తం సినిమా నిర్మాణ రంగం సంక్షోభంలో వుండగా హాలీవుడ్‌కు చెందిన ఎస్‌టీఎక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం అవుతున్నట్టు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 18న ప్రకటించింది. మొత్తం షేర్ల రూపంలో ఈ విలీనం జరగనుంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఎస్‌టిఎక్స్ సంస్థ ఇప్పటికే హాలీవుడ్‌లో 34 సినిమాలు నిర్మించింది. ఇందులో హస్లర్స్, బాడ్ మామ్స్ సినిమాలు రెండూ కలిసి 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.10,500 కోట్లు) గ్రాస్‌ను వసూలు చేశాయి.
సీఈఓగా రాబర్ట్..
11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్ కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్ పేరుతో గ్లోబల్ సంస్థగా అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లా ఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్‌టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్‌‌స కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు.


ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో భారత జాతీయ పతాకం
కరోనాపై పోరులో భారత్‌కు స్విట్జర్లాండ్ వినూత్న రీతిలో సంఘీభావం తెలిపింది. భారతీయుల్లో విశ్వాసం పాదుకొల్పి, నైతిక స్థైర్యం అందించేందుకు ప్రఖ్యాత
ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో ఒకటైన మాటర్‌హార్న్ పర్వతంపై ఇలా మువ్వన్నెల కాంతులను ప్రసరింపజేసింది. స్విస్ కళాకారుడు గెర్రీ హాఫ్స్‌టెటర్ 4,478 మీటర్ల ఎత్తైన మాటర్‌హార్న్ పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకంతో కూడిన కాంతులను ప్రసరింపజేశారు. స్విస్ సంఘీభావంపై ప్రధాని మోదీ ఏప్రిల్ 18న ట్విట్టర్‌లో స్పందించారు. కరోనాపై యావత్ ప్రపంచం కలసికట్టుగా పోరాడుతోందని, ఈ మహమ్మారిపై మానవజాతి విజయం సాధించి తీరుతుందని ట్వీట్ చేశారు.
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్: ఆక్స్‌ఫర్డ్
2020, మే నెలలోపు 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. 18- 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షించనున్నారు. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ బృందం ప్రయోగం మొదటిది.


చైనా తాజా మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్
భారత్‌లో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని పదే పదే వివాదాస్పద ప్రకటనలు చేస్తున్న చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను టిబెట్‌లో భాగంగా చూపింది. ఈ మేరకు డిజిటల్ మ్యాప్‌లకు సంబంధించి చైనా అధికారిక సంస్థ స్కై మ్యాప్ నవీకరించిన మ్యాప్‌ను విడుదలచేసింది. స్కై మ్యాప్ బీజింగ్ నేషనల్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ జియోగ్రఫిక్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1951లో టిబెట్‌ను ఆక్రమించిన చైనా.. అరుణాచల్‌ప్రదేశ్ కూడా అందులో భాగమని వాదిస్తూ వస్తోంది.

అధునాతన మిస్సైళ్ల విక్రయానికి అమెరికా ఆమోదం
భారత్‌కు 155 మిలియన్ డాలర్ల విలువైన హార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్‌డ్ మిసైళ్లు, తేలికపాటి టోర్పిడోలు విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిస్సైళ్ల విక్రయానికి ఏప్రిల్ 13న అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే 10 ఏజీఎం -84ఎల్ హార్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్ మిస్సైల్స్, 16 ఎంకేఈ 54 లైట్‌వెయిట్ టోర్పిడోలు, మూడు ఎంకే 54 ఎక్సర్‌సైజ్ టార్పిడోలు భారత్ కు రానున్నాయి. భారత్‌కు ప్రాంతీయంగా తలెత్తే ముప్పును తిప్పికొట్టడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడనున్నాయి. విమానాల నుంచి ప్రయోగించే హార్పూన్ క్షిపణులను శత్రు నౌకల విధ్వంసానికి ఉపయోగిస్తారు. వీటిని భారత నౌకాదళంలోని పి-8ఐ విమానాల్లో అమరుస్తారు. శత్రు జలాంతర్గాముల విధ్వంసానికి ఉపయోగపడే ఎంకే 54 టోర్పిడోలను రేథియాన్ కంపెనీ తయారుచేస్తోంది. హార్పూన్ క్షిపణులను బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

అధునాతన మిస్సైళ్ల విక్రయానికి అమెరికా ఆమోదం
భారత్‌కు 155 మిలియన్ డాలర్ల విలువైన హార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్‌డ్ మిసైళ్లు, తేలికపాటి టోర్పిడోలు విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిస్సైళ్ల విక్రయానికి ఏప్రిల్ 13న అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే 10 ఏజీఎం -84ఎల్ హార్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్ మిస్సైల్స్, 16 ఎంకేఈ 54 లైట్‌వెయిట్ టోర్పిడోలు, మూడు ఎంకే 54 ఎక్సర్‌సైజ్ టార్పిడోలు భారత్ కు రానున్నాయి. భారత్‌కు ప్రాంతీయంగా తలెత్తే ముప్పును తిప్పికొట్టడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడనున్నాయి. విమానాల నుంచి ప్రయోగించే హార్పూన్ క్షిపణులను శత్రు నౌకల విధ్వంసానికి ఉపయోగిస్తారు. వీటిని భారత నౌకాదళంలోని పి-8ఐ విమానాల్లో అమరుస్తారు. శత్రు జలాంతర్గాముల విధ్వంసానికి ఉపయోగపడే ఎంకే 54 టోర్పిడోలను రేథియాన్ కంపెనీ తయారుచేస్తోంది. హార్పూన్ క్షిపణులను బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.


చైనా నుంచి భారత్‌కు 6.5లక్షల మెడికల్ కిట్లు
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా చైనా నుంచి భారత్‌కు 6.5లక్షల మెడికల్ కిట్లు, వైద్య సామగ్రి ఏప్రిల్ 16న బయలుదేరిందని బీజింగ్‌లోని భారత రాయభారి విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో మరో 20 లక్షల వైద్యసామగ్రి భారత్‌కు చేరుకోనుందని తెలిపారు. రాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లు, ఆర్‌ఎన్‌ఏ టెస్టింగ్ కిట్లు గ్వాన్‌గ్జూ విమానాశ్రయం నుంచి భారత్‌కు బయలుదేరాయని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత్‌లో ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో హాట్ స్పాట్లలో ప్రత్యేకంగా పరీక్షలను వేగవంతం చేయడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న వైద్యసామగ్రి ఉపయోగపడనుంది.
అదొక్కటే మార్గం: యూఎన్ చీఫ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. 2020 ఏడాది చివరి నాటికి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలైన పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో ఏప్రిల్ 15న ఆయన వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుటెరస్ పై వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కట్టడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 4న ఫోన్ లో చర్చించారు. కరోనాపై యుద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు సహకరించుకోవాలని మోదీ, ట్రంప్ నిర్ణయించారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతపైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్-19 రోగులకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల్ని అమెరికా పంపించాలని మోదీని ట్రంప్ కోరారు.
క్లోరోక్విన్‌పై నిషేధం
మలేరియా వ్యాధిని అరికట్టే క్లోరోక్విన్ టాబ్లెట్లు కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తూ ఉండడంతో అమెరికా కొన్నాళ్ల క్రితమే భారత్‌కి ఆర్డర్ పెట్టుకుంది. భారత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్లోరోక్విన్ ఎగుమతుల్ని ఏప్రిల్ 4న భారత్ నిషేధించింది. దీంతో ట్రంప్ ఫోన్ చేసి మోదీతో మాట్లాడారు. తమ కంపెనీలు ఆర్డర్ చేసిన క్లోరోక్విన్ మాత్రల్ని పంపాలని విజ్ఞప్తి చేశారు.

భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు
కోవిడ్-19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు’ అని ఫాక్స్ న్యూస్‌తో ఏప్రిల్ 8న ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు భారత్ ఏప్రిల్ 7న అంగీకరించిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 2020 సైన్స్ & టెక్నాలజీ

 

ఐదు సెకన్లలో కరోనా నిర్ధారణ పరీక్ష
ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ కేవలం 5 సెకన్లలో కోవిడ్-19 ఉందో లేదో తెలిపే ఎక్స్ రే ఆధారిత నిర్థారణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ దీనిని తయారు చేశారు. ఇందులో భాగంగా కోవిడ్ కేసులు సహా ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 వేల ఎక్స్‌రే స్కాన్లను డేటాబేస్ రూపంలో స్టోర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచేలా తయారు చేసినట్లు చెప్పారు. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలనకు పంపినట్లు తెలిపారు.

మూడో కరోనా వైరస్ వ్యాక్సిన్‌కి చైనా అనుమతి
కరోనా వైరస్‌పై పోరాడేందుకు మూడో వ్యాక్సిన్ ‘ఇనాక్టివేటెడ్’కు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ (మానవులపై వ్యాక్సిన్ పరీక్షలు)కు చైనా అనుమతినిచ్చింది. చైనా జాతీయ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నేతృత్వంలో వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయొలాజికల్ ప్రొడక్‌‌టస్ ఈ వ్యాక్సిన్‌ను అభివద్ధి చేసింది. అలాగే వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైతం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్టు చైనా ప్రభుత్వ జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తమ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కి కూడా పంపిస్తున్నామనీ, అది పూర్తివడానికీ, ఎంత సురక్షితమైందో, సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏడాది పడుతుందని సినోఫామ్ తెలిపింది.

5జీ ఏర్పాటుకు నోకియాతో ఎయిర్‌టెల్ ఒప్పందం
దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తాజాగా 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఫిన్లాండ్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 7,500 కోట్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది సర్వీస్ ఏరియాల్లో ఎయిర్‌టెల్ కోసం నోకియా 5జీ రెడీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ ఏప్రిల్ 28న తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుత అవసరాల కోసం 4జీ సేవలకు ఉపయోగపడే 3 లక్షల పైచిలుకు బేస్ స్టేషన్లను నోకియా ఏర్పాటు చేస్తుంది. స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక 5జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అనువుగా ఇవి ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని, అలాగే భవిష్యత్‌లో 5జీ సేవలకు కూడా పునాదిరాయిగా ఉపయోగపడుతుందని నోకియా ప్రెసిడెంట్ రాజీవ్ సూరి పేర్కొన్నారు.
2025 నాటికి 8.8 కోట్లు
అంతర్జాతీయ టెలికం సంస్థల సమాఖ్య జీఎస్‌ఎంఏ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం మార్కెట్‌గా భారత్ ఉంది. 2025 నాటికి 8.8 కోట్ల దాకా 5జీ కనెక్షన్లు ఉంటాయని అంచనా.

టీకా ఉత్పత్తికి హెస్టెర్‌తో ఐఐటీ గువాహటి ఒప్పందం
కరోనా వైరస్‌ను నిరోధించడానికి టీకాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఐఐటీ గువాహటి, అహ్మదాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెస్టెర్ బయోసెన్సైస్ ఒప్పందం చేసుకున్నాయి. రికాంబినంట్ ఏవియన్ పారామిక్సోవైరస్ సంబంధిత సాంకేతికత ఆధారంగా ఈ సంస్థలు టీకాను అభివృద్ధి చేయనున్నాయి. ఇందులో సార్స్‌కొవ్2 ఇమ్యూనోజెనిక్ ప్రొటీన్ వ్యక్తీకరణకు రికాంబినంట్ ఏవియన్ పారామిక్సోవైరస్1ను ఉపయోగిస్తారు.
ప్రభావవంతంగా అమెరికా ఔషధం
గిలీడ్ సెన్సైస్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్ ఔషధానికి కరోనా వైరస్ బాధితులకు స్వస్థత చేకూర్చే లక్షణాలు ఉన్నాయని అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)నిర్వహించిన పరిశోధనలో తేలింది. కరోనా నివారణ కోసం రోగులపై జరిపిన పరీక్షల్లో ఈ ఔషధం ప్రభావవంతంగా పనిచేసినట్లు సమాచారం. ఎబోలా వైరస్ చికిత్సలో ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ను ఉపయోగిస్తున్నారు.

కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్ తయారు
కోవిడ్-19 బాధితులకు సేవలందించేందుకు పంజాబ్‌లోని రోపార్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) శాస్త్రవేత్తలు ప్రత్యేక రోబోట్‌ను తయారు చేశారు. ఆసుపత్రుల్లో వార్డ్‌బోట్‌ల వాడకం ద్వారా వైద్యసిబ్బంది వైరస్ బారిన పడటాన్ని తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి రోగులకు మందులు, ఆహారం అందివ్వగలవని అసోసియేట్ ప్రొఫెసర్ ఎక్తా సింగ్లా తెలిపారు. ఇవి చేతులు ఊపడం వంటి సంజ్ఞలను అర్థం చేసుకోగలవని వివరించారు. కంట్రోల్ రూం ద్వారా ఏకకాలంలో వేర్వేరు వార్డుల్లోని రోబోలను నియంత్రించడం, ఆదేశాలివ్వడం సాధ్యమని... తరచూ తనని తాను శానిటైజర్ ద్వారా శుభ్రం చేసుకోవడం వార్డుబోట్‌కు ఉన్న మరో ప్రత్యేకత అని తెలిపారు.
రెండు గంటల్లోనే కరోనా పరీక్ష
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసే డయాగ్నొస్టిక్ కిట్‌ను కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. ఈ కిట్‌తో కేవలం 2 గంటల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక యంత్రంపై ఒకేసారి 30 నమూనాలను పరీక్షించవచ్చని వివరించారు.

కరోనా కట్టడిలో డీఆర్‌డీవో కీలక ముందడుగు
కరోనా కట్టడికి భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో) మరో కీలక ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌తో సహా మరో రెండు ఉత్పత్తులను అభివృద్ధి చేసిందని అధికారులు ఏప్రిల్ 18న తెలిపారు. ముఖ్యంగా అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్, చేతితో తాకే అవసరం లేకుండానే ఉపయోగించే యూవీసీ శానిటైజర్ క్యాబినెట్‌ను అభివృద్ధి చేసింది.
ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ సంస్థతో కలిసి అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. దీంతోపాటు ఢిల్లీలోని డిఫెన్స్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సెన్సైస్ (డిపాస్) ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సెన్సైస్ తో కలిసి అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్ యూవీ-సీ(254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం)ని రూపొందించింది. తద్వారా రసాయనాలను ఉపయోగించి శుభ్రపరచలేని ఏ వస్తువునైనా శుభ్రపరచడానికి ఇది ఉపయోగ పడుతుంది. చెక్కులు, పాస్‌బుక్‌లు, పేపర్ కవర్లులాంటి రోజవారీ వినియోగించే వస్తువుల నుంచి కరోనా వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఈ కిరణాలు కరోనా వైరస్ లోనిని జన్యు పదార్ధాలను నాశనం చేయడంలో, పునరుత్పత్తిని నిరోధిచండంలో చాలా బాగా పనిచేస్తాయిని డీఆర్‌డీవో తెలిపింది.

కరోనా చికిత్సకు ఐకో వెంట్ వెంటిలేటర్
కరోనా రోగుల కోసమే దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన వెంటిలేటర్.. ‘ఐకో వెంట్’ పేరుతో మార్కెట్‌లోకి రానుంది. అందుబాటులో ఉన్న పరికరాలు, తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ వెంటిలేటర్ కరోనా బారినపడిన రోగులపై బాగా పనిచేస్తుందని దీని రూపకర్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏప్రిల్ 21న తెలిపారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదని, తమ ఐకో వెంట్ వెంటిలేటర్లు ఆ కొరతను తీర్చబోతున్నాయని చెప్పారు. ఐకో వెంట్‌ను కరోనా, న్యుమోనియా, ఏఆర్‌డీఎస్ (ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిం డ్రోమ్) రోగుల కోసమే రూపొందించామన్నారు. ఊపిరితిత్తుల సాధారణ సామర్థ్యం ఆధారంగా ఆక్సిజన్‌ను కచ్చిత పరిమాణంలో ఊపిరితిత్తుల్లోకి పంపి, బయటకు వదిలే క్రమంలో కచ్చితమైన ప్రెషర్‌ను ఇది అనుమతిస్తుందన్నారు.
చైనా వైద్యులకు కరోనా టీకా
కరోనా వైరస్ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాను ఏడాది చివరిలోగా కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులకు అందించాలని చైనా యోచిస్తోంది. సాధారణ పద్ధతుల్లో తయారు చేస్తే 2020, ఏడాది చివరికి టీకా అందుబాటులోకి రాదని, అయితే ఈ మధ్యలో పరిస్థితి విషమిస్తే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి దీన్ని వాడతామని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డెరైక్టర్ గావ్ ఫూ తెలిపారు. చైనా అకాడమీ ఆఫ్ మిలటరీ సెన్సైస్ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ఓ అడినోవైరస్ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది. మార్చి నెలాఖరుకు తొలిదశ ప్రయోగాలు పూర్తి కాగా, ఏప్రిల్ 12న రెండో దశ ప్రయోగాలు మొదలయ్యాయి.

ప్లాస్మాతో తొలిసారిగా కొవిడ్-19 చికిత్స
కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి దేశంలోనే తొలిసారిగా ‘కాన్వలసెంట్ ప్లాస్మా’ను ఉపయోగించాలని కేరళలోని శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) నిర్ణయించింది. ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో కాన్వలసెంట్ ప్లాస్మా పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపిందని ఎస్‌సీటీఐఎంఎస్‌టీ డెరైక్టర్ ఆశా కిశోర్ ఏప్రిల్ 9న తెలిపారు. త్వరలో ప్రయోగాలు మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మాలో యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయని, ఇవి కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయని చెప్పారు. దీంతో కరోనా బారినపడ్డ ఇతర రోగులకు వీటితో చికిత్స చేయడం తమ పరిశోధన ఉద్దేశమని వివరించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఎస్‌సీటీఐఎంఎస్‌టీ పనిచేస్తోంది.


కోవిడ్ చికిత్సకు హెచ్‌సీక్యూ-ఐజీ
కోవిడ్-19 చికిత్సలో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్- అజిథ్రోమైసిన్’(హెచ్‌సీక్యూ-ఐజీ) కాంబినేషన్ ఎలాంటి సానుకూల ఫలితాలు సాధించిందనే వివరాలను వెల్లడించే అధ్యయనం ఒకటి ఫ్రాన్స్ లో తాజాగా తెరపైకి వచ్చింది. మార్సిలీలోని ఐహెచ్‌యూ, మెడిటెరేన్ ఇన్‌ఫెక్షన్ కేంద్రంలో ఈ అధ్యయనాన్ని మార్చి- ఏప్రిల్ మధ్య నిర్వహించారు. 1061 కరోనా పాజిటివ్ పేషెంట్లకు కనీసం మూడు రోజుల పాటు ‘హెచ్‌సీక్యూ-ఐజీ’ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వీరిలో 973(91.7 శాతం) మంది పది రోజుల్లో ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
అధ్యయనం వివరాలు
ఈ స్టడీ వివరాలను మార్సిలీ(ఫ్రాన్స్)లోని ‘ఐహెచ్‌యూ, మెడిటెరేన్ ఇన్‌ఫెక్షన్’ సంస్థ వెల్లడించింది. ‘మార్చి 3- ఏప్రిల్ 9 మధ్య 38,617 మంది పేషెంట్ల నుంచి 59, 655 శాంపిల్స్‌ను పీసీఆర్ సేకరించింది. ఆ పేషెంట్లలో కరోనా పాజిటివ్‌గా తేలిన 3,185 మంది పేషెంట్లలో 1,061 మంది మా అధ్యయనానికి సరిపోయారు. వారి సగటు వయసు 43.6 ఏళ్లు. వారిలో పురుషులు 492 మంది. వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్-అజిథ్రోమైసిన్ కాంబినేషన్‌తో చికిత్స జరిపి, ఈ అధ్యయనాన్ని రూపొందించాం’ అని వివరించింది.

కరోనా నిరోధానికి డీఆర్‌డీవో కొత్త పరికరం
కరోనా వైరస్ కట్టడికి డీఆర్‌డీవో మరో పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోగుల నుంచి వైద్య సిబ్బందికి వ్యాధి సోకకుండా ఉండేందుకు.. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, చండీగఢ్‌లోని టీబీఆర్‌ఎల్‌లు సంయుక్తంగా ‘ఏరోసాల్ కంటెయిన్మెంట్ బాక్స్’ను రూపొందించింది. చికిత్స లేదా నమూనాల సేకరణ సమయాల్లో రోగి నోటి నుంచి వెలువడే తుంపర్లు ఏవీ వైద్య సిబ్బందికి తాకకుండా ఈ పరికరం అడ్డుగోడ మాదిరిగా పనిచేస్తుంది. రోగికి పరీక్షలు జరిపేందుకు వీలుగా ఇందులో రెండు రంధ్రాలను ఏర్పాటు చేశారు. అక్రిలిక్/పెర్స్‌పెక్స్ పదార్థంతో తయారైన ఈ బాక్స్ తేలికగానే ఉంటుంది. రెండు సైజుల్లో లభించే ఈ పరికరం లభిస్తుంది.


ముంబై ఐఐటీలో డిజిటల్ స్టెతస్కోప్ రూపకల్పన
స్టెతస్కోప్‌ని ఛాతీపై ఉంచకుండానే, దూరం నుంచే హృదయ స్పందనలను తెలుసుకునే డిజిటల్ స్టెతస్కోప్‌ని ముంబై ఐఐటీ పరిశోధక బృందం తయారుచేసింది. కరోనా పీడితుల నుంచి ఆరోగ్య సిబ్బందికి వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ బందం తెలిపింది. డిజిటల్ స్టెతస్కోప్ వినియోగించడం ద్వారా రోగి హదయ స్పందనలకు సంబంధించిన డేటా బ్లూ టూత్ ద్వారా వైద్యులకు చేరుతుంది. దీనివల్ల డాక్టర్లు పేషెంట్‌ని తాకాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ ద్వారా తయారుచేసిన 1,000 స్టెతస్కోప్‌లను దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు పంపించారు.

కరోనా టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించే చర్యల్లో భాగంగా... కరోనా వైరస్ టీకా రెండవ దశ క్లినికల్ ట్రయల్స్‌ను చైనా ప్రారంభించింది. ఇందుకు దాదాపు 500 మంది వాలంటీర్లను నియమించుకుంది. ముఖ్యంగా వుహాన్ కు చెందిన 84 ఏళ్ల వుహాన్ నివాసి కూడా ఉన్నారు. మార్చిలో చేపట్టిన మొదటి దశ పరీక్షల్లో పరిశోధకులు టీకా భద్రతపై దృష్టి సారించగా, రెండవ దశలో దష్టి టీకా సమర్థతపై దృష్టి పెట్టారు. రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్లకుగాను మానవ పరీక్షలను చైనా ఆమోదించినట్లు చైనా మీడియా జిన్హువా ఏప్రిల్ 14న తెలిపింది.
చెన్ వీ నేతృత్వంలో..
ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సెన్సైస్ ఆఫ్ చైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్దతుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ది చేసింది. ఈ పరిశోధనా బృందానికి పిఎల్‌ఎ మేజర్ జనరల్ చెన్ వీ నేతృత్వం వహిస్తున్నారు.

అత్యంత శక్తివంతమైన తుపాకీ అభివృద్ధి
మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషిని లేదా జంతువును గురిపెట్టి సునాయాసంగా చంపేసే అత్యంత ప్రమాదరకమైన స్నైపర్ తుపాకీని రష్యాకు చెందిన లొబోవ్ ఆర్మ్స్ కనిపెట్టింది. ఎస్‌వీఎల్‌కే-14ఎస్‌గా వ్యవహరించే పది కిలోల బరువుగల ఇది తుపాకుల విభాగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. ఈ తుపాకీలో నుంచి బుల్లెట్ సెకండ్‌కు 900 మీటర్ల దూరం చొప్పున అంటే, ధ్వని వేగంకన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రయాణం చేస్తుంది. దీని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు 29 లక్షల రూపాయలుగా ఉంది.
ఎస్‌వీఎల్‌కే-14ఎస్ నుంచి వెలువడే బుల్లెట్ మూడు సెంటీమీటర్ల మందం గల ఇనుప దిమ్మ నుంచి దూసుకుపోతుందని, ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించిన వ్యక్తి కూడా ఈ బుల్లెట్ తగిలితే మరణించాల్సిందేనని ఈ తుపాకీని తయారు చేసిన కంపెనీ చీఫ్ ఇంజనీరు యూరి సించ్‌కిన్ తెలిపారు. ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని, గురి తప్పకుండా ఉండాలంటే మూడు కిలోమీటర్లకు మించి లక్ష్యం ఉండరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటీష్ సైన్యం ఉపయోగిస్తున్న ‘ఎల్115ఏ3’ తుపాకీ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇదే ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపాకీగా చెలామణి అవుతోంది.

కరోనా నమూనాల సేకరణకు కోవ్‌సాక్’
కరోనా వైరస్ కట్టడికి ఉపయోగపడే అనేక టెక్నాలజీలను అభివృద్ధి చేసిన భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) తాజాగా నమూనాల సేకరణకు ఉపయోగించే ప్రత్యేకమైన గదిని అభివృద్ధి చేసింది. కరోనా శాంపిల్ కలెక్షన్ కియాస్క్ (కోవ్‌సాక్) అని పిలుస్తున్న ఈ గదిని హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ డాక్టర్లతో సంప్రదింపులు జరిపిన తరువాత రూపొందించామని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి నుంచి నమూనాలు సురక్షితంగా సేకరించేందుకు ఈ కోవ్‌సాక్ ఉపయోగపడుతుందని పేర్కొంది. బాధితుడు కూర్చునే ప్రాంతాన్ని మానవ ప్రమేయం లేకుండా డిస్‌ఇన్ఫెక్ట్ చేయడం దీని ప్రత్యేకత. ఫలితంగా వైద్య సిబ్బంది నమూనాలు సేకరించిన ప్రతిసారీ ప్రత్యేకంగా వ్యక్తిగత రక్షణ పరికరాలను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. నమూనాల సేకరణ తర్వాత రోగి గది నుంచి బయటకు వచ్చిన వెంటనే నాలుగు నాజిళ్ల ద్వారా డిస్‌ఇన్ఫెక్టెంట్‌ను 70 సెకన్ల పాటు స్పే్ర చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని డీఆర్‌డీవో వెల్లడించింది. అవసరాన్ని బట్టి కోవ్‌సాక్‌ను బహిరంగ ప్రదేశాల్లోనూ ఉపయోగించవచ్చని పేర్కొంది.

కరోనా నుంచి రక్షణకు డీఆర్‌డీవో బయోసూట్ రూపకల్పన
కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు డీఆర్‌డీవో వినూత్న బయోసూట్‌ను రూపొందించింది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) సూట్‌ను వివిధ డీఆర్‌డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు.. టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ తదితర సాంకేతికతలను పరిశీలించి వినూత్నమైన కోటింగ్ ద్వారా ఈ సూట్ తయారుచేశారు. ఈ సూట్‌లను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి, వైద్యులు, ఇతర సిబ్బందిని కరోనా నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమిస్తున్నట్టు డీఆర్‌డీవో ఏప్రిల్ 2న వెల్లడించింది. కుసుంఘర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఈ సూట్ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్ మెటీరియల్ ఉత్పత్తి చేయడమే కాకుండా, పూర్తి సూట్‌ను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బయోసూట్ రూపకల్పన
ఎప్పుడు: ఏప్రిల్ 2
ఎవరు: డీఆర్‌డీవో
ఎందుకు: కరోనా నుంచి రక్షణకు

డీఆర్‌డీవోలో శానిటైజింగ్ యంత్రాల అభివృద్ధి
కరోనా వైరస్‌పై యుద్ధంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో ముందడుగు వేసింది. వేర్వేరు ఉపరితలాల నుంచి వైరస్‌లను తొలగించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని డీఆర్‌డీవో సంస్థ ‘ద సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్)’అభివృద్ధి చేసిన ఈ యంత్రాల్లో ఒకటి అవసరమైన చోటుకు మోసుకెళ్లేది కాగా, రెండోది చక్రాలపై ఉంచి తరలించగలిగేది. మంటలు ఆర్పేందుకు పనికొచ్చే యంత్రాలను రీడిజైనింగ్ చేయడం ద్వారా తాము ఈ శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధ్ధి చేసినట్లు డీఆర్‌డీవో ఏప్రిల్ 3న వెల్లడించింది. ప్రస్తుతం డీఆర్‌డీవో డెరైక్టర్‌గా జి.సతీశ్‌రెడ్డి ఉన్నారు.

కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష
కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో కువైట్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న, చిల్లర నేరాలకు పాల్పడిన విదేశీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారందరినీ వారి మాతృదేశాలకు పంపేందుకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

ఐఐటీ హైదరాబాద్‌లో జీవన్‌లైట్ వెంటిలేటర్ రూపకల్పన
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్క్‌లు, వెంటిలేటర్ల తయారీకి సంబంధించిన నమూనాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల తక్కువ ఖర్చుతో తయారయ్యే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను డిజైన్ చేసిన ఐఐటీ హైదరాబాద్.. తాజాగా ‘జీవన్‌లైట్’ పేరుతో అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్‌ను తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్‌హెచ్‌ఈ)కి చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వెంటిలేటర్‌ను రూపొందించింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్ చెబుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఐఓటీ) ఆధారంగా పనిచేసే ఈ వెంటిలేటర్ ను విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడొచ్చు.

వుహాన్ పేరుతో ఉప్రగ్రహం రూపకల్పన
రోదసి ఆధారిత ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స’ (ఐవోటీ) ప్రాజెక్ట్ కోసం డ్రాగన్ దేశం చైనా 2020, ఏప్రిల్ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రెండు ఉపగ్రహాలలో ఒక ఉపగ్రహానికి ‘వుహాన్’గా నామకరణం చేసినట్లు చైనా అధికార వార్తా సంస్థ షిన్హువా ఏప్రిల్ 3న తెలిపింది. క్వాయిజౌ-1ఏ అనే రాకెట్ ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. జింగ్‌యున్ ఇంజినీరింగ్ ప్రాజెక్టులో భాగంగా భూమికి దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టే మొత్తం 80 ఉపగ్రహాల్లో ఇవి మొదటివి. సముద్రాలు, అడవులు, ఇంజినీరింగ్ యంత్రాల కమ్యూనికేషన్ల కోసం ఈ ఉపగ్రహాలను రూపొందించారు.
వుహాన్ పేరు ఎందుకు...
కోవిడ్-19 మహమ్మారి తొలిసారి చైనాలోని వుహాన్‌లోనే వెలుగుచూసింది. అక్కడి సముద్ర ఆహార మార్కెట్లో పుట్టిన ఈ వైరస్ నేటికి పది లక్షల మందికిపైగా సోకింది. అయితే వుహాన్‌లోనే చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఏఎస్‌ఐసీ)కి చెందిన సంజియాంగ్ సంస్థ ఉంది. కరోనా వైరస్ భయం ఉన్నప్పటికీ ఇక్కడి సిబ్బంది శ్రమించి ఉపగ్రహాన్ని రూపొందించారు. అందుకే దానికి ‘వుహాన్’ అని పేరు పెట్టారని షిన్హువా వెల్లడించింది. ఏప్రిల్ 2నాటికి చైనాలో 81,620 కొవిడ్-19 కేసులు నమోదు కాగా 3,322 మంది మృతిచెందారు.

ఉత్తర రైల్వే పీపీఈ నమూనాలకు డీఆర్‌డీవో ఆమోదం
ఉత్తర రైల్వే వర్క్‌షాపులో రూపొందించిన రెండు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) నమూనాలకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధ్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే యూనిట్లలో వీటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. శరీర భాగాల్లో రక్తం, ఇతర స్రావాల ప్రసరణ కోసం ఉపయోగించే ఈ పరికరాలను కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న రైల్వే ఆసుపత్రుల్లో ఉపయోగించనున్నారు.
కరోనా గుర్తింపునకు సరికొత్త యాప్..
కరోనా వైరస్ సోకిన లక్షణాలు కలిగిన వారిని ట్రాక్ చేయడం కోసం లండన్‌లో ప్రత్యేకంగా కోవిడ్ సిప్టమ్ ట్రాకర్ అనే యాప్‌ను అభివృద్ధి చేశారు. గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, ఎన్‌ఐహెచ్‌ఆర్ బయోమెడికల్ రిసెర్చ్ సెంటర్, హెల్త్‌కేర్ స్టార్టప్-జో గ్లోబల్ లిమిటెడ్ సహకారంతో కింగ్‌‌స కాలేజ్ లండన్ బందం ఈ యాప్ ను రూపొందించింది.

తొలిసారిగా పులికి కరోనా వైరస్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మొట్టమొదటిసారి నాలుగేళ్ల పులికి సోకింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బ్రాంక్స్ జంతుప్రదర్శనశాలలోని నదియా అనే ఆడపులి (4) ఈ వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ అధికారులు ఏప్రిల్ 5న ప్రకటించారు. రోజూ నదియా బాగోగులు చూసే ఉద్యోగి ద్వారా ఈ వైరస్ సోకినట్టుగా వైల్డ్ లైఫ్ సొసైటీ అధికారులు భావిస్తున్నారు. బ్రాంక్స్ జూపార్కులో నదియాతోపాటు మరో ట్విన్ స్టిసర్ అజుల్, రెండు అముర్ పులులతోపాటు మూడు ఆఫ్రికన్ సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. బ్రాంక్స్ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు. పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డెరైక్టరు జిమ్ బ్రెహేనీ చెప్పారు.
పిల్లికి కూడా...
కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఆధారాలు లేనప్పటికీ, పెంపుడు జంతువుల యజమానుల నుంచి వాటికి సోకే అవకాశం వుందని జంతు నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు బెల్జియంలో ఒక పిల్లికి, హాంకాంగ్ లో రెండు శునకాలకు వాటి యజమానుల నుంచి కరోనా వైరస్ సోకిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.

ఇవర్‌మెక్టిన్‌తో కరోనాకు చెక్: మొనాశ్ వర్సిటీ
ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఇవర్‌మెక్టిన్ అనే మందు 48 గంటల్లోనే మట్టుబెడుతున్నట్లు మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. శరీరంలోని పరాన్న జీవులను చంపేందుకు ఈ మందును చాలాకాలంగా వాడుతుండగా ఆస్ట్రేలియాలోని మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని కోవిడ్-19పై ప్రయోగించారు. పరిశోధనశాలలో పెంచిన కరోనా వైరస్‌పై ఈ మందును ప్రయోగించినప్పుడు ఒకే ఒక్క డోస్‌తో వైరస్ 48 గంటల్లో మరణించినట్లు ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన డాక్టర్ కై ల్ వాగ్‌స్టాఫ్ తెలిపారు. ఈ మందు పరిశోధనశాలలో కరోనా వైరస్‌తోపాటు డెంగీ, ఇన్‌ఫ్లూయెంజా, జికా, హెచ్‌ఐవీ వైరస్‌లపై కూడా ప్రభావం చూపిందని చెప్పారు. 24 గంటల తరువాతే ప్రభావం కనిపించడం మొదలైందని పేర్కొన్నారు.

గ్రిఫిత్ వర్సిటీతో ఇమ్యునోలాజికల్స్ ఒప్పందం
కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ వెల్లడించింది. పోలియో వంటి వైరస్‌ల టీకాల రూపకల్పనలో వాడిన కోడాన్ డీ-ఆప్టిమైజేషన్ టెక్నాలజీ ఉపయోగించి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించనున్నట్లు సంస్థ ఎండీ కే ఆనంద్ కుమార్ ఏప్రిల్ 7న తెలిపారు. పరిశోధన పూర్తయ్యాక భారత్‌లో దశలవారీగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వివరించారు. జికా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కోసం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ ఇప్పటికే గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తోంది.

ఒకరి నుంచి 406 మందికి కరోనా: ఆరోగ్య శాఖ
భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో కోవిడ్ రోగి నెల రోజుల్లో కనీసం 406 మందికి వ్యాధిని అంటిస్తాడని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఏప్రిల్ 7న వెల్లడించారు. ఒక రోగి నుంచి ఎంతమందికి రోగం వ్యాప్తి చెందుతుందనేదాన్ని ఆర్-నాట్‌గా వ్యవహరిస్తారని, కోవిడ్-19 విషయంలో ఆర్-నాట్ 1.5 నుంచి 4.0 మధ్య ఉన్నట్లు అధ్యయనంలో తేల్చారని వివరించారు. ఆర్-నాట్ 2.5 మాత్రమే ఉందని అనుకున్నా భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో రోగి నెల రోజుల్లో 406 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తాడని ఆయన లెక్కకట్టారు. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించి రోగి కదలికలను 75 శాతం వరకూ నియంత్రించగలిగితే మాత్రం ఒక్కో రోగి నుంచి మరో 2.5 మందికి మాత్రమే వ్యాప్తి చెందుతుందని అన్నారు.
ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలు గుర్తింపు
కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో ఏయే కణాలపై దాడులు చేస్తుందో జర్మనీలోని బెర్లిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాసకోశ నాళంలోని ప్రొజెనిటర్ కణాలపై కరోనా వైరస్‌లోని రిసెప్టర్ దాడి చేస్తున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రొజెనిటర్ కణాల పైభాగంలో ఉండే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు బ్యాక్టీరియాతోపాటు కఫం ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చేందుకు దోహదపడతాయన్నారు. హైడల్‌బర్గ్ లంగ్ బయో బ్యాంక్ నుంచి సేకరించిన 12 మంది ఊపిరితిత్తుల కేన్సర్ రోగుల నమూనాలతో తాము పరిశోధనలు చేశామని, అంతేకాకుండా ఆరోగ్యవంతుల శ్వాసకోశంలో ఉండే కణాలను కూడా పరిశీలించామని పేర్కొన్నారు. సుమారు 60 వేల కణాల జన్యుక్రమాలను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రొజెనిటర్ కణాలు కరోనా వైరస్ అతుక్కోగల రిసెప్టర్ల తయారీకి కీలకమని గుర్తించామని వివరించారు. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ఈఎంబీవో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

కరోనా వైరస్ జన్యుక్రమం నమోదు
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆప్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)లు జన్యుక్రమ నమోదును చేపట్టాయి. అన్నీ సవ్యంగా సాగితే ఒకట్రెండు వారాల్లోనే కనీసం 5 ఐసోలేట్ వైరస్‌ల జన్యుక్రమాల నమోదు పూర్తి చేస్తామని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఏప్రిల్ 8న తెలిపారు. జన్యుక్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ వైరస్ ఎప్పుడు.. ఎలా పుట్టింది.. ఎలా పరిణమించిందన్న విషయాలు తెలుస్తాయని, తద్వారా భవిష్యత్తులో ఈ రకమైన వైరస్‌లను అడ్డుకోవడం సాధ్యమవుతుందని వివరించారు.
కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి వేరు చేసిన వైరస్‌ను ఐసోలేట్ అంటారు. వైరస్ పూర్తి జన్యుక్రమాన్ని తెలుసుకోవాలంటే బోలెడన్ని ఐసొలేట్‌ల జన్యుక్రమాలు అవసరమవుతాయి. ఎంత ఎక్కువ సంఖ్యలో ఐసొలేట్ జన్యుక్రమాలు ఉంటే.. అంత కచ్చితత్వంతో జన్యుక్రమాన్ని నమోదు చేయొచ్చు. ఆ వైరస్ గురించి అధ్యయనం చేయొచ్చు.

ఏప్రిల్ 2020 స్పోర్ట్స్

మహిళల యూరో 2022కి వాయిదా
2021 ఏడాది ఇంగ్లండ్‌లో జరగాల్సిన మహిళల యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2022 జూలైకి వాయిదా పడింది. 2020 ఏడాది జరగాల్సిన పురుషుల యూరో టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో మహిళల ఈవెంట్ తేదీల్ని కూడా మార్చాల్సి వచ్చింది. దీనిపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) అధ్యక్షుడు అలెగ్జాండర్ సెఫెరిన్ మాట్లాడుతూ మెగా ఈవెంట్లు ఒకేసారి గజిబిజీగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతోనే మహిళల ఈవెంట్‌ను కూడా వాయిదా వేశామని చెప్పారు. పైగా వచ్చే ఏడాదికి మారిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సాకర్ మ్యాచ్‌లు ఉన్నాయని... దీంతో ఒకే ఏడాది రెండు మహిళల ఈవెంట్లు సరికాదనే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. మహిళల సాకర్‌కు సముచిత ప్రాధాన్యమివ్వాలనే వాయిదా వేశామని సెఫెరిన్ అన్నారు.

షెడ్యూల్ ప్రకారమే టి20 ప్రపంచకప్
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 తీవ్రత ఇంకా తగ్గకపోయినా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించే విషయం లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశాభావంతోనే ఉంది. షెడ్యూల్ ప్రకారమే (అక్టోబర్ 18 నుంచి) పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పుచేర్పులు లేవని ఐసీసీ ఏప్రిల్ 23న ప్రకటించింది. 12 మంది శాశ్వత సభ్య దేశాలు, 3 అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ఏప్రిల్ 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను మళ్లీ దారిలో పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడంపై ఇందులో చర్చ జరిగింది.

టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయం
కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టం చేశారు. 2021 ఏడాది జూలై 23వ తేదీనే ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి ఇప్పటికీ నియంత్రణలోకి రాకపోవడంతో 2021లోనూ ఈ మెగా ఈవెంట్ నిర్వహణ సాధ్యం కాదంటూ పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన వాయిదా
భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి ఇంగ్లండ్ మహిళల జట్టుతో నాలుగు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్ తలపడాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో తమ దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రొఫెషనల్ క్రికెట్‌ను జూలై 1 వరకు వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఏప్రిల్ 24న ప్రకటించింది. దీంతో అక్కడ భారత పర్యటన వాయిదా పడింది. దేశవాళీ క్రికెట్ సీజన్‌లోనూ తొమ్మిది రౌండ్ల మ్యాచ్‌ల్ని కోల్పోతున్నట్లు ఈసీబీ తెలిపింది.
మరో రెండు నెలలు శశాంక్ కొనసాగింపు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ అదనంగా మరో రెండు నెలల పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ బోర్డు సమావేశం కరోనా కారణంగా వాయిదా పడటమే అందుకు కారణం. మనోహర్ పదవీ కాలం వాస్తవానికి జూన్‌లో ముగియాల్సి ఉంది.


అథ్లెట్ జూమా ఖాతూన్‌పై నాలుగేళ్ల నిషేధం
డోపింగ్‌లో పట్టుబడటంతో భారత మహిళా మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతూన్‌పై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్పేర్రకం ‘డి హైడ్రోక్లోరోమిథైల్ టెస్టోస్టిరాన్’ వాడినట్లు తేలింది. 2018 జూన్‌లో గువాహటి వేదికగా జరిగిన అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జుమా 1500, 5000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. ఈ పోటీల సందర్భంగా ఆమె నుంచి జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్) శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. అయితే అదే శాంపిల్‌ను ‘వాడా’ పరీక్షించగా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. జుమాపై విధించిన ఈ నిషేధం చీ2018 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా 2018 జూన్ నుంచి నవంబర్ వరకు ఆమె పాల్గొన్న ఈవెంట్స్‌లో సాధించిన అన్ని ఫలితాలను రద్దు చేశారు.


ఆటకు పాక్ మహిళా స్టార్ క్రికెటర్ సనా మీర్ వీడ్కోలు
పాకిస్తాన్ మహిళల క్రికెట్‌లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. తన 15 ఏళ్ల కెరీర్‌లో 34 ఏళ్ల సనా మీర్ పాకిస్తాన్ తరఫున 120 వన్డేలు, 106 టి20 మ్యాచ్‌లు ఆడింది. 2009 నుంచి 2017 మధ్య 137 మ్యాచ్‌ల్లో ఆమె పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ‘రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయంగా నేనే భావిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన జట్టు సభ్యులకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’ అని సనా ఏప్రిల్ 25న తెలిపింది. వన్డేల్లో 1,630 పరుగులు చేసిన ఆమె 151 వికెట్లు కూడా తీసింది. తద్వారా పాక్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఇక టి20 ఫార్మాట్‌లో 802 పరుగులు సాధించిన ఆమె 89 వికెట్లు పడగొట్టింది.


పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై నిషేధం
పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు ఏప్రిల్ 27న శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2020, ఫిబ్రవరిలో ఉమర్ అక్మల్ రెండు అనుచిత, అసందర్భ ఘటనలకు బాధ్యుడయినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్‌కు తమ్ముడైన 29 ఏళ్ల ఉమర్ అక్మల్ అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లు ఆడాడు.


ఆస్టియ్రా గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్ సీజన్ ప్రారంభం
కరోనా మహమ్మారితో వాయిదా పడిన 2020 ఫార్ములావన్(ఎఫ్1) సీజన్ 2020, జూలై నెలలో ఆరంభం కానుంది. జూలై 5న ఆస్టియ్రా గ్రాండ్‌ప్రితో తాజా సీజన్‌ను ఆరంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ ఏప్రిల్ 27న ప్రకటించారు. జూలై-ఆగస్టు నెలల్లో యూరప్‌లో రేసులను నిర్వహించి... అనంతరం ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో పూర్తి చేసి డిసెంబర్‌లో మధ్య ఆసియాలో సీజన్‌ను ముగించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. 2020, ఏడాది కనీసం 15 రేసులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రిని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దాంతో ఈ ఏడాది రద్దయిన మూడో గ్రాండ్‌ప్రి జాబితాలో ఫ్రాన్స్ చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, మొనాకో రేసులు రద్దవగా... మరో ఏడు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రేక్షకులు లేకుండానే ఈసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.


అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా అరుణ్ కుమార్
ఐపీఎల్‌లో కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్ అమెరికా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అమెరికాకు వన్డే హోదా లభించింది. భవిష్యత్‌లో అమెరికాకు టెస్టు హోదా అందించడమే తన సుదీర్ఘ లక్ష్యమని 45 ఏళ్ల అరుణ్ కుమార్ వ్యాఖ్యానించాడు. అరుణ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కర్ణాటక జట్టు 2013-14; 2014-15 సీజన్‌లలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ టైటిల్స్ నెగ్గి అరుదైన ‘ట్రిపుల్’ ఘనత సాధించింది.

కరోనా అదుపులోకి రాకపోతే ఒలింపిక్స్ జరగవు
వచ్చే ఏడాదివరకల్లా కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేసే ప్రసక్తే లేదని... వాటిని రద్దు చేస్తామని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ యొషిరో మోరి తెలిపారు. జపాన్‌కు చెందిన క్రీడాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోరి మాట్లాడుతూ.. మహమ్మారి అదుపులోకి రాకపోతే తిరిగి 2022కు వాయిదా వేసే ప్రణాళిక ఏదీ లేదని, టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయడం తప్పదని అన్నారు.


థామస్ కప్-ఉబెర్ కప్ టోర్నీ మళ్లీ వాయిదా
ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ డెన్మార్క్ వేదికగా 2020, మే 16 నుంచి 24 వరకు జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన టోర్నీని వాయిదా వేసి... ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడం... ఆగస్టు చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమిగూడవద్దని డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టులో బదులుగా థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతుందని బీడబ్ల్యూఎఫ్ ఏప్రిల్ 29న ప్రకటించింది. పురుషుల, మహిళల విభాగాల్లో 16 మేటి జట్ల చొప్పున పాల్గొనే ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత సాధించాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం
ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. ‘ఫ్లవర్ సిటీ’గా పేరున్న గ్వాంగ్జౌ నగరంలో కమలం ఆకారంలో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. చైనా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్ అయిన ‘గ్వాంగ్జౌ ఎవర్‌గ్రాండ్’ టీమ్ యాజమాన్యం దీని రూపకర్త. ఈ జట్టు 2022లోగా దీనిని పూర్తి చేసి తమ హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగించుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్దదైన బార్సిలోనా ఎఫ్‌సీ ‘క్యాంప్ నూ’ స్టేడియంకు మించి దాదాపు లక్షకు పైగా సామర్థ్యంతో కొత్త స్టేడియం నిర్మితమవుతోంది. ఏప్రిల్ 16న దీని పనులు ప్రారంభం కాగా మొత్తం బడ్జెట్ 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు).


దక్షిణాఫ్రికా క్రికెట్ డెరైక్టర్‌గా గ్రేమ్ స్మిత్
క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) పూర్తిస్థాయి డెరైక్టర్‌గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఏప్రిల్ 17న నియమితులయ్యాడు. 2019, డిసెంబర్ నుంచి తాత్కాలిక డెరైక్టర్‌గా వ్యవహరిస్తోన్న 39 ఏళ్ల స్మిత్ రానున్న రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌ఏ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫౌల్ ప్రకటించారు. తాత్కాలిక డెరైక్టర్‌గా ఆరునెలల పని కాలంలో కఠిన శ్రమ, అనుభవం, అంకితభావంతో స్మిత్ అద్భుత ఫలితాలు సాధించాడని జాక్వెస్ కొనియాడారు. స్మిత్ 2003-14 మధ్య కాలంలో 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 108 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పూర్తిస్థాయి డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న గ్రేమ్ స్మిత్ వచ్చీరాగానే మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సఫారీ టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి డికాక్‌ను తప్పిస్తున్నట్లు పేర్కొన్నాడు.


లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ వాయిదా
టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను 2021 ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తెలిపాడు. ఫెడరర్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. 2020 ఏడాది బోస్టన్‌లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య లేవర్ కప్ జరగాల్సింది. అయితే మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. దాంతో 2020 లేవర్ కప్‌ను వాయిదా వేస్తూ 2021 ఏడాది సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని ఫెడరర్ తెలిపాడు. 2017, 2018, 2019లలో మూడుసార్లూ టీమ్ యూరోప్ జట్టే లేవర్ కప్‌లో విజేతగా నిలిచింది.


వేలానికి లోకేశ్ రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్‌‌స, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్ 20న తెలిపాడు.
శ్రీలంకలో దక్షిణాఫ్రికా పర్యటన వాయిదా
శ్రీలంకలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం 2020 జూన్‌లో ఇరు దేశాల మధ్య మూడేసి వన్డేలు, టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ అదుపులోకి రాకపోగా... రోజురోజుకీ మహమ్మారి ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో సింహళ దేశంలో క్రికెట్ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వర్గాలు తెలిపాయి.


ఆన్‌లైన్‌లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), చెస్.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్గజ చెస్ క్రీడాకారులతో కూడిన ఆరు జట్ల మధ్య ఆన్‌లైన్‌లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. 2020, మే 5 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, రష్యా, యూరప్, చైనా, అమెరికా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు పాల్గొంటాయి. ర్యాపిడ్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ముందుగా డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 10న సూపర్ ఫైనల్ జరుగుతుంది. ప్రతి జట్టులో నలుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఒక మహిళా క్రీడాకారిణికి స్థానం తప్పనిసరి. మొత్తం లక్షా 80 వేల డాలర్ల (రూ. కోటీ 38 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. చెస్ దిగ్గజాలు, ప్రపంచ మాజీ చాంపియన్స్ గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్, వ్లాదిమిర్ క్రామ్నిక్ తదితరులు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీలో భారత బృందానికి ఆనంద్ నాయకత్వం వహించనున్నాడు.


కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కోపై వేటు
కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ ఫ్రాంచైజీ తరఫున కేవలం ఒక సీజన్‌కు మాత్రమే పనిచేసిన ఈల్కో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. 2019-20 ఐఎస్‌ఎల్ సీజన్‌లో ఈల్కో పర్యవేక్షణలోని కేరళ జట్టు 19 పాయింట్లతో ఏడో స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ‘కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సీతో హెడ్ కోచ్ ఈల్కో బంధం ముగిసింది. కోచ్‌గా అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. అతనికి భవిష్యత్‌లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని కేరళ బ్లాస్టర్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ఏప్రిల్ 22న ప్రకటించింది. నెదర్లాండ్‌‌సకు చెందిన 48 ఏళ్ల ఈల్కో ఐఎస్‌ఎల్‌లో కేరళ కన్నా ముందు నార్త్ ఈస్ట్ యునెటైడ్(2018-19)కు హెడ్ కోచ్‌గా వ్యవహరించి ఆ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.


ఐ యామ్ బ్యాడ్మింటన్ అంబాసిడర్‌గా పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమం ‘ఐ యామ్ బ్యాడ్మింటన్’కు వరల్డ్ చాంపియన్, హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు అంబాసిడర్‌గా ఎంపికై ంది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ ఏప్రిల్ 22న ప్రకటించింది. నిజాయితీగా ఆడటం ద్వారా ఆట పట్ల తమకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఆటగాళ్లు వ్యక్తం చేసేందుకు ఈ ప్రచార కార్యక్రమం వేదికగా నిలువనుంది. ఈ ప్రచార కార్యక్రమానికి సింధుతో పాటు మిచెల్లీ లీ (కెనడా), జెంగ్ సీ వీయ్, హంగ్ యా కియాంగ్ (చైనా), జాక్ షెఫర్డ్ (ఇంగ్లండ్), వలెస్కా ఖోబ్‌లాచ్ (జర్మనీ), చాన్ హో యున్ (హాంకాంగ్), మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
వీరికన్నా ముందు బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్, బీడబ్ల్యూఎఫ్ పారాలింపిక్ అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్ రిచర్డ్ పెరోట్, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, విక్టర్ అక్సెల్‌సన్, హెండ్రా సతియావాన్, క్రిస్టినా పెడెర్సన్, చెన్ లాంగ్, మిసాకి మత్సుతోమో, అకయా తకహాషి 2016 నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమష్టి ప్రయత్నం ద్వారా బ్యాడ్మింటన్ క్రీడా లోకంలో అవగాహన పెంచడమే కాకుండా ఆట సమగ్రతను కాపాడటంలో ఆటగాళ్లను చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.


పుజారాతో ఒప్పందం రద్దు: ఇంగ్లండ్ కౌంటీ జట్టు
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లౌసెష్టర్‌షైర్ రద్దు చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఆ జట్టు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అతను ఏప్రిల్ 12-మే 22 మధ్య నాలుగు రోజుల పాటు సాగే 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ (కోవిడ్-19) విజంభణతో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో అన్ని స్పోర్‌‌ట్స ఈవెంట్‌లు వాయిదా పడ్డాయి. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ దేశంలో మే 28 వరకు జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పుజారాతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించలేమని... అందుకే రద్దు చేస్తున్నట్లు గ్లౌసెష్టర్‌షైర్ పేర్కొంది.


భారత్, న్యూజిలాండ్ ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లు రద్దు
2020, మే 23, 24వ తేదీల్లో భువనేశ్వర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన రెండు ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ విషయాన్ని న్యూజిలాండ్ హాకీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 10న తెలిపారు. న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్‌డౌన్ మార్గనిర్దేశకాలను అనుసరించి ప్రస్తుత పరిస్థితుల్లో తాము విదేశాల్లో పర్యటించే అవకాశం లేదని... అందుకే భారత్‌తో జరిగే రెండు ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లను, చైనాలో మహిళల హాకీ జట్టు పర్యటనను రద్దు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
డోలాయమానంలో టోక్యో ఒలింపిక్స్
2021 ఏడాది జూలై 23కి వాయిదా పడిన ఒలింపిక్స్ అప్పుడైనా సరైన సమయంలో జరుగుతాయనే హామీ ఇవ్వలేమని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) తోషిరో ముటో చెప్పారు. దీంతో 2021 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.


రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ రద్దు
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సన్నాహకంగా జరిగే రోజర్స్ కప్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నమెంట్‌ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఆగస్టు 7 నుంచి 16 వరకు కెనడాలోని మాంట్రియల్‌లో జరగాల్సింది. అయితే కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కెనడా ప్రభుత్వం ఆగస్టు 31 వరకు ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ టోర్నీ నిర్వాహకులు 2020 ఏడాది టోర్నీని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 12న ప్రకటించారు.


భారత్‌లో ఆసియా బాక్సంగ్ చాంపియన్‌షిప్
ఆసియా బాక్సంగ్ చాంపియన్‌షిప్ పోటీలకు 2020 ఏడాది నవంబర్-డిసెంబర్‌లలో భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ చివరిసారి పురుషుల ఆసియా చాంపియన్‌షిప్ 1980లో ముంబైలో... మహిళల ఆసియా చాంపియన్‌షిప్ 2003లో హిస్సార్‌లో జరిగాయి. గతేడాది నుంచి వేర్వేరుగా కాకుండా ఏకకాలంలో పురుషుల, మహిళల విభాగాల్లో ఆసియా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.


టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ రేసు వాయిదా
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాయిదా పడుతున్న మెగా ఈవెంట్స్‌లో మరొకటి చేరింది. ప్రతి యేటా జరిగే ప్రతిష్టాత్మక సైక్లింగ్ రేసు ‘టూర్ డి ఫ్రాన్స్’ వాయిదా పడింది. 117 ఏళ్ల చరిత్ర ఉన్న ‘టూర్ డి ఫ్రాన్స్’ రేసుకు షెడ్యూల్ ప్రకారం 2020, జూన్ 27 నుంచి జూలై 19 వరకు ఫ్రాన్స్ లోని నైస్ నగరం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం జూలై మూడో వారం వరకు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలెవరూ గుమిగూడవద్దని ఏప్రిల్ 15న ఆదేశాలు జారీ చేసింది. దాంతో నిర్వాహకులు ఈ రేసును వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 20 వరకు ‘టూర్ డి ఫ్రాన్స్’ రేసు జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 1903లో తొలిసారి ‘టూర్ డి ఫ్రాన్స్’ రేసు జరిగింది.


వన్డే ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు అర్హత
2021 ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత మహిళల జట్టు నేరుగా అర్హత సాధించిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏప్రిల్ 15న ప్రకటించింది. 2017 వరల్డ్‌కప్ రన్నరప్ భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి.
ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా 2017 నుంచి 2020 మధ్యకాలంలో ఆయా జట్ల మధ్య జరగని సిరీస్‌లకు సంబంధించి అన్ని జట్లకు సమంగా పాయింట్లు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి నేరుగా వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశం హోదాలో న్యూజిలాండ్ పాల్గొంటుంది. జూలై 3 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా మిగిలిన మూడు బెర్త్‌లు ఖాయమవుతాయి.


ఐపీఎల్-2020 నిరవధిక వాయిదా
దేశంలో లాక్‌డౌన్ పొడిగింపుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 నిరవధికంగా వాయిదా వేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 15న ప్రకటించింది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా మార్చి29న ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15వరకు వాయిదా వేసింది. అయితే లాక్‌డౌన్ పొడిగింపుతో తాజాగా ఐపీఎల్-13 రద్దుకే బీసీసీఐ మొగ్గు చూపింది.


థాయ్‌లాండ్ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై నిషేధం
నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో... థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) నిషేధం విధించింది. దీంతో ఈ రెండు దేశాల లిఫ్టర్లు వచ్చే 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. థాయ్‌లాండ్‌పై మూడేళ్ల నిషేధం విధించడంతోపాటు 2 లక్షల డాలర్ల జరిమానా వేశామని... మలేసియాపై ఏడాదికాలం నిషేధం విధించామని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఏప్రిల్ 1న నిషేధానికి సంబంధించిన సమాచారం థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలకు ఇచ్చామని, నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసుకునేందుకు 21 రోజుల గడువు ఉందని వెల్లడించింది. 2018 ప్రపంచ చాంపియన్ షిప్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన తొమ్మిది మంది లిఫ్టర్లు డోపింగ్‌లో పట్టుబడ్డారు.

అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ వాయిదా
కరోనా ధాటికి మరో మెగా ఈవెంట్ వాయిదా పడింది. భారత్ వేదికగా జరగాల్సిన అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఏప్రిల్ 4న ప్రకటించింది. ప్రాణాంతక వైరస్ కారణంగానే 2020, నవంబర్ 2 నుంచి 21 వరకు జరగాల్సిన ప్రపంచకప్ టోర్నీని నిలిపివేస్తున్నామని ‘ఫిఫా కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్’ వెల్లడించింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ‘ఫిఫా’ నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) స్వాగతించింది.
షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్‌లకు కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై నగరాలు ఆతిథ్యమివ్సాల్సింది. మొత్తం 16 జట్లు తలపడే టోర్నీలో... ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత పొందింది. అండర్-17 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనడం భారత్‌కిదే తొలిసారి కావడం విశేషం.

ఇండోనేసియా ఓపెన్ రద్దు: బీడబ్ల్యూఎఫ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉత్పాతం కొనసాగుతుండటంతో... 2020, జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 6న తెలిపింది. రద్దయిన టోర్నీల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2-7), థాయ్‌లాండ్ ఓపెన్ (జూన్ 9-14), ఇండోనేసియా ఓపెన్ (జూన్ 16-21), రష్యా ఓపెన్ (జూలై 7-12) ఉన్నాయి.
షూటింగ్ వరల్డ్‌కప్‌లు కూడా...
మరోవైపు మే నెలలో భారత్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్‌లను... మ్యూనిచ్, బాకు నగరాల్లో జూన్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య తెలిపింది.

విజ్డన్ అత్యుత్తమ క్రికెటర్‌గా బెన్ స్టోక్స్
2019 ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. 2019 సంవత్సరానికిగాను ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’గా స్టోక్స్‌ను ఎంపిక చేసినట్లు విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ఏప్రిల్ 8న ప్రకటించింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఒక ఇంగ్లండ్ ఆటగాడు దీనికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వరుసగా గత మూడు సంవత్సరాలు లీడింగ్ క్రికెటర్‌గా కోహ్లి ఎంపిక కాగా... ఇప్పుడు స్టోక్స్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్... ఫైనల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సంచలన విజయం అందించాడు.
మహిళల విభాగంలో ఎలీస్ పెర్రీ..
మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికై ంది. 2016లోనూ ఇదే అవార్డుకు ఎంపికై న పెర్రీ...రెండుసార్లు ఈ పురస్కారానికి ఎంపికై న తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్‌‌సలలో సెంచరీ, అర్ధసెంచరీ చేయడంతో పాటు వన్డేల్లో 73 సగటుతో, టి20ల్లో 150 సగటుతో పరుగులు సాధించింది. మరో 27 వికెట్లు కూడా పడగొట్టింది. టి20ల్లో వరల్డ్ లీడింగ్ క్రికెటర్ గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రసెల్ ఎంపికయ్యాడు.

ఏప్రిల్ 2020 వ్యక్తులు

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సంజయ్ కొఠారి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 25న కొరాఠీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ హాజరయ్యారు. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కొఠారి, హరియాణా కేడర్‌కు చెందిన వారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్‌బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా ఎంపికయ్యారు. సీవీసీగా ఆయన 2021 జూన్ వరకు కొనసాగుతారు.
ప్రధాని నేతత్వంలోని హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉండే కమిటీ సీవీసీని ఎంపిక చేయడం ఆనవాయితీ. సీవీసీ పదవీ కాలం నాలుగేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటారు. సీవీసీ కేవీ చౌదరి గత ఏడాది జూన్‌లో రిటైరైనప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, రాష్ట్రపతి కోవింద్ కార్య దర్శిగా పీఈఎస్‌బీ చైర్మన్ కపిల్ దేవ్ త్రిపాఠీని ఏప్రిల్ 20వ తేదీన కేంద్రం నియమించింది.


కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రీతీ సుదాన్ 2020, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆమె పదవీ కాలం పొడిగింపునకు ప్రధాని నేతత్వంలోని కేబినెట్ కమిటీ ఏప్రిల్ 26న ఆమోదం తెలిపింది. మరో 23 మంది సీనియర్ ఐఏఎస్‌లను పలు విభాగాలకు కార్యదర్శులుగా నియమించింది. పలువురి శాఖలను మార్చింది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న 1988 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి గిరిధర్ అరమానె కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా ఉన్న సంజీవ్ రంజన్ నౌకాయాన కార్యదర్శిగా నియమితులయ్యారు.


ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్‌కు చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా ఉన్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్ మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్ 2020, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. చంద్రదత్తా కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ తోపాటు, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, విధానాలు పాటిస్తున్నదీ లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తుంటారు.


బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా దిపాంకర్ దత్తా
బాంబే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిపాంకర్ దత్తా ఏప్రిల్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి ఆయనతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. ఇప్పటి వరకూ పని చేసిన జస్టిస్ భూషణ్ ధర్మాధికారి ఏప్రిల్ 27న రిటైరయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన దిపాంకర్ దత్తా 1965 ఫిబ్రవరి 9న జన్మించారు. 1989 నవంబర్ 14న న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరించారు. కలకత్తా హైకోర్టు శాశ్వత జడ్జిగా 2006 జూన్ 22న నియమితులయ్యారు. కలకత్తాలో జడ్జి కావడానికి ముందు గువాహతి హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టులో 16 సంవత్సరాలు పని చేశారు. రాజ్యాంగం, కార్మికులు, సర్వీసు విభాగాల్లో నిపుణులైన జస్టిస్ దిపాంకర్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ గానూ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లలో లాయర్ ఇన్‌చార్జిగా పనిచేశారు.


బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) ఇకలేరు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని టోంక్ గ్రామంలో 1967, జనవరి 7న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ’పాన్ సింగ్ తోమర్’ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివరిగా ’అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.
 
ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత
ప్రముఖ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్,పిల్లలు రిద్దిమా కపూర్, రణ్‌భీర్ కపూర్ ఉన్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన రిషీకపూర్ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.


ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తిరుమూర్తి
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. 1985 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమూర్తి ప్రస్తుతం విదేశీ మంత్రిత్వశాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇప్పటివరకు సేవలందిస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఆసే్ర్టలియాలో భారత రాయబారిగా జైదీప్ మజుందార్‌ను, జాయింట్ సెక్రటరీ దీపక్ మిట్టల్‌ను ఖతార్‌లో భారత రాయబారిగా నియమించారు.
క్షేత్రస్థాయి స్థితిని బట్టి పార్లమెంట్
తదుపరి పార్లమెంట్ సమావేశాలు ఎప్పటినుంచి నిర్వహించాలన్న దానిపై క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మిషన్ కనెక్టు’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఏప్రిల్ 29న పలువురు రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలతో సత్ఫలితాలు వస్తే షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2020 ఏడాది ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23న ముగించిన సంగతి తెలిసిందే.

రోగులకు స్వీడన్ రాకుమారి సోఫియా సేవలు
స్వీడన్ రాకుమారి సోఫియా ఏప్రిల్ 17 నుంచి ఆస్ప్రతిలో పనిచేయడం ప్రారంభించారు. డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియాహెమ్మెట్ యూనివర్సిటీ కాలేజీ వారానికి దాదాపు 80 మంది హెల్త్ కేర్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ కాలేజీకి సోఫియా గౌరవ చైర్ మెంబర్. మూడు రోజుల పాటు మెలకువలు నేర్చుకున్న రాకుమారి సోఫియా సేవలు అందించడం ప్రారంభించారు. మోడల్ రంగానికి చెందిన సోఫియా స్వీడన్ రాకుమారుడు కార్ల్ ఫిలిప్ ను పెళ్లాడడంతో రాజ కుటుంబంలోకి అడుగుపెట్టారు.


టామ్ అండ్ జెర్రీ దర్శకుడు జీన్ డీచ్ కన్నుమూత
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్‌లో ఏప్రిల్ 16న హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు.
జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పెలైట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే.


ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది.
బొప్పూడి కృష్ణమోహన్
1965, ఫిబ్రవరి 5న గుంటూరులో జన్మించిన కృష్ణమోహన్ 1988లో ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. గుంటూరు జిల్లా కోర్టులో కొద్ది నెలల పాటు ప్రాక్టీస్ చేశారు. 1994లో సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ అడ్వొకేట్లలో ఒకరిగా ఉన్నారు. 2019, జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఈయన.
కంచిరెడ్డి సురేష్‌రెడ్డి
అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో 1964, డిసెంబర్ 7న సురేష్‌రెడ్డి జన్మించారు. అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేసిన ఆయన కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది టి.బాల్‌రెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. క్రిమినల్ లాలో మంచి పట్టు సాధించారు. హైకోర్టులో ఉన్న అతి తక్కువ మంది ఉత్తమ క్రిమినల్ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా మరణశిక్ష కేసులను వాదించడంలో దిట్ట. సివిల్, రాజ్యాంగపరమైన కేసులను కూడా వాదించారు.
కన్నెగంటి లలితకుమారి
లలిత కుమారి స్వగ్రామం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జములపాళెం. 1971, మే 5న జన్మించిన ఆమె పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, దేవదాయ శాఖ, టీటీడీ, వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెస్సైస్ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు.


తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి ఏప్రిల్ 20న సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.
విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపి రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12 మంది ఉన్నారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకం అయితే ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి.

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గందరగోళం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయిందన్న కథనాలతో ప్రపంచమే ఉలిక్కిపడింది. 36 ఏళ్ల వయసున్న కిమ్ గుండెకి జరిపిన శస్త్రచికిత్స ఆయన ప్రాణం మీదకి తెచ్చిందన్న అమెరికా మీడియాలో కథనాలు వస్తుంటే ఉత్తర కొరియా నోరు మెదపడం లేదు. కిమ్ ఆరోగ్యస్థితిపై అక్కడ మీడియా వార్తల్ని ప్రచురించలేదు. రోజువారీ వార్తల్ని కిమ్ సాధించిన విజయాలు, వివిధ రంగాలపై కిమ్ గతంలో వెల్లడించిన అభిప్రాయాల్ని మాత్రమే మీడియా ఇస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో, కాదో తనకు తెలీవని చెప్పారు. కిమ్ బాగానే ఉన్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 15న కిమ్ తన తాత ఇల్ సంగ్ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.

ఆసియాలో అపర కుబేరుడుగా ముకేశ్ అంబానీ
చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ఫేస్‌బుక్, రిలయన్స్ జియో ఒప్పందంతో అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఏప్రిల్ 23న తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ ఏప్రిల్ 22 నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది.
మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఎమ్మెల్సీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్‌కు శాసనసభ, శాసనమండలిలో సభ్యత్వం లేకపోవడంతో ఏప్రిల్ 9న కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న సీటును నుంచి సీఎం ఉద్ధవ్‌ను నియమించాలని గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని కోరినట్టు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ పరబ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఎవరైనా మంత్రి ఆరు నెలల్లోగా ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాలేపోతే ఆ పదవికి అనర్హుడవుతారు. 2019, నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు. 2020, మే 28 నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది.


ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఎస్‌ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమించేలా పంచాయతీరాజ్ చట్టం-1994 సెక్షన్-200కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్రవేశారు. తాజా చట్టం ద్వారా ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించారు.
తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.


ఐఎంఎఫ్ బృందంలో రఘురామ్ రాజన్‌కు చోటు
ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఏప్రిల్ 10న ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు ఈ కమిటీలో వున్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.


ప్రముఖ రచయిత్రి పింగళి పార్వతి కన్నుమూత
దూరదర్శన్ న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత్రి పింగళి పార్వతి ప్రసాద్(70) ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1947 ఆగస్టు 9న జన్మించిన ఆమె మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో చదువుకున్నారు. 1980 నుంచే ఆకాశవాణిలో పనిచేసిన పార్వతి ప్రసాద్ దూరదర్శన్ వార్తలు చదివిన తొలి న్యూస్‌రీడర్లలో ఒకరు. 35 ఏళ్లపాటు న్యూస్‌రీడర్‌గా సేవలందించారు. ఆమె యోజన, ఇతర పత్రికలకు అనువాదాలతో పాటు ఎన్నో నాటికలు, వ్యాసాలు రచించారు. యునిసెఫ్, సేవ్‌ద చిల్డన్ర్ యూకే, పంచాయతీ రాజ్ శాఖ మొదలైన సంస్థలకు ప్రచార సామగ్రి తయారీలో తోడ్పాటును అందించారు.


కేంద్ర మాజీ మంత్రి రాజశేఖరన్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎమ్‌వీ రాజశేఖరన్(92) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న తుదిశ్వాస విడిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజలింగప్ప అల్లుడైన రాజశేఖరన్ 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి గ్రామీణాభివద్ధికి ప్రాధాన్యమిచ్చారు.

బ్రిటన్ కమెడియన్ కన్నుమూత
కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) ఏప్రిల్ 12న కన్నుమూశారు. బ్రూక్ టేలర్ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.

కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ జాఫర్ మృతి
పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. పాక్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల జాఫర్ పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న కన్నుమూశారు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అయిన జాఫర్ సర్ఫరాజ్ తన కెరీర్‌లో 6 వన్డేలు ఆడి 96 పరుగులు చేశాడు. 1988 నుంచి 94 వరకు 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పెషావర్‌కు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు, 1990 నుంచి 92 వరకు లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. రిటైర్మంట్ అనంతరం జాఫర్ సీనియర్ జట్టుతో పాటు అండర్-19 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. జాఫర్ సర్ఫరాజ్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా 1997-98 మధ్యలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.


కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత ష్లెసింగర్ మృతి
ప్రముఖ పాటల రచయిత, గాయకుడు, గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత ఆడమ్ ష్లెసింగర్(52) కరోనా సమస్యతో ఏప్రిల్ 1న కన్నుమూశారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 1961, అక్టోబర్ 31న జన్మించిన... ఆడమ్ 1995లో ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ అనే రాక్ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్ చిత్రం ’దట్ ధింగ్ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు. ఈ చిత్రం ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికై ంది. ఆడమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డును సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్ క్రిస్మస్’కి ఆడమ్ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు.

డీఎల్‌ఎస్ సూత్రధారి లూయిస్ ఇక లేరు
అంతర్జాతీయ క్రికెట్‌కు ‘డక్‌వర్త్ లూయిస్ పద్ధతి’ (డీఎల్‌ఎస్)ని పరిచయం చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లూయిస్ ఏప్రిల్ 1న తుదిశ్వాస విడిచారని ఇగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని స్వాన్‌సీలో 1938, జూలై 6న జన్మించిన లూయిస్.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా, మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే జర్నలిస్టుగానూ సేవలందించారు. 1990వ దశకంలో బీబీసీ టెలివిజన్ కామెంటేటర్‌గా ఆయన పనిచేశారు. లూయిస్ సాగించిన శోధనలకు, సాధించిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎంబీఈ’ (మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్) పురస్కారంతో ఆయనను సత్కరించింది.
డక్‌వర్త్ లూయిస్ పద్ధతి...
క్రికెట్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌లు ఆగిపోతే డక్‌వర్త్ లూయిస్ పద్ధతినే అనుసరించి విజేతను తేలుస్తారు. 1997లో ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలిసి టోనీ లూయిస్ ఈ పద్ధతిని ప్రతిపాదించారు. 1999లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది.
దనంతర కాలంలో ఈ పద్ధతికి ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ మెరుగులు దిద్దడంతో అతని పేరు కూడా కలిపి 2014 నుంచి డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్‌ఎస్)గా వ్యవహరిస్తున్నారు.


మాజీ వికెట్ కీపర్ జాక్ ఎడ్వర్డ్స్ కన్నుమూత
న్యూజిలాండ్ క్రికెట్‌లో బిగ్ హిట్టర్‌గా ఖ్యాతిగాంచిన మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జాక్ ఎడ్వర్డ్స్(64) కన్నుమూశారు. ఎడ్వర్డ్స్ మరణించిన విషయాన్ని ఆ దేశ సెంట్రల్ డిస్టిక్స్ ్రక్రికెట్ అసోసియేషన్ ఏప్రిల్ 6న వెల్లడించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కివీస్ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానుల్ని అలరించిన ఎడ్వర్డ్స్ 1974-85 మధ్య కాలంలో క్రికెట్‌లో తనదైన ముద్రవేశారు. ఆరు టెస్టు మ్యాచ్‌లు, ఎనిమిది అంతర్జాతీయ వన్డేలతోపాటు 64 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను ఆడాడు. 1978లో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్‌‌సల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది.


నాస్కామ్ చైర్మన్‌గా యూబీ ప్రవీణ్‌రావు
ఐటీ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్’ చైర్మన్‌గా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), నాస్కామ్ ప్రస్తుత వైస్ చైర్మన్ యూబీ ప్రవీణ్‌రావు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూపు సీఈవో కేశవ్ మురుగేశ్ స్థానంలో ప్రవీణ్‌రావు బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు అస్సెంచుర్ ఇండియా చైర్‌పర్సన్, సీనియర్ మేనేజింగ్ డెరైక్టర్ అయిన రేఖ ఎం మీనన్ నాస్కామ్ వైస్ చైర్‌పర్సన్‌గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పనిచేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగిన నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏప్రిల్ 6న ఈ మేరకు నియామక నిర్ణయాలు తీసుకుంది.