<b>జనవరి 2021 </b>

జనవరి 2021

జనవరి 2021 అంతర్జాతీయం

యూఎస్, రష్యా అణు ఒప్పందం మరో అయిదేళ్లు
అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించింది. ఈ అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలోనే పొడిగించడానికి కూడా వీలు కల్పించారు. దీంతో జాతి ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ తాజా నిర్ణయం తీసుకున్నారని అధ్యక్షభవనం వైట్ హౌస్ జనవరి 22న తెలిపింది. అమెరికా ప్రతిపాదనని రష్యా స్వాగతించింది. తాము కూడా ఒప్పందాన్ని పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
2010లో బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1,550కి మించి అణు వార్‌హెడ్‌లను మోహరించడానికి వీల్లేదు.

ఇథియోపియాలో నరమేధం
ఇథియోపియాలోని దక్షిణ బెనిషంగూల్-గుముజ్ రీజియన్‌లో జనవరి 13న నరమేధం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో 80 మందికిపైగా మరణించినట్లు ఇథియోపియా మానవ హక్కుల సంఘం ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 100కు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇథియోపియాలో ఇటీవలి కాలంలో జాతుల మధ్య భీకరస్థాయిలో ఘర్షణలు జరగడం పరిపాటిగా మారింది. దేశంలో 80కిపైగా వేర్వేరు జాతులు ఉన్నాయి.

సులవేసి ద్వీపం ఏ దేశంలో ఉంది?
ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో జనవరి 15న భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు.
సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు.
ఇండోనేసియా రాజధాని: జకార్తా; కరెన్సీ: ఇండోనేసియన్ రూపియా
ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు: జోకో విడోడో

2021 ఏడాది జీ-7 దేశాల సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి?
బ్రిటన్ అధ్యక్షతన 2021, జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాల శిఖరాగ్ర సమావేశాలకు యూకేలోని తీర ప్రాంతం ‘‘కార్న్‌వాల్’’ వేదిక కానుంది. ఈ శిఖరాగ్ర భేటీకి భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలను ఆతిథ్య హోదాలో ఆహ్వానించారు. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 17న వెల్లడించారు.
బోరిస్ తెలిపిన వివరాల ప్రకారం...

  • 2021 ఏడాది జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
  • తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్‌వాల్‌లో జీ7 భేటీ జరుగుతుంది.

జీ-7 సభ్య దేశాలు...

  • అమెరికా
  • యూకే
  • కెనడా
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • ఇటలీ
  • జపాన్

మరిన్ని అంశాలు...

  • యూకే 2021 ఏడాది ఫిబ్రవరిలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.
  • భారత్ త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.

జావా సముద్రంలో కూలిన ఇండోనేసియా విమానం పేరు?
ఇండోనేసియాకు చెందిన ప్రయాణికుల జెట్ విమానం ‘‘బోయింగ్ 737 విమానం’’ ఆచూకీ తెలియకుండా పోయింది. శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన ఈ విమానం జనవరి 9న మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాళీమంథన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే.
కూలిన చోటు గుర్తించాం
కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని జనవరి 10న ఇండోనేసియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంతో కీలకమైన బ్లాక్‌బాక్స్ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొంది.
ఇండోనేసియా రాజధానిజకార్తా; కరెన్సీ: ఇండోనేసియన్ రూపియా
ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు: జోకో విడోడో

కొత్త రాజధానిగా కాళీమంథన్...
ఇండోనేసియా కొత్త రాజధానిగా బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్‌ను ఎంపికచేసినట్లు ఆ దేశాధ్యక్షుడు జొకో విడోడో 2019, ఆగస్టు 27న ప్రకటించారు. కాళీమంథన్ తూర్పు భాగంలోని అటవీ ప్రాంతంలో 1,80,000 హెక్టార్లలో రాజధానిని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత రాజధాని జకార్తా ప్రతీ సంవత్సరం 25 సెంటీమీటర్ల మేర సముద్ర ముంపునకు గురవుతుండటం, వరదలు, భూకంపాల ముప్పు ఎక్కువ ఉండటంతోపాటు విపరీతమైన వాయు కాలుష్యం, ట్రాఫిక్ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాజధాని అభివృద్ధికి రూ.2.3లక్షల కోట్లు కేటాయించినట్లు జొకో చెప్పారు.

తైవాన్‌తో స్వీయ ఆంక్షల్ని తొలగించిన అమెరికా
తైవాన్ దౌత్యవేత్తలు, అధికారులతో అమెరికా దౌత్యవేత్తలు, ఇతర అధికారులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వీయ అంతర్గత సంక్లిష్ట ఆంక్షలను తొలగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. తైవాన్ అమెరికాకు విశ్వసనీయమైన, అనధికార భాగస్వామి అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ అత్యవసర వినియోగానికి జనవరి 1న అనుమతినిచ్చింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే డబ్ల్యూహెచ్‌ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ ఉన్నారు.
సాధారణంగా... ఏ దేశానికి ఆ దేశమే వ్యాక్సిన్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంది.
ఐరాస భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య?
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ తన రెండేళ్ల పదవీ కాలాన్ని (2021-22) 2021, జనవరి 1 నుంచి ప్రారంభించింది. ప్రపంచ శాంతి, భద్రతలను పర్యవేక్షించే ఈ అత్యున్నత విధాన నిర్ణయ మండలిలో భారత్‌కు చోటు దక్కడం ఇది ఎనిమిదోసారి. ఇటీవల ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ 184 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టు నెలలో, 2022లో మరో నెల పాటు భద్రతా మండలి అధ్యక్ష పదవిలో భారత్ కొనసాగనుంది.
15 సభ్య దేశాలు...

  • 15 దేశాలు సభ్యులుగా గల ఐరాస భద్రతా మండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.
  • తాత్కాలిక సభ్యదేశాలుగా ఎస్తోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్ గ్రెనెడైన్స్, ట్యునీషియా, వియత్నాం కొనసాగుతున్నాయి.
  • 2021, జనవరి 1 నుంచి భారత్, మెక్సికో, ఐర్లాండ్, నార్వే, కెన్యా కొత్తగా చేరాయి.


ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం?
ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల జాబితాలో తమిళనాడు రాజధాని చెన్నై తొలి స్థానంలో నిలిచింది. చెన్నై తర్వాత తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండో స్థానంలోచైనాలోని హర్బిన్ మూడో స్థానంలో ఉన్నాయి. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్’సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్ సంస్థ 130 నగరాలతో ఈ నివేదికను రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్ ముందున్నాయని నివేదిక పేర్కొంది.
అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాలు...

ర్యాంకు

నగరం

సీసీ కెమెరా (చ.కి.మీకు)

సీసీ కెమెరా(1,000 మందికి)

1

చెన్నై(భారత్)

657

25.5

2

హైదరాబాద్ (భారత్)

480

30.0

3

హర్బిన్ (చైనా)

411

39.1

4

లండన్ (బ్రిటన్)

399

67.5

5

గ్జియామెన్ (చైనా)

385

40.3

6

చెంగ్డూ (చైనా)

350

33.9

7

తైయువాన్ (చైనా)

319

119.6

8

ఢిల్లీ(భారత్)

289

14.2

9

కున్మింగ్ (చైనా)

281

45.0

10

బీజింగ్ (చైనా)

278

56.2


నైగర్‌లో మారణహోమం
పశ్చిమాఫ్రికా దేశం నైగర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. నైగర్-మాలి సరిహద్దుల్లో ఉన్న రెండు గ్రామాలు ‘టోంబాంగౌ, జారౌమ్‌దరే’లలో దాడి చేసి వందమందికిపైగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు చోటు చేసుకున్న రెండు గ్రామాలను నైగర్ ప్రధాని జనవరి 4న సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
జనవరి 3న టిల్లాబెరి ప్రాంతంలో తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్ గ్రూప్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్తులు కొట్టి చంపారు. ప్రతీకారంగా సాయుధ ఉగ్రవాదులు రెండు గ్రామాలపై దాడి చేశారు. పొరుగు దేశం నైజీరియాలోని బోకో హరామ్ ఉగ్రవాదులతోపాటు, అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రముఠాలు నైగర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి.
నైగర్ రాజధాని: నియామె; కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సీఎఫ్‌ఏ ఫ్రాంక్
నైగర్ ప్రస్తుత అధ్యక్షుడు: మహమదౌ ఇస్సౌఫౌ
నైగర్ ప్రస్తుత ప్రధాని: బ్రిగి రాఫిని

కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రథమంగా ఏ దేశంలో ప్రారంభమైంది?
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్-19 టీకా ‘‘కోవిషీల్డ్’’ వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే ప్రప్రథమంగా జనవరి 4న యూకేలో మొదలైంది. డయాలసిస్ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో డయాలసిస్ రోగి బ్రియాన్ పింకెర్(82)కు మొదటగా టీకా వేశారు. యూకే ప్రభుత్వం ఇప్పటికే ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్ టీకా మొదటి డోసును 10 లక్షల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి అందజేశారు.
కోవిషీల్డ్: రూ.200-400
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్ టీకా ‘కోవిషీల్డ్’ను భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3-4 డాలర్ల చొప్పున, ప్రైవేట్ మార్కెట్లో 6-8 డాలర్ల చొప్పున విక్రయిస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. దేశీయంగా ఆక్స్‌ఫర్డ్ టీకా ఉత్పత్తి, పంపిణీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టనుంది.

ఏ దేశ రాజధానిలో గ్లోబల్ టెక్నాలజీ సదస్సు-2021 జరగనుంది?
జపాన్ రాజధాని టోక్యోలో 2021, ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్) శిఖరాగ్ర సదస్సు-2021 జరగనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) నిర్వహించనున్న ఈ సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావుకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు కేటీఆర్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రండే జనవరి 5న లేఖ రాశారు.

మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం
అలీ పే, వీచాట్ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 5న సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్పారు. జనవరి 5 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం 45 రోజులు కొనసాగుతుంది. నిషేధానికి గురైన యాప్‌లలో... అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యాప్‌లు ఉన్నాయి.

జో బెడైన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోదం
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బెడైన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు జనవరి 7న అధికారికంగా అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లలో బెడైన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. దీంతో 78 ఏళ్ల బెడైన్ 2021, జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్యాపిటల్ భవనంపై దాడి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై జనవరి 6న దాడి చేశారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బెడైన్ ఎన్నికను ధ్రువీకరించడానికి కాంగ్రెస్ ఉభయసభలు సమావేశమైన సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు అమెరికా జెండాలు చేతబూని వచ్చి ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల్ని నిలువరించడానికి జరిగిన పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మరణించారు. ఈ దాడిని భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించాయి.

జనవరి 2021 జాతీయం

ఏ నగరంలో నిర్వహించిన పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం జనవరి 23న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా.. నేతాజీ లేఖలతో కూడిన పుస్తకాన్ని, ఆయన స్మారకంగా స్టాంపు, నాణెంను ప్రధాని విడుదల చేశారు.
కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ... 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్‌ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం నేతాజీ భవన్’ను ప్రధాని సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు.
మూడు దీవుల పేర్లు మార్పు
ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్ దీవులను 2018, డిసెంబర్ 30న సందర్శించారు. ఆ సందర్భంగా ఇక్కడి మూడు దీవుల పేర్లను మార్చారు. రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుభాస్ చంద్రబోస్ ద్వీప్గా, నీల్ ఐలాండ్‌ను షహీద్ ద్వీప్‌గా, హావెలాక్ ఐలాండ్‌ను స్వరాజ్ ద్వీప్‌గా మారుస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ మూడు దీవులు ప్రముఖ పర్యాటక ప్రదేశాలు.
ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో పేరు?
మొబైల్ ఫోన్లలో, పర్సనల్ కంప్యూటర్లలలో డౌన్‌లోడ్ చేసుకునే ‘‘డిజిటల్ ఓటర్స్ ఫొటో ఐడెంటిటీ కార్డు’’ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆవిష్కరించింది. నేషనల్ ఓటర్స్ డే(జనవరి 25) సందర్భంగా కేంద్ర న్యాయశాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎలక్టోర్ ఫొటో ఐడెంటిటీ కార్డుని లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. అలాగే ఎన్నికల కమిషన్ వెబ్ రేడియో ‘‘హెలో వోటర్స్’’ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ ఓటర్ కార్డుని మార్చే అవకాశం లేకుండా ఈ-ఓటర్ కార్డు పీడీఎఫ్ ఫాంలో ఉంటుంది. అవసరమైనప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు.

డిజిటల్ వినియోగంలో లింగ వివక్ష
భారత్‌లో ఆడపిల్లలు మొబైల్ ఫోన్ వాడకంపై అంతర్లీనంగా నిషేధం కొనసాగుతోందని సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ చేంజ్(సీ3) అనే స్వచ్ఛంద సంస్థ డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్తో కలిసి నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలోని బాలికలకు ఉన్న డిజిటల్ యాక్సెస్‌ని అంచనా వేసేందుకు 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో 4,100 మందిని ఈ అధ్యయనంలో భాగస్వాములను చేశారు. జనవరి 23న సర్వేను విడుదల చేశారు.
సర్వేలోని ముఖ్యాంశాలు...

  • దేశంలో 42 శాతం మంది కిశోర బాలికలకు కేవలం రోజుకి గంటకన్నా తక్కువ సమయం మొబైల్ ఫోన్‌ని వాడే అవకాశం ఇస్తున్నారు.
  • అత్యధిక మంది తల్లిదండ్రులు ఆడపిల్లల మొబైల్ వాడకాన్ని సురక్షితం కాదని భావిస్తున్నారు.
  • బాలబాలికల మధ్య మొబైల్ వినియోగం విషయంలో వ్యత్యాసం జెండర్ వివక్ష కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది.
  • ప్రధానంగా హరియాణా రాష్ట్రంలో బాలురకి మొబైల్ వాడకంలో ఉన్నంత వెసులుబాటు ఆడపిల్లలకి లేదు.
  • కర్నాటకలో బాలికలకు మిగిలిన రాష్ట్రాలకంటే కొంత ఎక్కువగా మొబైల్ వాడే అవకాశం లభిస్తోంది.
  • 71 శాతం మంది బాలికలకు అసలు మొబైల్ ఫోన్ అందుబాటులో లేదు. అందుకు ఆర్థిక స్థోమత లేకపోవడమే కారణం.


సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్(స్మార్ట్) పథకం ఉద్దేశం?
రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ ‘‘సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్ (స్మార్ట్)’’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. రైలు టెర్మినళ్ల వద్ద గూడ్‌‌స షెడ్లను ఎంచుకుని సర్వీస్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్‌‌స షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో...
ఏపీలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్... ఐదు చోట్ల గూడ్‌‌స షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్‌‌స షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. 2020 ఏడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది.

భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. భారత రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రతీ ఏడాది మాదిరిగా ఆర్భాటంగా సంబరాలు నిర్వహించలేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, దేశ సామాజిక, ఆర్థిక పురోగతి, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే విన్యాసాలతో రాజ్‌పథ్‌లో నిర్వహించిన పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ముఖ్యఅతిథి లేకుండానే...
72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్-19 ముప్పుతో ముఖ్య అతిథి లేకుండానే నిర్వహించారు. గతంలో 1952, 1953, 1966 సంవత్సరాలలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి.
విశేషాలు...

  • భారతీయ శిల్పకళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిన లేపాక్షి కట్టడం స్ఫూర్తిగా రూపుదిద్దిన శకటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరేడ్‌లో ప్రదర్శించింది.
  • రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా 2021 ఏడాది పెరేడ్‌లో ప్రదర్శించారు.
  • యుద్ధవిమానాలను నడిపే మొదటి మహిళా పెలైట్లలో ఒకరైన లెఫ్ట్‌నెంట్ భావనా కాంత్ ఈ పెరేడ్‌లో పాల్గొన్నారు. మహిళా యుద్ధ పెలైట్ పెరేడ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.
  • వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ ప్రాతినిధ్యం వహించింది. లద్దాఖ్ సంస్కృతిని ప్రతిబింబించే థిక్సే మఠం శకటాన్ని ప్రదర్శించింది.
  • పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొంది 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ దేశ దళాలు ఈ సారి పెరేడ్‌ను ముందుండి నడిపించాయి.
  • భారత నౌకాదళం తన శకటంలో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నమూనాను ప్రదర్శించింది. అలాగే 1971 భారత్-పాక్ యుద్ధంలో నేవీ నిర్వహించిన పోరాటాన్ని కళ్లకు కట్టింది.
  • ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమిచ్చింది.
  • కోవిడ్-19 ముప్పుతో ఈ సారి రిపబ్లిక్ డే కవాతుని 8.5 కి.మీ. నుంచి 3.5కి.మీకి కుదించారు. కవాతుకు లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్ర నేతృత్వం వహించారు.

ఎర్రకోట ముట్టడి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న ఢిల్లీలోకి అడుగుపెట్టారు. రోడ్లపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేస్తూ ట్రాక్టర్లతో ఎర్రకోటను ముట్టడించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి జెండా వందనం చేసే ప్రదేశంలో, సంప్రదాయ విరుద్ధంగా జాతీయ జెండాకు బదులుగా రైతు సంఘాల జెండా, ఒక మత జెండాను ఆవిష్కరించారు.

ఏ పక్షి ఆకారంలో జయలలిత స్మారక మండపాన్ని నిర్మించారు?
చెన్నై మెరీనాబీచ్‌లో నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి జనవరి 27న ప్రారంభించారు. ఫినిక్స్ పక్షి ఆకారంలో రూ.80 కోట్లతో ఈ సమాధి స్మారాక మండపాన్ని నిర్మించారు. ఈ మండప రూపకల్పన(డిజైన్)ను ఐఐటీ మద్రాసు తయారు చేసింది. నిర్మాణానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది. జయలలిత సమాధిపై తమిళంలో, ఇంగ్లీషులో ‘బై ద పీపుల్-ఫర్ ద పీపుల్’ అని అమర్చారు.
2016 డిసెంబర్ 5న... జయలలిత కన్నుమూయగా ఆమె పార్థివదేహాన్ని చెన్నై మెరీనాబీచ్‌లో ఎంజీ రామచంద్రన్ స్మారక మండపం వెనుకవైపున ఖననం చేసి సమాధి నిర్మించారు.

దేశంలోనే మొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించిన రాష్ట్రం?
దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్‌లో ప్రారంభమయి్యంది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. రెండో దశలో హిసార్ నుంచి డెహ్రాడూన్ వరకు మరో ఎయిర్ ట్యాక్సీని వచ్చేవారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మూడో దశలో చండీగఢ్ నుంచి డెహ్రాడూన్, హిసార్ నుంచి ధర్మశాల వరకు ఈ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిమ్లా, కులూతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం ఇందులో చేర్చాలని యోచిస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ కోసం టెక్నామ్ పీ2006టీ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ప్రయాణ చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వనుంది. మెట్రో 2 టైర్, 3 టైర్ నగరాలను ఎయిర్ ట్యాక్సీలతో అనుసంధానిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.

దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి పేరు?
ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జనవరి 16న ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో ‘‘కోవిషీల్డ్, కోవాగ్జిన్’’ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జనవరి 16న దేశవ్యాప్తంగా 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు.
మొట్టమొదటి వ్యక్తిగా మనీశ్...
దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్‌కు భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను ఇచ్చారు.
తొలిరోజు ఏ రాష్ట్రంలో ఎంతమందికి టీకా..

రాష్ట్రం

టీకా తీసుకున్నవారు

ఉత్తరప్రదేశ్

21,291

ఆంధ్రప్రదేశ్

19,108

మహారాష్ట్ర

18,328

బిహార్

18,169

ఒడిశా

13,746

కర్ణాటక

13,594

గుజరాత్

10,787

పశ్చిమ బెంగాల్

9,730

తెలంగాణ

3,962

తమిళనాడు

2,945

ఆంధ్రప్రదేశ్‌లో...
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 16న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. తొలి టీకాను ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి ఇచ్చారు.
తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు జనవరి 16న టీకాల కార్యక్రమం విజయవంతమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు వైద్యులు తొలి టీకా వేశారు. అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్‌లో తొలి టీకాను ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రకళ, తిలక్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఆయాగా పని చేస్తున్న రేణుక తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఆర్‌ఏఎఫ్ స్థావరం ఏర్పాటుకు హోం మంత్రి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా బుళ్లాపురలో ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) నూతన స్థావరం ఏర్పాటు కానుంది. ఈ ఆర్‌ఏఎఫ్ క్యాంప్‌కి జనవరి 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు. సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో ఈ ఆర్‌ఏఎఫ్ 97వ బెటాలియన్ క్యాంప్ ఏర్పాటు కానుంది. ఇందులో సిబ్బందికి శిక్షణనివ్వడంతో పాటు క్వార్టర్లు, ఆస్పత్రులు అందుబాటులో ఉంటాయి. దాదాపు 50 ఎకరాల్లో నిర్మిస్తారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది సీఆర్‌పీఎఫ్కి చెందిన ఒక విభాగం.

ఇటీవల కొత్తగా ఎనిమిది రైళ్లను ఎక్కడ ప్రారంభించారు?
అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మరోవైపు దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి-చందోడ్, చందోడ్-కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్-కేవాడియా సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు.
జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్...
ప్రధాని తాజాగా ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్-కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్‌లో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు

  • అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారు.
  • గిరిజన ప్రాంతమైన కేవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహాన్ని ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారు.
  • రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలింది.
  • ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి.

సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండో దశ, సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేశారు. అనంతరం ప్రధాని ప్రసంగించారు. ఈ రెండు మైట్రోరైల్ ప్రాజెక్టుల కోసం రూ.17,000 వ్యయం చేయనున్నారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు.

  • దేశంలో 27 నగరాల్లో 1,000 కిలోమీటర్లకు పైగా మెట్రోరైల్ నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయి.
  • ప్రస్తుతం వేర్వేరు రవాణా విధానాలైన బస్సులు, రైళ్లను అనుసంధానిస్తున్నాం.
  • 2014 కంటే ముందు 10-12 ఏళ్లలో 225 కిలోమీటర్ల మేర మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది.
  • 2014 తర్వాత ఆరేళ్లలో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్‌ను ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.


ఎవరి జయంతిని పరాక్రమ దివస్ పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?
భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23వ తేదీన ఇకనుంచి ‘‘పరాక్రమ దివస్’’గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పరాక్రమ దివస్ సందర్భంగా 2021, జనవరి 23న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ జనవరి 19న వెల్లడించారు.
మంత్రి ప్రహ్లాద్ తెలిపిన వివరాల ప్రకారం...

  • - బోస్ 125వ జయంతి(2021, జనవరి 23)ని పురస్కరించుకుని కోల్‌కతా నేషనల్ లైబ్రరీ గ్రౌండ్‌‌సలో ప్రధాని మోదీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు.
  • బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్(ఇండియన్ నేషనల్ ఆర్మీ,, ఐఎన్‌ఏ)లోని ప్రముఖులు, వారి కుటుంబీకులను ప్రధాని సన్మానిస్తారు.
  • 1938లో జాతీయ కాంగ్రెస్‌కు నేతాజీ అధ్యక్షుడిగా ఎన్నికైన గుజరాత్‌లోని సూరత్ జిల్లా హరిపురా గ్రామంలో కూడా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.
  • నేతాజీ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రధాని మోదీ అధ్యక్షతన 85 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది.
  • ఐఎన్‌ఏ రెజిమెంటల్ మార్చ్ నినాదం ముందుకు సాగిపోదాం(కదమ్ కదమ్ బధాయే జా)ను బీటింగ్ రిట్రీట్ ఉత్సవంలో భాగంగా చేస్తారు.
  • ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో నేతాజీ ఫొటోలను ఉంచుతారు.

యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రంతో ఎంవోయూ చేసుకున్న సంస్థ?
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ (టీకేఎం) కేంద్ర ప్రభుత్వంతో సులభ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ఈ విషయాన్ని జనవరి 18న టీకేఎం ప్రకటించింది. టయోటా కౌశల్య కార్యక్రమం కింద కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాల యువతకు టయోటా టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తామని తెలిపింది.
ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన ఎండీగా....
ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (వీసీ అండ్ ఎండీ)గా ఆర్పీ ఠాకూర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రిగా పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) ఉన్నారు.
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ నూతన చైర్మన్‌గా...
ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) చైర్మన్‌గా పి.గౌతమ్‌రెడ్డి జనవరి 18న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్ర హోదా కోసం తీర్మానం చేసిన కేంద్రపాలిత ప్రాంతం
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని పుదుచ్చేరి అసెంబ్లీలో జనవరి 18న తీర్మానం చేశారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే తీర్మానానికి కూడా పుదుచ్చేరి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ, ముఖ్యమంత్రిగా వి. నారాయణ స్వామి ఉన్నారు.
ఏపీ ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ‘‘అంత్రిక్ సురక్ష సేవ పతకం-2020’’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను కేంద్రం ఈ మెడల్స్‌కు ఎంపిక చేసింది. వీటిని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జనవరి 19న అందజేశారు.

ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
భారత్ ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)-2020 విడుదలైంది. జనవరి 20న ఢిల్లీ జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ ఈ ఇండెక్స్‌ను విడుదల చేశారు. నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ సంయుక్తంగా ఈ సూచీని రూపొందించాయి. ఈ సూచీ తొలి ఎడిషన్ 2019, అక్టోబర్ 17న విడుదలైంది. అంటే 2020 ఏడాది విడుదలైన సూచీ రెండో ఎడిషన్.
మూడు కేటగిరీలుగా...
నూతన ఆవిష్కరణలకు అందించిన సహకారం, ఆవిష్కరణల పాలసీలను మెరుగుపరచడం వంటి విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును పరిగణనలోకి తీసుకుని 36 సూచికల ఆధారంగా సూచీలో ర్యాంకులు ఇచ్చారు. రాష్ట్రాలను 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలు, 9 నగర, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు.
సూచీలో ఏపీ, తెలంగాణ...
ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓవరాల్‌గా 24.19 స్కోరు సాధించి... పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ రాష్ట్రం 33.23 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. 2019 సూచీలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉన్నాయి.
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020: ర్యాంకులు
17 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో...

ర్యాంకు

రాష్ట్రం

స్కోరు

1

కర్ణాటక

42.50

2

మహారాష్ట్ర

38.03

3

తమిళనాడు

37.91

4

తెలంగాణ

33.23

5

కేరళ

30.58

6

హరియాణా

25.81

7

ఆంధ్రప్రదేశ్

24.19

8

గుజరాత్

23.63

9

ఉత్తరప్రదేశ్

22.85

10

పంజాబ్

22.54

11

పశ్చిమ బెంగాల్

21.69

12

రాజస్తాన్

20.83

13

మధ్యప్రదేశ్

20.82

14

ఒడిశా

18.94

15

జార్ఖండ్

17.12

16

చత్తీస్‌గఢ్

15.77

17

బిహార్

14.48

10 ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాల కేటగిరీలో...

ర్యాంకు

రాష్ట్రం

స్కోరు

1

హిమాచల్ ప్రదేశ్

25.06

2

ఉత్తరాఖండ్

23.50

3

మణిపూర్

22.78

4

సిక్కిం

20.28

5

మిజోరం

16.93

6

అస్సాం

16.38

7

అరుణాచల్ ప్రదేశ్

14.90

8

నాగాలాండ్

14.11

9

త్రిపుర

12.84

10

మేఘాలయ

12.15

9 నగర, కేంద్ర పాలిత ప్రాంతాల కేటగిరీలో...

ర్యాంకు

రాష్ట్రం

స్కోరు

1

ఢిల్లీ

46.60

2

చండీగఢ్

38.57

3

డామన్&డయ్యూ

26.76

4

పుదుచ్చేరి

25.23

5

గోవా

24.92

6

దాద్రా&నగర్ హవేలీ

22.74

7

అండమాన్&నికోబార్ దీవులు

18.89

8

జమ్మూ&కశ్మీర్

18.62

9

లక్షద్వీప్

11.71


ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం
న్యూ రెవారీ(హరియాణా)-న్యూ మదార్(రాజస్థాన్) రైలు మార్గంలో 306 కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 7న జాతికి అంకితం చేశారు. అలాగే ప్రపంచంలోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మోదీ ప్రసంగించారు. విద్యుత్‌తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ రైలు హరియాణాలోని న్యూ అటేలీ నుంచి రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ వరకు ప్రయాణిస్తుంది.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
  • దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించే మహాయజ్ఞం(మిషన్) వేగం పుంజుకుంది.
  • దేశంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడానికి రైల్వే సరుకు రవాణా కారిడార్లు ఎంతగానో దోహదపడతాయి.
  • న్యూ రెవారీ-న్యూ మదార్ పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్ 9 రాష్ట్రాల్లోని 133 రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తుంది.
  • పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్‌తో హరియాణా, రాజస్తాన్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

కరోనా టీకా పంపిణీ కోసం భారత రూపొందించిన యాప్ పేరు?
దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం భారత ప్రభుత్వం ‘‘కోవిన్(Cowin)’’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. టీకా పంపిణీలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర ప్రభుత్వం జనవరి 10న ప్రకటించింది. వ్యాక్సిన్ అందరికీ, అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఈ ఆన్‌లైన్ వేదిక వీలు కల్పిస్తుందని పేర్కొంది.
జనవరి 16న...
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ భారత్‌లో జనవరి 16న ప్రారంభం కానుంది. తొలుత సుమారు 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇవ్వనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారికి, 50 లోపు వయస్సున్న దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. టీకా పంపిణీ సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 10న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్‌మెంట్ టు కంబాట్ కోవిడ్-19 చైర్మన్ రామ్ సేవక్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
భారత్‌లో కోవిషీల్డ్‌ను తయారు చేస్తున్న సంస్థ పేరు?
దేశ వ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో... అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన ‘‘కోవిషీల్డ్, కోవాగ్జిన్’’ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 11న ఆర్డర్ ఇచ్చింది. కోవిషీల్డ్‌ను తొలి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే కోవాగ్జిన్‌ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. రెండు టీకాల కోసం మొత్తం రూ.1,300 కోట్ల వ్యయం చేయనున్నారు.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో తయారీ...
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆ్ట్రాజెనెకా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.
టీకా ఖర్చు కేంద్రానిదే...
కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. జనవరి 11న రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని ఈ మేరకు తెలిపారు.

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలుపై జనవరి 12న భారత సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
నలుగురు సభ్యులతో ఒక కమిటీ...
పది రోజుల్లోగా ఈ కమిటీ తొలి సమావేశం జరుగుతుందని, తొలి భేటీ నుంచి రెండు నెలల్లోగా సుప్రీంకోర్టుకు సిఫారసులతో కూడిన నివేదికను అందిస్తుందని ధర్మాసనం వివరించింది.
కమిటీ సభ్యులు...

  • ఇద్దరు రైతు నేతలుభారతీయ కిసాన్ యూనియన్, ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మన్, షెట్కారీ సంఘటన్(మహారాష్ట్ర) అధ్యక్షుడు అనిల్ ఘన్వత్.
  • ఇద్దరు వ్యవసాయ రంగ నిపుణులుఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దక్షిణాసియా విభాగం డెరైక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, వ్యవసాయ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రెసైస్ కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ.


ఖాదీ ప్రాకృతిక్ పెయింట్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి (కేవీఐసీ).. ఆవు పేడతో పెయింట్‌ను అభివృద్ధి చేసింది. ఈ వాల్ పెయింట్‌కు ‘‘ఖాదీ ప్రాకృతిక్ పెయింట్’’గా నామకరణం చేశారు. కేంద్ర జాతీయ రవాణా, ఖాదీ, పరిశ్రమల మండలి, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ జనవరి 12న న్యూఢిల్లీలో ఈ పెయింట్‌ను ఆవిష్కరించారు.
పర్యావరణ అనుకూలం...
పర్యావరణ అనుకూల, హాని చేయని, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఖాదీ ప్రాకృతిక్ రంగుల తయారీలో గోవుల పేడను ప్రధాన పదార్థంగా ఉపయోగించారు. భారతీయ ప్రమాణాల మండలి ధ్రువీకరణను కూడా ఈ ఉత్పత్తి పొందింది.
రూ.6,000 కోట్లు...
కార్యక్రమంలో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ... ప్రాకృతిక్ పెయింట్ రూ.6,000 కోట్ల స్థాయి పరిశ్రమగా అవతరిస్తుందన్నారు. అలాగే కేవీఐసీ ఆదాయాన్ని ప్రస్తుత రూ.80,000 కోట్ల నుంచి రానున్న ఐదేళ్లలో రూ.5లక్షల కోట్లకు చేర్చాలనుకుంటున్నట్టు చెప్పారు.

ఆలయాల శుభ్రతకు దేశంలోని ప్రధాన దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
పరిశుభ్రత ఉత్పత్తులను తయారు చేసే నేచర్ ప్రొటెక్ట్ సంస్థ దేశంలో ప్రధాన దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందాన్ని ఏర్పరుచుకుంది. పండుగల వేళలో దేవాలయాల ప్రాంగణాలను శుభ్రంగా ఉంచటంతో పాటు భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కంపెనీ ప్రత్యేకమైన చర్యలను చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, కర్నాటకలోని శ్రీ చాముండేశ్వరీ దేవాలయం, కేరళలోని గురువయార్ దేవాలయం, తమిళనాడులోని మీనాక్షీ అమ్మన్ దేవాలయాలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ఐఏఎఫ్ కోసం ఎన్ని తేజస్’ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది?
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ. 48 వేల కోట్లతో 83 ‘తేజస్’ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తేలిక పాటి యుద్ధ విమానమైన తేజస్‌ను స్వదేశీ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందిస్తోంది. తేజస్ చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐఏఎఫ్‌లో 40 తేజస్ యుద్ధ విమానాలున్నాయి. ఈ తాజా డీల్‌కు సంబంధించి వైమానిక దళం, హెచ్‌ఏఎల్ మధ్య ఈ మార్చ్‌లో సంతకాలు జరుగుతాయని, 2024లో హెచ్‌ఏఎల్ నుంచి యుద్ధ విమానాల సరఫరా ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఏర్పాటు చేయనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు డిసెంబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమానికి దేశం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలందరికీ స్వదేశీ టీకాయే లభిస్తుందని చెప్పారు. 2020 చివరి రోజైన డిసెంబర్ 31ని ఫ్రంట్‌లైన్ వర్కర్లకి అంకితమిస్తున్నట్టుగా చెప్పారు.
గుజరాత్ రాజధాని: గాంధీనగర్
గుజరాత్ ప్రస్తుత గవర్నర్: ఆచార్య దేవ్ వ్రత్
గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి: విజయ్ రూపానీ

దేశంలోని ఏ నగరాల్లో లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది?
అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం(గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్(జీహెచ్‌టీసీ)- ఇండియా) కింద ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 1న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు(ఎల్‌హెచ్‌పీ) శంకుస్థాపన చేశారు. అలాగే పీఎంఏవై (అర్బన్), ఆశా-ఇండియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన్నారు.
లైట్ హౌసింగ్ ప్రాజెక్టులు...
ఇండోర్(మధ్యప్రదేశ్), రాజ్‌కోట్(గుజరాత్), చెన్నై (తమిళనాడు), రాంచీ(జార్ఖండ్), అగర్తల(త్రిపుర), లక్నో(ఉత్తరప్రదేశ్) నగరాల్లో లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ (జీహెచ్‌టీసీ)తో ఈ ఆరు నగరాల్లో 12 నెలల్లో వెయి్య చొప్పున ఇళ్ల నిర్మాణం జరుగుతుందని మోదీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు 3 జాతీయ అవార్డులు..
పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. బెస్ట్ ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక విభాగంలో 2 అవార్డులు, ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో విశాఖకు మొదటి ర్యాంకు, అవార్డు దక్కింది.

సంబల్‌పూర్ ఐఐఎం భవనానికి శంకుస్థాపన
ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి జనవరి 2న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయన్నారు.
ఒడిశా రాజధాని: భువనేశ్వర్
ఒడిశా ప్రస్తుత గవర్నర్: గణేశి లాల్
ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్
డ్రై రన్ విజయవంతం...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి జనవరి 2న డ్రై రన్ విజయవంతంగా పూర్తయింది. దేశంలో మొదలు కానున్న భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహించారు.

ఏ ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశారు?
దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జనవరి 3న ఆమోదం తెలిపింది. స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’, విదేశీ టీకా కోవిషీల్డ్’ల వినియోగానికి షరతులతో డీసీజీఐ అనుమతించింది. ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కోవాగ్జిన్, కోవిషీల్డ్...

  • భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ను అభివృద్ధి చేసింది. కోవిషీల్డ్ సమర్ధత 70.42 శాతంగా డీసీజీఐ ప్రకటించింది.
  • బ్రిటన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది.

దేశంలో మొత్తం చిరుత పులుల సంఖ్య?
చిరుత పులులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రూపొందించిన నివేదిక ‘‘స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018’’ను కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 2020, డిసెంబర్ 21న న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం... దేశంలో మొత్తం 12,852 చిరుత పులులు ఉన్నాయి. అత్యధికంగా సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో 8,071 చిరుతలున్నాయి. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే చిరుతల మనుగడ కొనసాగుతోంది. మిగతా ఖండాల్లో ఇవి క్రమంగా కనుమరుగైపోయాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • భారత్‌లో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3,421 చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక 1,783 చిరుతలతో రెండోస్థానాన్ని ఆక్రమించింది.
  • సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతపులులతో తృతీయస్థానంలో నిలిచింది.
  • సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్ల విభాగంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నాయి.
  • 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలుండగా 2018 కల్లా వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం పెరుగుదల) పెరిగింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతి
నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’’కు భారత సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ. పరిధిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2-1 ఓట్ల తేడాతో జనవరి 5న సుప్రీంకోర్టు బెంచ్ ఆమోద ముద్ర వేసింది. ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కేంద్రం చేసిన వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు ఏకీభవించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు. కాలుష్య నియంత్రణ కోసం స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగించాలని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.

ఏ రెండు ప్రాంతాలను అనుసంధానించే గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధాని ప్రారంభించారు?
కేరళలోని కోచి నుంచి కర్ణాటకలోని మంగళూరును అనుసంధానించే 450 కిలోమీటర్ల సహజవాయువు గ్యాస్ పైపులైన్‌ను జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... యావత్ దేశాన్ని ఒకే గ్యాస్ పైపులైన్ గ్రిడ్‌తో అనుసంధానించనున్నట్టు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు

  • గుజరాత్‌లో పవన, సౌర విద్యుత్‌తో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ పనులు మొదలు కాగా.. 5-6 ఏళ్లలో సహజవాయువు పైపులైన్‌ను 32,000 కిలోమీటర్లకు విస్తరించనున్నాం.
  • సహజవాయువు వల్ల అధిక కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు, ఇతర ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది.
  • ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో 58 శాతం వాటా బొగ్గుదే. పెట్రోలియం, ఇతర వనరుల వాటా 26 శాతంగా ఉంది. సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన వాటా 6, 2 శాతంగానే ఉన్నాయి.
  • 2030 నాటికి సహజవాయువు వాటాను 15 శాతానికి చేర్చనున్నాము.
  • చెరకు, ఇతర సాగు ఉత్పత్తుల నుంచి తీసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో 20 శాతం వినియోగించనున్నాము.
  • 14 కోట్ల కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆరేళ్లలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్యను రెట్టింపు చేశాం.


భారత ప్రభుత్వం ప్రారంభించిన టాయ్‌కథాన్ కార్యక్రమం ఉద్దేశం?
భారతీయ సంస్కృతి, విలువలను పరిచయం చేసే గేమ్స్, వినూత్నమైన ఆట వస్తువుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘టాయ్‌కథాన్-2021’ పేరుతో జనవరి 5న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, స్టార్టప్‌లు కలసి తమ ఆలోచనలను పంచుకోవడం ద్వారా వినూత్నమైన ఆట బొమ్మలు, గేమ్స్ రూపకల్పనకు వీలు కల్పించే కార్యక్రమమే టాయ్‌కథాన్.
భారత ఆట వస్తువుల మార్కెట్ బిలియన్ డాలర్లు ఉంటుందని, దురదృష్టవశాత్తూ 80 శాతం ఆటబొమ్మలు దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం
న్యూ రెవారీ(హరియాణా)-న్యూ మదార్(రాజస్థాన్) రైలు మార్గంలో 306 కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 7న జాతికి అంకితం చేశారు. అలాగే ప్రపంచంలోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మోదీ ప్రసంగించారు. విద్యుత్‌తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ రైలు హరియాణాలోని న్యూ అటేలీ నుంచి రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ వరకు ప్రయాణిస్తుంది.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు

  • దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించే మహాయజ్ఞం(మిషన్) వేగం పుంజుకుంది.
  • దేశంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడానికి రైల్వే సరుకు రవాణా కారిడార్లు ఎంతగానో దోహదపడతాయి.
  • న్యూ రెవారీ-న్యూ మదార్ పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్ 9 రాష్ట్రాల్లోని 133 రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తుంది.
  • పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్‌తో హరియాణా, రాజస్తాన్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

జనవరి 2021 రాష్ట్రీయం

పీవీ విజ్ఞాన వేదికను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు?
బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు పీవీ సొంత గ్రామమైన వంగరలో ఓ విజ్ఞానవేదిక రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్మిస్తున్నారు. త్వరలో పనులు మొదలుకానున్నాయి. 2022లో పీవీ జయంతి నాటికి వేదికను ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘‘పీవీ విజ్ఞాన వేదిక’’ పేరుతో నాలుగు ఎకరాల్లో దీన్ని రూపొందిస్తున్నారు. పర్యాటకులు పీవీ గురించి తెలుసుకునేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. వంగర గ్రామం ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా బీమదేవరపల్లి మండలంలో ఉంది.
మ్యూజియంగా పీవీ ఇల్లు
వంగర గ్రామంలో పీవీ నరసింహారావు నివసించిన ఇంటిని మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన వాడిన వస్తువులు, ఆయన ఛాయాచిత్రాలు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది.
మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా ఏ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది?
దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణకి చెందిన ‘వీ హబ్’, గుజరాత్‌కు చెందిన ‘ఐ హబ్’ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. జనవరి 16న వర్చువల్ విధానంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు, గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి విభావరి బెన్ దవే పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 240 స్టార్టప్‌లకు అన్ని విధాల చేయూత అందిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీ హబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్-WE HUB) కార్యక్రమం 2018, మార్చి 8న ప్రారంభమైంది.

ఏపీలోని ఏ జిల్లాలో స్టీల్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలశాఖ డెరైక్టర్ జవ్వాది సుబ్రమణ్యం జనవరి 13న తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద విశాఖ నగరం సమీపంలో పూడిమడక వద్ద సుమారు వెయి్య ఎకరాల్లో స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే లక్ష్యంతో ఈ స్టీల్ క్లస్టర్ ఏర్పాటు కానుంది.
మరోవైపు అనంతపురంలో అపెరల్ పార్కుచిత్తూరు జిల్లా నగరిలో టెక్స్‌టైల్ పార్కులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ వంటి పదిరంగాల్లో థీమ్ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
బయో ఏషియా-2021 సదస్సు థీమ్ ఏమిటి?
2021, ఫిబ్రవరి 22, 23 తేదీల్లో బయో ఏషియా 18వ వార్షిక సదస్సు జరగనుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సదస్సు పోస్టర్, లోగోను జనవరి 18న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆవిష్కరించారు. లైఫ్ సెన్సైస్ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాలను చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘బయో ఏషియా’వార్షిక సదస్సును నిర్వహిస్తోంది.
బయో ఏషియా-2021 సదస్సు థీమ్: మూవ్ ది నీడిల్
ముఖ్యాంశాలు...

  • 18వ బయో ఏషియా వార్షిక సదస్సు ఎజెండా కోవిడ్- 19 కేంద్రంగా ఉండనుంది.
  • తెలంగాణ రాష్ట్ర లైఫ్ సెన్సైస్ సలహామండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.
  • ప్రస్తుతం బయో ఏషియా సీఈఓగా శక్తి నాగప్పన్ ఉన్నారు.
  • సుమారు 50 దేశాలకు చెందిన 1500 మంది నిపుణులు సదస్సులో పాల్గొననున్నారు.
  • కరోనా నేపథ్యంలో సదస్సును తొలిసారిగా వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు.

ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్ ఏ నగరంలో జరిగింది?
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరంలో జరిగింది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో జనవరి 4న ప్రారంభించారు. ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్యూటీ మీట్‌లో భాగంగా... క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు. సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను తెలుసుకోవడానికి డ్యూటీ మీట్ వేదికై ంది. మహిళా భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ, } పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు బ్రిటన్‌లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్-కమిషనర్ విజయ్‌కుమార్, కేంబ్రిడ్‌‌జ విశ్వవిద్యాలయం దక్షిణాసియా రీజనల్ డెరైక్టర్ టీకే అరుణాచలం జనవరి 7న అమరావతిలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా... రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు పులివెందులలో ఇంగ్లిష్ ల్యాబ్‌లు, మరో మూడు కేంద్రాల్లో డిజిటల్ స్టూడియోలను కేంబ్రిడ్జ్ వర్సిటీ నెలకొల్పనుంది.

రహదారుల అభివృద్ధి కోసం ఎన్‌డీబీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి రూ.472 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టుల కోసం... న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)తో కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 6న రుణ ఒప్పందం చేసుకున్నాయి.

రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ఎక్కడ ప్రారంభమైంది?
తెలంగాణ రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామంలో ప్రారంభమైంది. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టల్‌ను జనవరి 8న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. వ్యవసాయంతోపాటు, వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తే చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా పరిపుష్టిని సాధిస్తారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
సెంట్రీలుగా మహిళలు...
పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసు కమిషనరేట్‌కూ నిత్యం పహారా అవసరం. ఈ విధులు నిర్వర్తించే వారినే పోలీసు పరిభాషలో సెంట్రీలని అంటారు. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లే సెంట్రీలుగా ఉండేవారు. అయితే తెలంగాణలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు.. ఈ విధుల్లో మహిళల్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. మొదట బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సెంట్రీలను ఏర్పాటుచేశారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఆధ్వర్యంలో నడిచే ఈ క్టస్టర్‌ను జనవరి 8న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 5 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా సంపదతోపాటు లక్ష ఉద్యోగాలు సృష్టించడంపై దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు.
పీఎం స్టియాక్...
దేశంలో శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల సలహామండలి(పీఎం స్టియాక్) నిర్ణయం మేరకు హైదరాబాద్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాలుగు నగరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పుణే ఈ జాబితాలో ఉన్నాయి.

ఆలయాల పునః నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా జిల్లా విజయవాడలో గతంలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 9న శంకుస్థాపన చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.77 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న 8 పనులకూ భూమి పూజ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో దాదాపు రూ.1.79 కోట్లతో తొమ్మిది ఆలయాలను పునః నిర్మిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జనవరి 8న షెడ్యూల్ జారీ చేశారు. 2021, జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని నిమ్మగడ్డ తెలిపారు.

అమ్మఒడి పథకం రెండో విడత ఎక్కడ ప్రారంభమైంది?
ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం కింద రెండో ఏడాది నగదు జమ కార్యక్రమం ప్రారంభమైంది. నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో జనవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
పథకం-ముఖ్యాంశాలు

  • అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు.
  • అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
  • ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.
  • 2020, జనవరి 9న చిత్తూరులో తొలిసారిగా ఈ పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.

సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు

  • 2022 ఏడాది నుంచి అమ్మ ఒడి కింద నగదుకు బదులుగా తల్లులు కోరుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇస్తాం. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు దీన్ని వర్తింపచేస్తాం.
  • 42.33 లక్షల మంది పేద తల్లులకు 2020 ఏడాది రూ.6,400 కోట్లు ఇచ్చాం. 2021 సంవత్సరం 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,673 కోట్లు అమ్మఒడి కింద ఇస్తున్నాం.
  • 2020 ఏడాది అమ్మఒడి కింద 82 లక్షల మంది పిల్లలకు లాభం కలిగితే ఈ ఏడాది 84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది.
  • ప్రభుత్వ స్కూళ్లలో గతంలో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 42 లక్షల మంది ఉన్నారు.
  • పిల్లలు, మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో టాయిలెట్లను నిర్మించడమే కాకుండా నిర్వహణ కోసం అమ్మ ఒడిలో ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 మినహాయిస్తున్నాం.

బొగ్గుగనుల మంత్రిత్వశాఖతో ఏపీఎండీసీ ఒప్పందం
జార్ఖండ్ రాష్ట్రంలోని అరుదైన కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ కోల్ బ్లాక్)ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కైవసం చేసుకుంది. బిడ్డింగ్‌లో ఏపీఎండీసీ ఎల్1గా నిలవడంతో ఆ బొగ్గు క్షేత్రాన్ని ఏపీఎండీసీకి అప్పగించారు. ఈ మేరకు జనవరి 11న ఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ - ఏపీఎండీసీ మధ్య ఒప్పందం కుదిరింది.
అత్యంత నాణ్యమైన, అరుదైన బొగ్గు

  • జార్ఖండ్‌లోని గిరిడీ కోల్ ఫీల్డ్స్‌లో అత్యంత నాణ్యమైన, అరుదైన ఎస్1 రకం కుకింగ్ కోల్ ఉంది.
  • దేశంలో వినియోగమయ్యే ఎస్1 రకం బొగ్గులో 1.5 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 98.5 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది.
  • ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నేస్ (ఉక్కును కరిగించడం) కోసం దీనిని వినియోగిస్తారు.

ఏపీఎండీసీకి 48.25 శాతం...
ఏపీఎండీసీకి లభించిన బహ్మదిహ బోగ్గు గనిలో 25 లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా.

  • బ్రహ్మదిహ క్షేత్రంలో తవ్వే బొగ్గు అమ్మకం ధరలో 41.75 శాతం జార్ఖండ్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 48.25 శాతం ఏపీఎండీసీదన్నమాట. - బ్రహ్మదిహ బొగ్గు గనిని పొందడంవల్ల ఏపీఎండీసీకి రూ.250 నుంచి రూ.350 కోట్ల వరకు నికర రాబడి వస్తుందని అధికారుల అంచనా.

మాస్ మ్యూచువల్ కెపబిలిటీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనుంది. రూ.1,000 కోట్ల పెట్టుబడులతో కంపెనీ తమ సెంటర్‌ను నెలకొల్పనుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు జనవరి 11న ప్రకటించారు. 1851లో మాస్ మ్యూచువల్ కంపెనీ ఏర్పాటైంది.
జీసీసీలు ఏం చేస్తాయి?

  • గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి.
  • బ్యాక్ ఆఫీసు సేవలు, కార్పొరేట్ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి.
  • ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్‌ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్ప్ డెస్క్‌లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు.


ఏపీలో తొలి ఐటీ నైపుణ్య శిక్షణా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఐటీ నైపుణ్య శిక్షణా కేంద్రం విజయవాడ ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎంసీ సీఈవో ఆర్జా శ్రీకాంత్ జనవరి 7న ప్రారంభించారు. ఈ కేంద్ర ఏర్పాటు కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐట్యాప్)తో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ఈ కేంద్రం ఏర్పాటైంది.

డిజాస్టర్ రెస్సాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభం
ఏపీ అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖతోపాటు పోలీస్ శాఖకు సమకూర్చిన 14 డిజాస్టర్ రెస్సాన్స్, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు డిసెంబర్ 31న ప్రారంభమయ్యియి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ గ్రౌండ్‌లోని వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ వాహనాలు దేశంలో ముంబై తర్వాత మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వచ్చాయన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఈ వాహనాలను అందించిందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఘటనా స్థలిని ఈ వాహనాల ద్వారా వీక్షించొచ్చని పేర్కొన్నారు.

ఏఐ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై రూపొందించిన నివేదిక?
ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో తెలంగాణ రాష్ట్రం 2020 ఏడాది సాధించిన విజయాలతో కూడిన తెలంగాణాస్ ఇయర్ ఆఫ్ ఏఐ-2020 అండ్ బియాండ్’ అనే నివేదికను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు జనవరి 2న హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాష్ట్రంలో ఏఐ విధానం అమలును వేగవంతం చేసేందుకు ‘తెలంగాణ ఏఐ మిషన్’(టీ-ఎయిమ్)ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • ఏఐ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు 2020, జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం 2020ని ఇయర్ ఆఫ్ ది ఏఐగా ప్రకటించింది.
  • ‘ఏఐ ఫ్రేమ్‌వర్క్’ ఆచరణలోకి తెచ్చేందుకు నాస్కామ్ భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్(టి ఎయిమ్) ఏర్పాటు చేసి ఆరు అంచెల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది.
  • ఆరోగ్య, రవాణా రంగాలపై దృష్టి కేంద్రీకరించేందుకు ఇంటెల్, ట్రిపుల్ ఐటీ (హైదరాబాద్), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహ భాగస్వామ్యంతో ‘ఏఐ పరిశోధన కేంద్రం’ఏర్పాటైంది.
  • వ్యవసాయ, న్యాయ రంగాలపై ప్రాథమికంగా దృష్టి సారించేందుకు సెంటర్ ఫర్ ఫోర్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(క్రెడెట్) ఏర్పాటైంది.
  • -వరల్డ్ ఎకనామిక్ ఫోరం సాయంతో ఏఐ4ఏఐ, అగ్రిటెక్ ఇన్నోవేషన్ పైలట్స్, అగ్రిడేటా హబ్, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారకాల పిచికారీ వంటి కార్యక్రమాలు నిర్వహించింది.
  • రాష్ట్రంలో ఏఐ వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇంటెల్, ఎన్‌విడియా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నాస్కామ్, ఐఐటీ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
  • జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఆవిష్కర్తల కోసం అగ్రి డేటా హబ్‌ను నెలకొల్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి డీశాలినేషన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని శుద్ధి (డీశాలినేషన్) చేసి వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. భూగర్భజలాలు కాకుండా పూర్తిగా సముద్రపు నీటినే వినియోగించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
536.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా లెదర్ క్లస్టర్‌కు రోజుకు 10.5 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం రోజుకు 90 మిలియన్ లీటర్లకు పైగా సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేయగా వచ్చిన మంచినీటిని వినియోగించి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తారు.
ఇజ్రాయెల్‌తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో డీశాలినేషన్ విధానంలో సముద్రపు నీటిని వినియోగించుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేలా ఇజ్రాయేల్‌కు చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం 2020, ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది.

షీ క్యాబ్స్ కార్యక్రమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి కార్లను అందజేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా జనవరి 4న ప్రారంభమైంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి ఎంపికైన 18 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లెసైన్సులు ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్స్ ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే, సెల్‌ఫోన్, జియో లొకేషన్ సౌకర్యం కల్పించారు. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా దీనిని అమలు చేయనున్నారు.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు యంగ్ సైంటిస్ట్ అవార్డు
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డా. శిబ్ శంకర్ గంగూలీ ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ యంగ్ సైంటిస్టు ప్లాటినం జూబ్లీ అవారు’్డకు ఎంపికయ్యారు. భూగర్భశాస్త్ర, జియో ఫిజికల్ మెథడ్, ఆయిల్ ఫీల్డ్‌లో చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్కు ఏక్కడ ఏర్పాటైంది?
దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్క్ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటైంది. వైద్య పరికరాల తయారీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ మెడికల్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ పార్క్ ఏర్పాటులో భాగంగా... 250 ఎకరాల్లో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.వేయి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ పార్క్ ద్వార 4 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా.

ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్ ఏ నగరంలో జరిగింది?
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరంలో జరిగింది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో జనవరి 4న ప్రారంభించారు. ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్యూటీ మీట్‌లో భాగంగా... క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు. సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను తెలుసుకోవడానికి డ్యూటీ మీట్ వేదికై ంది. మహిళా భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ, } పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు బ్రిటన్‌లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్-కమిషనర్ విజయ్‌కుమార్, కేంబ్రిడ్‌‌జ విశ్వవిద్యాలయం దక్షిణాసియా రీజనల్ డెరైక్టర్ టీకే అరుణాచలం జనవరి 7న అమరావతిలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా... రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు పులివెందులలో ఇంగ్లిష్ ల్యాబ్‌లు, మరో మూడు కేంద్రాల్లో డిజిటల్ స్టూడియోలను కేంబ్రిడ్జ్ వర్సిటీ నెలకొల్పనుంది.
రహదారుల అభివృద్ధి కోసం ఎన్‌డీబీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి రూ.472 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టుల కోసం... న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)తో కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 6న రుణ ఒప్పందం చేసుకున్నాయి.

జనవరి 2021 ఎకానమీ

జీడీపీ అంశంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన కోఆపరేటివ్ సొసైటీ?
ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ)... 9వ వార్షిక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ (డబ్ల్యూసీఎం) రిపోర్ట్-2020 ఎడిషన్ ర్యాంక్‌లను ప్రకటించింది. ఐసీఏ, యూరోపియన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్ (యూరిస్) సంయుక్తంగా కలిసి జనవరి 21న ఒక వెబినార్‌లో ఈ ర్యాంకుల నివేదికను విడుదల చేశాయి. టర్నోవర్, తలసరి జీడీపీ రెండు విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 300 సహకార సంస్థలతో ర్యాంక్‌లను ప్రకటించారు. తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) విభాగంలో... ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ (ఐఎఫ్‌ఎఫ్‌సీఓ- ఇఫ్కో) అగ్రస్థానంలో నిలిచింది. టర్నోవర్ పరంగా 65వ స్థానంలో నిలిచింది.
ఇఫ్కో గురించి...

  • న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఎరువుల తయారీ, విక్రయాల్లో ఇఫ్కో ఉంది.
  • దేశవ్యాప్తంగా రైతులను భాగస్వామ్యం చేయడం, భారత సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఇఫ్కో కృషి చేస్తోంది.
  • 36 వేల మంది కో-ఆపరేటివ్ సభ్యులున్న ఇఫ్కో టర్నోవర్ దాదాపు 7 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • ప్రస్తుతం ఇఫ్కో ఎండీగా యూఎస్ అవస్తీ ఉన్నారు.

ప్రపంచ జీడీపీ 2030 నాటికి 140 ట్రిలియన్ డాలర్లు
ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2030 నాటికి 6.5 ట్రిలియన్ డాలర్లు పెరిగి 140 ట్రిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. నైపుణ్య రంగంలో భారీ పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయని పేర్కొంది. అమెరికా, చైనా తర్వాత కేవలం భారత్‌లో 570 బిలియన్ డాలర్లు (రూ.40 లక్షల కోట్ల) జీడీపీ పురోగతి చోటుచేసుకుంటుందని వివరించింది. ఈ మేరకు జనవరి 25న ఒక నివేదికను విడుదల చేసింది.
ఆన్‌లైన్ దావోస్ అజెండా సమ్మిట్-2021 సందర్బంగా తాజా అధ్యయన నివేదికను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. 2021, జనవరి 24 నుంచి 29 వరకు జరిగే ఈ దావోస్ ఆన్‌లైన్ సదస్సులో సుమారు 1,000 మంది పైగా ప్రపంచ దేశాల నేతలు, దిగ్గజ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.

ఎన్‌సీఎల్‌ఏటీ నూతన బెంచ్ ఏ నగరంలో ప్రారంభమైంది?
నేషనల్ కంపెనీ అప్పీలేట్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) చెన్నై బెంచ్ జనవరి 25న ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ బ్రాంచీని ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కంపెనీల వివాదాల సత్వర పరిష్కారానికి చెన్నై బెంచ్ తోడ్పడనుంది. జైపూర్, కోల్‌కతా, కొచ్చి, ఇండోర్, అమరావతిలకు ఐదు కొత్త బెంచీలు ప్రకటించడంతో ఎన్‌సీఎల్‌టీ బెంచీల సంఖ్య 16కు చేరింది.

ఏపీఎస్‌బీబీ చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి (ఏపీఎస్‌బీబీ) చైర్మన్‌గా ఏవీ జోసెఫ్ నియమితులయ్యారు. జోసెఫ్ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్), రాష్ట్ర అటవీ దళాల అధిపతి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్)గా పనిచేసి రిటైర్ అయ్యారు. అలాగే పీసీసీఎఫ్‌గా రిటైర్ అయిన ఎస్‌కే కౌషిక్‌ను ఏపీఎస్‌బీబీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2021 ఏడాదిలో రెండంకెల్లో వృద్ధి సాధించే ఏకై క దేశం?
కరోనా సవాళ్లు విసురుతున్న తరుణంలోనూ భారత్ 2021లో రెండంకెల్లో 11.5 శాతం వృద్ధిని నమోదుచేసుకోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. 2021 ఏడాది ప్రపంచ దేశాల్లో రెండంకెల్లో వృద్ధి సాధించే ఏకైక దేశంగా భారత్ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 26న వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికను విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • వృద్ధి అంశంలో భారత్ తరువాతి స్థానాల్లో చైనా (8.1 శాతం), స్పెయిన్ (5.1 శాతం), ఫ్రాన్స్ (5.5 శాతం) ఉంటాయి.
  • ప్రపంచం మొత్తంగా వృద్ధి 5.5 శాతంగా నమోదవుతుంది.
  • 2020లో భారత్ 8 శాతం క్షీణ రేటు నమోదుచేసే అవకాశాలు ఉన్నప్పటికీ, 2021లో వృద్ధి గణనీయంగా పుంజుకుని 11.5 శాతంగా నమోదయ్యే వీలుంది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటును కలిగిన దేశం హోదాను భారత్ తిరిగి పొందుతుంది.
  • 2020లో వృద్ధి సాధించే (2.3 శాతం) ఏకై క దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా చైనా నిలవనుంది.
  • 2022లో భారత్ వృద్ధి 6.8 శాతంగా ఉంటే, చైనా విషయంలో ఈ రేటు 5.6 శాతంగా ఉండనుంది.

ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్?
ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. యాక్సెంచర్ తర్వాత ఐబీఎం కంపెనీ రెండో స్థానంలో, భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) మూడో స్థానంలో నిలిచాయి. జనవరి 27న విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్-2021 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • యాక్సెంచర్ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా, ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది.
  • నాలుగో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • జాబితాలో హెచ్‌సీఎల్-7, విప్రో-9, టెక్ మహీంద్రా-15వ స్థానానికి చేరాయి.
  • మొత్తంగా టాప్-10లో భారత్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి.

వికీపీడియాను నిర్వహిస్తోన్న సంస్థ పేరు?
ఆన్‌లైన్ సమాచార నిధి ‘వికీపీడియా’ భారత్ మార్కెట్ పట్ల దీర్ఘకాలిక దృష్టిని కలిగి ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాషా అవసరాలను అందుకోవడం ద్వారా మరింత మంది యూజర్లను వికీపీడియా ప్లాట్‌పామ్‌పైకి తీసుకురావాలని అనుకుంటున్నట్టు వికీమీడియా ఫౌండేషన్ సీఈవో క్యాథరిన్ మహేర్ జనవరి 15న తెలిపారు. భారత్ తమకు ఐదో అతిపెద్ద మార్కెట్ అని, భారత్ నుంచి ప్రతీ నెలా 75 కోట్ల పేజీ వీక్షనలు నమోదవుతున్నట్టు చెప్పారు.
వికీపీడియాను లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 2020 జనవరి 15తో వికీపీడియా 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు దీనిని ప్రారంభించారు. ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం వికీపీడియా... 300 భాషల్లో 5.5 కోట్లకు పైగా ఆర్టికల్స్‌ను, ఎటువంటి ప్రకటలు లేకుండా ఉచితంగా అందిస్తోంది. భారత్‌లో 24 భాషల్లో ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచాభివృద్ధిలో భారత్ వాటా 15 శాతం: యూబీఎస్
2025-26 నాటికి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భారత్ 15 శాతం వాటా పొందుతుందని చైనా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అండ్ బ్రోకరేజ్ దిగ్గజ సంస్థ- యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఈ మేరకు జనవరి 19న ఒక నివేదికను విడుదల చేసింది. అయితే ప్రపంచాభివృద్ధిలో భారత్ కలిగి ఉన్న ప్రస్తుత వాటా విషయం మాత్రం నివేదిక ప్రస్తావించలేదు.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • తోటి వర్థమాన దేశాలతో పోల్చితే, ‘తయారీ’ వ్యయాల విషయంలో భారత్ తక్కువగా ఉంది.
  • గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటా ప్రస్తుతం దాదాపు జీరో. అయితే వచ్చే రెండేళ్లలో ఇది 20 నుంచి 30 శాతానికి చేరే అవకాశం ఉంది.
  • 2021-22లో భారత్ ఆర్థికాభివృద్ధి 11.5 శాతంగా ఉంటుంది.
  • 2019-20లో భారత్ ఆల్ టైమ్ హైలో 56 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆకర్షించింది.
  • కరోనా ప్రేరిత అంశాల వల్ల 2020-21లో భారత్ ఆకర్షించిన ఎఫ్‌డీఐలు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
  • 2025-26 నాటికి ఈ ఎఫ్‌డీఐల పరిమాణం 100 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది.


ఫియట్ క్రిస్లర్, పియాజియోల విలీనం
వాహన రంగంలోని రెండు దిగ్గజ కంపెనీలు ‘‘ఫియట్ క్రిస్లర్, పీఎస్‌ఏ పియాజియో’’ విలీనానికి ఆయా కంపెనీల వాటాదారులు జనవరి 4న ఆమోదాలు తెలిపారు. ఈ రెండు కంపెనీల విలీనంతో ఏర్పడే కంపెనీని ‘‘స్టెల్లాంటియస్’’ పేరుతో వ్యవహరిస్తారు. ఈ కంపెనీ వార్షిక కార్ల ఉత్పత్తి సామర్థ్యం 87 లక్షలు. ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో వాహన కంపెనీ ఇదే కానున్నది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్-నిస్సాన్‌ల తర్వాతి స్థానం ఇక నుంచి స్టెల్లాంటియస్‌దే. ఈ కంపెనీకి సీఈఓగా పీఎస్‌ఏ పియాజియో సీఈఓ కార్లోస్ తవరెస్, చైర్మన్‌గా ఫియట్ క్రిస్లర్ చైర్మన్ జాన్ ఈల్‌కాన్‌లు వ్యవహరిస్తారు.

భారత జీడీపీ ఎంత శాతం క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది?
భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21)లో మైనస్ 9.6 శాతం మేర క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ‘‘అంతర్జాతీయ ఆర్థిక అవకాశాలు’’ పేరుతో జనవరి 5న ఒక నివేదికను విడుదల చేసింది. 2021లో భారత జీడీపీ 5.4 శాతానికి కోలుకుంటుందని ఆ నివేదికలో అంచనా వేసింది.

  • ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి లో ఉంది.
  • ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడిగా డేవిడ్ ఆర్. మాల్‌పాస్ ఉన్నారు.

జనవరి 2021 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్, చైనా మధ్య 9వ విడత మిలటరీ చర్చలు ఎక్కడ జరిగాయి?
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద జనవరి 24న ఈ చర్చలు జరిగాయి. చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్, చైనా ప్రతినిధులకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ సారథ్యం వహించారు. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. 2020, నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి.
తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని భారత ఆర్మీ తెలిపింది. చైనా ప్రతిపాదన మేరకే 2020, సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో ఈ ఒప్పందం కుదిరింది.

సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ
ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన నాకు లా ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘర్షణల్లో 20 మంది చైనా సైనికులు, నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని జనవరి 25న భారతీయ సైన్యం వెల్లడించింది. ఇరు దేశాల స్థానిక కమాండర్లు ఈ సమస్యను పరిష్కరించారని తెలిపింది. జనవరి 20న ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. భారత సైనికులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై తమ వద్ద సమాచారం లేదని చైనా పేర్కొంది.

భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్న బ్రిటన్ సంస్థ?
ఔషధ తయారీలో ఉన్న బ్రిటన్ సంస్థ జీఎస్‌కే(గ్లాక్సోస్మిత్‌క్లైన్)... మలేరియా వ్యాక్సిన్ల తయారీని భారత్‌లో చేపట్టనుంది. ఇందుకోసం వ్యాక్సిన్ల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా మలేరియా టీకా(ఆర్‌టీఎస్, ఎస్/ఏఎస్01) తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోకు జీఎస్‌కే బదిలీ చేస్తుంది. అలాగే టీకా తయారీలో ఉపయోగించే సహాయ ఔషధాన్ని సరఫరా చేస్తుంది.
పైలట్ ప్రాజెక్టు కింద...
మలేరియా వ్యాక్సిన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా.. ప్రస్తుతం జీఎస్‌కే మలేరియా టీకాను ‘పాత్’ అనే యూఎస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థతో కలిసి ఘనా, కెన్యా, మలావి ప్రాంతాల్లోని ప్రజలకు పైలట్ ప్రాజెక్టు కింద ఒక కోటి డోసులను అందిస్తోంది.
మలేరియా వ్యాధి కారకము...
మలేరియా దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్లాస్మోడియం(Plasmodium) అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము.

ఏ రాష్ట్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది?
డ్రాగన్ దేశం చైనా.. భారత భూభాగంలో ఒక కొత్త గ్రామాన్నే నిర్మించింది. 2020, నవంబర్ 1వ తేదీ నాటి శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలో త్సరి చూ నది(Tsari Chu) ఒడ్డున ఈ గ్రామాన్ని చైనా నిర్మించింది. ఇక్కడ 101 ఇళ్లు ఉన్నాయి. ఇరు దేశాల సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఇళ్లు నిర్మించారు.
అధికారిక మ్యాప్‌ల ప్రకారం....
భారత ప్రభుత్వ అధికారిక మ్యాప్‌ల ప్రకారం చైనా నిర్మించిన గ్రామం భారతదేశ భూభాగమే. అయితే, ఈ ప్రాంతం 1959 నుంచి చైనా అధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ చైనా మిలటరీ పోస్టు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక కొత్త ఊరే పుట్టుకొచ్చింది. ఈ ప్రాంతంపై భారత్-చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. 2019 ఆగస్టు 26 నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే త్సరి చూ నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు లేవు. అంటే 2020 ఏడాదే ఈ కొత్త గ్రామాన్ని చైనా నిర్మించినట్లు స్పష్టమవుతోంది.

భారత్ నుంచి భూటాన్, మాల్దీవులకు కరోనా టీకాలు
‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం’ అనే తన విధానంలో భాగంగా భూటాన్, మాల్దీవులకు భారత్ కరోనా టీకాలు సరఫరా చేసింది. గ్రాంట్స్ అసిస్టెన్స్ కింద జనవరి 20న భూటాన్‌కు 1,50,000 కోవిషిల్డ్ వ్యాక్సిన్ డోసులు, మాల్దీవులకు లక్ష డోసులను అందజేసింది. అలాగే జనవరి 21న బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులు, నేపాల్‌కు 10 లక్షల డోసులను సరఫరా చేసింది. ఈ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ‘‘వ్యాక్సిన్ మైత్రి’’గా భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సంభోదించారు. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, మారిషస్ దేశాలకు టీకాలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

అణ్వాయుధ వివరాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాకిస్తాన్
ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్, పాకిస్తాన్ దేశాలు వార్షిక అణ్వాయుధ నిల్వలు, అణ్వాయుధ నిర్మాణాల వివరాలను పరస్పరం వెల్లడించుకున్నాయి. ఇరు దేశాలు 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి యేటా జనవరి 1వ తేదీన అణ్వాయుధ సంపత్తికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేస్తారు. కాగా పాకిస్తాన్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 49 మంది సాధారణ పౌరులతో సహా 270 మంది జాలర్ల వివరాలను పాక్ వెల్లడించింది. అందుకు బదులుగా భారత్ సైతం భారతీయ జైళ్ళలో ఉన్న 340 మంది పాకిస్తాన్ ఖైదీల వివరాలను వెల్లడించింది.
భారత్-యూఏఈ...
భారత్‌లో 2021 నూతన సంవత్సర వేడుకలను గుర్తు చేసేలా యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) కూడా సంబరాలు చేసుకుంది. యూఏఈలో దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన భవనం ‘‘బుర్జ్ ఖలీఫా’’ భవనంపై భారతీయ జెండాను ప్రదర్శిస్తూ ఈ వేడుకలను జరిపింది.
యూఏఈ రాజధానిఅబూదాబి; కరెన్సీదిర్హం
యూఏఈ ప్రస్తుత అధ్యక్షుడు: ఖలీఫా బిన్ జాఝెద్ అల్ నహ్యాన్
యూఏఈ ప్రస్తుత ఉపాధ్యక్షుడు, ప్రధాని: మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్

బ్రిటన్ ప్రధానమంత్రి భారత పర్యటన వాయిదా
2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు హాజరు కావాల్సిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జనవరి 5న ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బ్రిటన్‌లో కొత్త కరోనా కేసులు ఉధృతరూపం దాల్చడంతో తాను భారత్‌కి రాలేకపోతున్నానని మోదీ తెలిపారు. అయితే యూకే ఆధ్వర్యంలో 2021 ఏడాది చివర్లో జరిగే జీ-7 సదస్సు కంటే ముందుగానే భారత్‌కి వస్తానని చెప్పారు.

జనవరి 2021 సైన్స్ & టెక్నాలజీ

స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
అత్యాధునిక ఆయుధం... స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్‌ఏఏడబ్ల్యు)ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) జనవరి 21న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో హెచ్‌ఏఎల్‌కు చెందిన యుద్ధ విమానం హాక్-ఐ నుంచి ఈ ఆయుధాన్ని పరీక్షించారు. విశ్రాంత వింగ్ కమాండర్లు పి.అవస్థి, ఎం.పటేల్ హాక్-ఐ ఎయిర్‌క్రాఫ్ట్ పెలైట్లుగా వ్యవహరించారు. డీఆర్‌డీఓకి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) ఈ ఆయుధాన్ని తయారు చేసింది.
ఎస్‌ఏఏడబ్ల్యు-ముఖ్యాంశాలు

  • 125 కిలోల బరువున్న ఎస్‌ఏఏడబ్ల్యుతో శత్రు సైన్యాల బలగాలను వంద కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యంగా చేసుకోవచ్చు.
  • రాడార్లు, బంకర్లు, ట్యాక్సీ ట్రాక్‌లు, రన్‌వేలను ఇది సులువుగా నాశనం చేస్తుంది.
  • ఈ పరీక్ష విజయవంతం కావడంతో హాక్‌ఐ యుద్ధ విమానాలను మరింత ఆధునీకరించవచ్చు.
  • ఇండియన్ హాక్ ఎంకే132 విమానం నుంచి పరీక్షించిన తొలి స్మార్ట్ ఆయుధం ఇదే.
  • ఎస్‌ఏఏడబ్ల్యును బంకర్లు, టాంకర్లను ధ్వంసం చేయడానికి ఫైర్ చేస్తారు. దీని రేంజ్ 100 కిలోమీటర్లు.
  • గతంలో ఈ ఆయుధాన్ని జాగ్వార్ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

2017 నాటికి ఏటా కరిగే మంచు ఎన్ని లక్షల టన్నులకు చేరింది?
భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోందని, 1994- 2017 మధ్య 28లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే భూమిపై ఉన్న మంచు కరిగే వేగం పెరిగిందని సర్వేలో వెల్లడైంది. సర్వేలో 2.15లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు. ఈ అధ్యయన వివరాలను ది క్రయోస్ఫియర్ జర్నల్ ప్రచురించింది. శాటిలైట్ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు.
ముఖ్యాంశాలు...

  • 1990ల్లో ఏటా 0.8 లక్ష కోట్ల టన్నుల మేర మంచు కరిగేది, 2017 నాటికి ఏటా కరిగే మంచు 1.3 లక్షల టన్నులకు చేరింది.
  • 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగే వేగం 65 శాతం పెరిగింది.
  • అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లో ఐస్ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే రేటు పెరిగింది.

ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
భూతలం నుంచి గాల్లోని ప్రయోగించగల ఆకాశ్-ఎన్‌జీ (న్యూ జనరేషన్) క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ క్షిపణిని జనవరి 25న ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందిపూర్ ఐటీఆర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని భారత వాయుసేన అధికారుల నేతృత్వంలో డీఆర్‌డీఓ, బీడీఎల్, బీఈఎల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి గాలిలో నుంచి జరిగే రాడార్ క్రాస్ సెక్షన్ దాడుల నుంచి భూతలాలను రక్షిస్తుంది. అత్యంత కచ్చితత్వంతో ఇది లక్ష్యాలను అడ్డుకోగలదు. ఇతర వ్యవస్థలతో పోలిస్తే ఈ న్యూజనరేషన్ క్షిపణిలో పనితీరు ఉత్తమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

తొలి స్వదేశీ పిస్తోల్ రెడీ చేసిన ప్రభుత్వం సంస్థ ఏది?
ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో ముందడుగు వేసింది. భారత సైన్యంతో కలసి డీఆర్‌డీవోకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పుణే) విభాగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తొలి 9 ఎంఎం మెషీన్ పిస్తోల్‌ను అభివృద్ధి చేసింది. దీనికి ‘అస్మి’అనే పేరు పెట్టారు. ఈ సరికొత్త పిస్తోల్‌ను కేవలం నాలుగు నెలల్లోనే అభివృద్ధి చేయడం విశేషం. విమానాల తయారీలో వాడే అల్యూమినియంతో ఈ పిస్తోల్ పైభాగంలోని రిసీవర్‌ను, కార్బన్ ఫైబర్‌తో దిగువ రిసీవర్‌ను తయారు చేశారు. ఆర్మీ అధికారుల వ్యక్తిగత ఆయుధాల కేటగిరీలో అస్మి కీలకపాత్ర పోషించనుంది. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలకు, వీఐపీ రక్షణ విధులు నిర్వర్తించే వారికి ఈ ఆయుధం ఎంతో ఉపయోగపడుతుందని, ఒక్కోదాని తయారీకి రూ.50 వేలకంటే ఎక్కువ ఖర్చు కాదని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.

డీఆర్‌డీవో రూపొందించిన బైక్ అంబులెన్స్ పేరు?
నక్సలిజం, వేర్పాటువాదం ప్రభావ ప్రాంతాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అనుబంధ సంస్థ... ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సెన్సైస్(ఐఎన్‌ఎమ్‌ఏఎస్) ప్రత్యేక బైక్ అంబులెగ్రాంట్స్ అసిస్టెన్స్ ను రూపొందించింది. ఈ అంబులెన్స్‌కు ‘‘రక్షిత’’ పేరు పెట్టారు. 21 రక్షిత అంబులెగ్రాంట్స్ అసిస్టెన్స్ లను జనవరి 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్(లైఫ్ సెన్సైస్), శాస్త్రవేత్త డాక్టర్ ఏకే సింగ్.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)కు అందజేశారు.
ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్‌ను రూపొందించిన ప్రభుత్వ సంస్థ?
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)కు చెందిన ‘‘కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీవీఆర్‌డీఈ)’’ అనే సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘‘ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్’’ను జనవరి 10న చెన్నైలో నావికా దళానికి అప్పగించారు. అలాగే పి-75 జలాంతర్గాముల కోసం రూపొందించిన 18 రకాల హైడ్రాలిక్ లూబ్రికేషన్, ఇంధన ఫిల్టర్లను కూడా సీవీఆర్‌డీఈ భారత నావికాదళానికి అందజేసింది. ఈ రెండింటిని సీవీఆర్‌డీఈ సొంతంగా అభివృద్ధి చేసింది.
ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్...

  • మానవ రహిత వైమానిక వాహనాల్లో(యూఏవీ) ఉపయోగిస్తారు.
  • ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా వీటిని తయారు చేశారు.
  • ‘‘తపస్’’ యూఏవీ కోసం మూడు టన్నుల ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్, ‘‘స్విఫ్ట్’’ యూఏవీ కోసం ఒక టన్ను సిస్టమ్‌ను సీవీఆర్‌డీఈ రూపొందించింది.
  • ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్ అనేవి విమానాలకు ఏర్పాటు చేసే చక్రాల వ్యవస్థలు.
  • యుద్ధ ట్యాంకులు, సాయుధ శకటాలను సీవీఆర్‌డీఈ రూపొందిస్తుంటుంది.
  • సీవీఆర్‌డీఈ కార్యాలయం చెన్నైలో ఉంది.

ఏ దేశంలోని గొరిల్లాలకి కరోనా వైరస్ సోకింది?
ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి వైరస్ సోకింది. అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కరోనా సోకినట్టుగా పార్క్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ లిసా పీటర్సన్ జనవరి 11న వెల్లడించారు. పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పేర్కొన్నారు.
తాజాగా కరోనా బారిన పడిన గొరిల్లాలలో మూడు అంతరించే జాతిలో ఉన్నాయి. గత 20 ఏళ్లలో ఈ గొరిల్లాల సంఖ్య 60శాతానిపైగా పడిపోయింది. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు దగ్గర్నుంచి అటవీ జంతువులు పులులు, సింహాలకు కరోనా సోకింది. కానీ గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే ప్రథమం.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా పేరు?
కోవిడ్-19పై ఏర్పాటైన సెంట్రల్ డ్రగ్‌‌స స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (సీఎస్‌వో)... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ‘‘కోవిషీల్డ్’’ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి జనవరి 1న సిఫారసు చేసింది. 18 ఏళ్లు దాటిన వారికి 4- 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. డ్రగ్‌‌స కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్ టీకా వినియోగానికి ఇప్పటికే బ్రిటన్, అర్జెంటీనా దేశాలు అనుమతులు ఇచ్చాయి.

టీకాతో సమూలంగా నిర్మూలింపబడిన ఏకైక వ్యాధి ఏది?
తొలినాళ్లలో టీకాలు కనిపెట్టేందుకు దశాబ్దాల కాలం పట్టేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగే కొద్దీ టీకాల ఉత్పత్తి సమయం తగ్గుతూ వచ్చింది. తాజాగా మానవాళిపై ప్రకృతి పంపిన కరోనా మహమ్మారికి రికార్డు స్థాయిలో ఏడాదిలోపే టీకా కనుగొన్నారు. చరిత్రలో ప్రత్యేకత సంతరించుకున్న వ్యాక్సిన్లు, వాటిని కనిపెట్టేందుకు పట్టిన సమయం ఓసారి చూద్దాం.
స్మాల్‌పాక్స్ (మశూచి)...
క్రీ.పూ 3వ శతాబ్దం నుంచి మానవచరిత్రలో ఈ వ్యాధి ప్రస్తావన కనిపిస్తుంది. 18వ శతాబ్దినాటికి కాలనైజేషన్ కారణంగా ప్రపంచమంతా విస్తరించింది. దీనివల్ల కలిగే మరణాలు భారీగా ఉండేవి. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి ఈవ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 1967 తర్వాతే ఈ వ్యాక్సిన్‌ను విరివిగా ఇచ్చి 1980 నాటికి స్మాల్‌పాక్స్ ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పటివరకు టీకాతో సమూలంగా నిర్మూలించిన వ్యాధి ఇదొక్కటే.
టైఫాయిడ్1880లో దీనికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. 1886లో టీకా కనుగొనే యత్నాలు ఆరంభమయ్యాయి. 1909లో రస్సెల్ అనే శాస్త్రవేత్త విజయవంతమైన వ్యాక్సిన్ కనుగొన్నారు. 1914 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు.
ఇన్‌ఫ్లూయెంజా: ఈ వ్యాధికి టీకా కనుగొనే ప్రయత్నం 1930 నుంచి జరిగింది. 1945లో విజయవంతమైన టీకా ఉత్పత్తి చేశారు. కానీ ఈ వ్యాధికారక వైరస్‌లో మార్పులు జరుగుతుండటంతో టీకాలో మార్పులు చేస్తున్నారు.
పోలియో: ప్రాణాంతకం కాకపోయినా, మనిషిని జీవచ్ఛవంలా మార్చే ఈ వ్యాధి నివారణకు టీకాను 1935లో కోతులపై ప్రయోగించారు. కానీ తొలిసారి విజయవంతమైన టీకాను 1953లో జోనస్ సాక్, 1956లో ఆల్బర్ట్ సబిన్ తయారు చేశారు. 1990 అనంతరం పలు దేశాల్లో పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగింది.
ఆంత్రాక్స్: ఈవ్యాధి గురించి క్రీ.పూ 700 నుంచి మనిషికి తెలుసు. 1700నుంచి దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. 1881లో తొలిసారి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రయత్నం జరిగింది. పశువులకు వాడే విజయవంతమైన ఆంత్రాక్స్ టీకాను మాత్రం 1937లో మాక్స్ స్టెర్నె కనుగొన్నారు. 1970ల్లో ఆంత్రాక్స్ టీకా ఉత్పత్తి జరిగింది.
ఎంఎంఆర్: మీజిల్స్, మంప్స్, రూబెల్లా అనేవి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు. 1960 నాటికి వీటికి విడివిడిగా వ్యాక్సిన్లు వచ్చాయి. 1971లో మౌరిస్ హిల్లెమన్ ఈ వ్యాధులకు ఒకే వ్యాక్సిన్‌ను కనుగొన్నారు.
చికెన్‌పాక్స్(ఆటలమ్మ): 19వ శతాబ్దం వరకు దీన్ని స్మాల్‌పాక్స్‌గానే భ్రమించేవారు. అనంతరం దీనిపై విడిగా పరిశోధనలు జరిగాయి. 1970లో జపాన్ సైంటిస్టులు విజయవంతమైన చికెన్‌పాక్స్ టీకా కనుగొన్నారు.
ప్లేగు: మానవాళిని గజగజలాడించిన మొండి వ్యాధి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమైంది. కానీ దీనికి సరైన వ్యాక్సిన్ ఇప్పటివరకు లేదు. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల ఆధునిక యాంటీబయాటిక్స్‌తో దీన్ని నివారించవచ్చు. గతంలో దీనికి వ్యాక్సిన్ తయారు చేయాలన్న యత్నాలు సఫలం కాలేదు. 2018లో దాదాపు 17 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయిల్స్‌లో ఉన్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది.
యెల్లో ఫీవర్500 ఏళ్లుగా మనిషిని ఇబ్బందులు పెట్టిన ఈవ్యాధికి టీకా కనుగొనే యత్నాలు 19వ శతాబ్దంలో ఆరంభమయ్యాయి. 1918లలో రాక్‌ఫెల్లర్ సంస్థ సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొన్నారు. మాక్స్ ధీలర్ 1937లో తొలిసారి యెల్లోఫీవర్‌కు విజయవంతమైన టీకా తయారు చేశారు. 1951లో ఆయనకు నోబెల్ వచ్చింది. టీకా ఉత్పత్తికి నోబెల్ అందుకున్న తొలి శాస్త్రవేత్త ఆయనే.
హెపటైటిస్ బీఇటీవల కాలంలో కనుగొన్న వైరస్ ఇది. 1965లో దీన్ని గుర్తించిన డా. బరూచ్ బ్లుంబర్గ్ నాలుగేళ్ల అనంతరం దీనికి వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగారు. 1986లో హెపటైటిస్ బీకి సింథటిక్ టీకాను కనుగొన్నారు. ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీని టీకాతో లివర్ క్యాన్సర్‌ను నివారించడం జరుగుతుంది కనుక ఈ టీకాను తొలి యాంటీ క్యాన్సర్ టీకాగా పేర్కొంటారు.

ఏ వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది?
దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో మరణించిన వందలాది పక్షుల్లో బర్డ్‌ఫ్లూ ఉందని నిర్ధారించారు. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్‌లో మరణించిన పక్షుల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు గుర్తించారు. వీటిలో ప్రత్యేకించి హిమాచల్‌ప్రదేశ్‌లోని పాంగ్ డామ్ సరస్సు వద్ద ఏకంగా 1,800 వలస పక్షులు మరణించినట్లు కనుగొన్నారు.
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా (Avian influenza) అని ఆంగ్లములో వ్యవహరిస్తారు. ఈ వ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. ‘‘హెచ్5ఎన్1(H5N1)’’ అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది.
సీసీఎంబీ ప్రధాన కార్యలయం ఏ నగరంలో ఉంది?
కరోనా వైరస్ గాలిలో ప్రయాణించగలదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ప్రకటించింది. చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీతో కలసి నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని జనవరి 5న తెలిపింది. హైదరాబాద్, చండీగఢ్‌లో మూడు చొప్పున ఆసుపత్రుల్లో ప్రయోగాలు నిర్వహించినట్లు పేర్కొంది. వ్యాధిగ్రస్థులు ఎక్కువ కాలం గడిపిన గదిలో రెండు మీటర్ల కంటే దూరంలోనూ గాల్లో వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించింది.

  • సీసీఎంబీ ప్రధాన కార్యలయం హైదరాబాద్లో ఉంది.
  • ప్రస్తుతం సీసీఎంబీ డెరైక్టర్‌గా డాక్టర్ రాకేశ్ కె. మిశ్రా ఉన్నారు

జనవరి 2021 అవార్డ్స్

ఆంధ్రప్రదేశ్‌కు రెండు పోలీస్ శౌర్య పతకాలు
దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పోలీస్ శౌర్య పతకాలు, ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకంతో పాటు 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఏఏసీ ర్యాంకు అధికారి గొంగటి గిరీష్ కుమార్, జేసీ ర్యాంకు అధికారి కూడుపూడి హరికృష్ణకు పోలీసు శౌర్య పతకాలు వచ్చాయి. విజయవాడ ఏసీబీ అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాథుర్తి శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం దక్కింది.
తెలంగాణకు...
తెలంగాణ రాష్ట్రానికి రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్, నిజామాబాద్ ఐజీ శివశంకర్‌రెడ్డి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను దక్కించుకున్నారు.

బాల్ శక్తి పురస్కారాలు-2021
అసాధారణమైన సామర్థ్యాల ఆవిష్కరణలు, విద్యావిషయక విజయాలు, క్రీడలు, కళలు-సంస్కృతి, సామాజిక సేవ, ధైర్యం వంటి రంగాలలో విశేషమైన విజయాలు సాధించిన చిన్నారులకు ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కింద బాల్ శక్తి పురస్కారాల’ను ప్రదానం చేస్తోంది. ఈ అవార్డుకు 2021 ఏడాది వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 32 మంది చిన్నారులు ఎంపికయ్యారు. అవార్డు విజేతలకు ఒక పతకంతో పాటు, రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు.
ఇద్దరు తెలుగు చిన్నారులు...
2021 ఏడాది బాల్ శక్తి పురస్కాలకు ఇద్దరు తెలుగు చిన్నారులు ఎంపికయ్యారు. వీరిద్దరిలో విశాఖ నగరంలోని లాసన్స్ బే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలిక అమేయ లగుడు కాగా, మరోకరు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు చదలవాడ హేమేష్.
అమేయశాస్త్రీయ నృత్యంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను అమేయకు బాల్ శక్తి పురస్కార్ దక్కింది. నాలుగేళ్ల వయసు నుంచి అమేయ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటోంది. ఇప్పటికే 8 అంతర్జాతీయ, 9 జాతీయ అవార్డులు, 18 రాష్ట్రస్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, సిలికానాంధ్ర సంస్థ 6,117 మందితో ఏర్పాటు చేసిన అతిపెద్ద కూచిపూడి నృత్య కార్యక్రమంలో భాగమై గిన్నిస్ రికార్డు సైతం సాధించింది.
హేమేష్అల్జీమర్స్‌తో బాధపడుతున్న తన అమ్మమ్మ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు హేమేష్ తయారు చేసిన స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ పతకాన్ని తెచ్చిపెట్టింది. రోగుల పల్స్, రక్తపోటును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైనప్పుడు డాక్టర్‌తోపాటు సంరక్షకులకు స్మార్డ్ రిస్ట్ బ్యాండ్ అలర్ట్ పంపిస్తుంది. రోగి ఆరోగ్య స్థితిని ప్రదర్శించడమే కాకుండా, రోజువారీ నివేదికలను ఆటోమేటిక్‌గా పంపిస్తుంది.
బాల్ శక్తి పురస్కారాలు-2021

సంఖ్య

పేరు

రాష్ట్రపతి

విభాగం

1

అమేయ లగుడు

ఆంధ్రప్రదేశ్

కళలు, సంస్కృతి

2

వ్యోమ్ అహుజా

ఉత్తరప్రదేశ్

కళలు, సంస్కృతి

3

హృదయ ఆర్ కృష్ణన్

కేరళ

కళలు, సంస్కృతి

4

అనురాగ్ రామోలా

ఉత్తరాఖండ్

కళలు, సంస్కృతి

5

తనూజ్ సమద్దర్

అస్సాం

కళలు, సంస్కృతి

6

వెనిష్ కీషమ్

మణిపూర్

కళలు, సంస్కృతి

7

సౌహర్ద్య దే

పశ్చిమ బెంగాల్

కళలు, సంస్కృతి

8

జ్యోతి కుమారి

బీహార్

ధైర్యం

9

కున్వర్ దివ్యాన్ష్ సింగ్

ఉత్తరప్రదేశ్

ధైర్యం

10

కామేశ్వర్ జగన్నాథ్ వాగ్మారే

మహారాష్ట్ర

ధైర్యం

11

రాకేశ్‌కృష్ణ కె

కర్ణాటక

ఆవిష్కరణ

12

శ్రీ‌నాబ్ మౌజేష్ అగర్వాల్

మహారాష్ట్ర

ఆవిష్కరణ

13

వీర్ కశ్యప్

కర్ణాటక

ఆవిష్కరణ

14

నామ్య జోషి

పంజాబ్

ఆవిష్కరణ

15

ఆర్కిత్ రాహుల్ పాటిల్

మహారాష్ట్ర

ఆవిష్కరణ

16

ఆయుష్ రంజన్

సిక్కిం

ఆవిష్కరణ

17

హేమేష్ చదలవాడ

తెలంగాణ

ఆవిష్కరణ

18

చిరాగ్ భన్సాలీ

ఉత్తరప్రదేశ్

ఆవిష్కరణ

19

హర్మన్‌జోత్ సింగ్

జమ్మూ,కశ్మీర్

ఆవిష్కరణ

20

మొహద్ షాదాబ్

ఉత్తరప్రదేశ్

విద్య

21

ఆనంద్

రాజస్థాన్

విద్య

22

అన్వేష్ శుభం ప్రధాన్

ఒడిశా

విద్య

23

అనుజ్ జైన్

మధ్యప్రదేశ్

విద్య

24

సోనిత్ సిసోలేకర్

మహారాష్ట్ర

విద్య

25

ప్రసిద్ధి సింగ్

తమిళనాడు

సామాజిక సేవ

26

సవితా కుమారి

జార్ఖండ్

క్రీడలు

27

అర్షియా దాస్

త్రిపుర

క్రీడలు

28

పాలక్ శర్మ

మధ్యప్రదేశ్

క్రీడలు

29

మహ్మద్ రఫీ

ఉత్తరప్రదేశ్

క్రీడలు

30

కామ్య కార్తికేయన్

మహారాష్ట్ర

క్రీడలు

31

ఖుషి చిరాగ్ పటేల్

గుజరాత్

క్రీడలు

32

మంత్ర జితేంద్ర హర్ఖని

గుజరాత్

క్రీడలు

ప్రధాన్ మంత్రి రాష్టీయ్ర బాల్ పురస్కార్
ఏటా రిపబ్లిక్ డే (జనవరి 26) ముందు వారంలో ఈ అవార్డులను భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఈ అవార్డులను రెండు కేటగిరీల కింద ఇస్తారు. అవి..
1.బాల్ శక్తి పురస్కార్
2.బాల్ కల్యాణ్ పురస్కార్
బాల్ శక్తి పురస్కార్:
వివిధ రంగాలలో అసాధారణమైన విజయాలను సాధించిన 18 ఏళ్లలోపు పిల్లలకు ఏటా భారత ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. ఈ అవార్డును 1996లో జాతీయ చైల్డ్ అవార్డు ఫర్ ఎక్స్‌ప్షనల్ అచీవ్‌మెంట్ పేరుతో స్థాపించారు. 2018 నుంచి బాల శక్తి పురస్కార్ అని పేరు మార్చారు.
బాల్ కల్యాణ్ పురస్కార్:
  • పిల్లల అభివృద్ధి, రక్షణ, శిశు సంక్షేమ రంగాలలో పిల్లల మంచి కోసం చేసిన విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డు ఇస్తారు.
  • భారతీయ పౌరుడు, భారతదేశంలో నివసిస్తున్న 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి (సంబంధిత సంవత్సరం ఆగస్టు 31 నాటికి) ఉండాలి. వారు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పిల్లల ప్రయోజనాల కోసం పని చేసి ఉండాలి.


మహావీరచక్ర పురస్కారం-2021 విజేత?
భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబును మహావీరచక్ర పురస్కారం వరించింది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.
2019 కల్నల్‌గా...
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రం సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్‌బాబు 1983, ఫిబ్రవరి 13న జన్మించారు. నేషనల్ ఢిపెన్స్ అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. 2004 డిసెంబర్‌లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్‌లో కల్నల్‌గా పదోన్నతి పొందారు. బిహార్ 16వ రెజిమెంట్ కామాండింగ్ అధికారిగా ఉన్న సమయంలో.. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో 2020, జూన్ 15న వీరమరణం పొందారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా కల్నల్ సంతోష్‌బాబు విధులు నిర్వహించాడు.
సైనిక పురస్కారాలు-2021 జాబితా
మహావీర్‌చక్ర: బి.సంతోష్ బాబు (కల్నల్ )
కీర్తిచక్ర : సంజీవ్‌కుమార్ (సుబేదార్), పింటూకుమార్ (సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్), శ్యాంనారాయణ్ సింగ్ యాదవ్ (సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్), వినోదకుమార్ (సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్), రాహుల్ మాథుర్ (సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్)
వీర్‌చక్ర: నుదూరామ్ సోరెన్ (నాయబ్ సుబేదార్), కె.పళని (హవల్దార్), తేజీందర్‌సింగ్ (హవల్దార్), దీపక్‌సింగ్ (నాయక్), గురుతేజ్ సింగ్ (సిపాయి)
శౌర్యచక్ర: అనూజ్ సూద్ (మేజర్), ప్రణబ్‌జ్యోతి దాస్ (రైఫిల్‌మ్యాన్), సోనమ్ శెరింగ్ తమాంగ్ (పారాట్రూపర్), అర్షద్ ఖాన్ (ఇన్‌స్పెక్టర్ - జమ్మూకశ్మీర్), ముస్తాఫా బారా (ఎస్‌జీసీటీ -జమ్మూకశ్మీర్), నజీర్ అహ్మద్ కోలీ (ఎస్‌జీసీటీ - జమ్మూకశ్మీర్), బిలాల్ అహ్మద్ మాగ్రే (స్పెషల్ పోలీసు ఆఫీసర్- జమ్మూకశ్మీర్)

పద్మ పురస్కారాలు-2021
కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన 119 మందికి భారత ప్రభుత్వం జనవరి 25న 2021 సంవత్సరానికి గానూ ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
29 మంది మహిళలు...
2021 ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. అలాగే విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మంది, ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి...
2021 ఏడాది పద్మ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారు.
ఆశావాది ప్రకాశరావు(ఏపీ): రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన ఆశావాది... పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు.
అన్నవరపు రామస్వామి(ఏపీ): విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు(వయోలిన్) అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గా అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు.
నిడుమోలు సుమతి(ఏపీ): భారతీయ సంగీత వాయిద్యరంగంలో మృదంగవాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి నిడుమోలు సుమతి(దండమూడి సుమతీ రామమోహనరావు)ని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. విజయవాడకు చెందిన సుమతి పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు.
కనకరాజు(తెలంగాణ): కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కళాకారుడు కనకరాజును పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న 60 ఏళ్ల రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు.
పద్మ పురస్కారాలు-2021
పద్మ విభూషణ్ విజేతలు (7)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

షింజో అబే

ప్రజా వ్యవహారాలు

జపాన్

2

ఎస్.పి.బాలసుబ్రమణ్యం

కళలు

తమిళనాడు

3

డా. బెల్లె మొనప్ప హెగ్డే

వైద్యం

కర్ణాటక

4

నరీందర్ సింగ్ కపానీ

సైన్స్, ఇంజనీరింగ్

యూఎస్

5

మౌలానా వాహిదుద్దీన్ ఖాన్

ఆధ్యాత్మికత

ఢిల్లీ

6

బి.బి.లాల్

ఆర్కియాలజీ

ఢిల్లీ

7

సుదర్శన్ సాహూ

కళలు

ఒడిషా

పద్మ భూషణ్ విజేతలు (10)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

1

కె.ఎస్.చిత్ర

కళలు

కేరళ

2

తరుణ్ గొగోయ్

ప్రజా వ్యవహారాలు

అసోం

3

చంద్రశేఖర్ కంబర

సాహిత్యం

కర్ణాటక

4

సుమిత్ర మహాజన్

ప్రజా వ్యవహారాలు

మధ్యప్రదేశ్

5

నృపేంద్ర మిశ్రా

సివిల్ సర్వీస్

ఉత్తర ప్రదేశ్

6

రామ్ విలాస్ పాశ్వాన్

ప్రజా వ్యవహారాలు

బిహార్‌

7

కేశుభాయ్ పటేల్

ప్రజా వ్యవహారాలు

గుజరాత్

8

కల్బే సాదిక్

ఆధ్యాత్మికత

ఉత్తర ప్రదేశ్

9

రజనీకాంత్ దేవిదాస్ షరాఫ్

వాణిజ్యం, పరిశ్రమలు

మహారాష్ట్ర

10

తార్‌లోచన్ సింగ్

ప్రజా వ్యవహారాలు

హరియాణా

పద్మ శ్రీ విజేతలు (102)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

1

గల్ఫామ్ అహ్మద్

కళలు

ఉత్తర ప్రదేశ్

2

పి. అనితా

క్రీడ‌లు

తమిళనాడు

3

రామ స్వామి అన్నవరాపు

కళలు

ఆంధ్రప్రదేశ్

4

సుబ్బూ అరుముగం

కళలు

తమిళనాడు

5

ఆశావాది ప్రకాశరావు

సాహిత్యం, విద్య

ఆంధ్రప్రదేశ్

6

భూరి బాయి

కళలు

మధ్యప్రదేశ్

7

రాధే శ్యామ్ బార్లే

కళలు

ఛత్తీస్‌గఢ్

8

ధర్మ నారాయణ బార్మా

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

9

లఖిమి బారువా

సామాజిక సేవ

అస్సాం

10

బిరెన్ కుమార్ బసక్

కళలు

పశ్చిమ బెంగాల్

11

రజనీ బెక్టర్

వాణిజ్యం, పరిశ్రమలు

పంజాబ్

12

పీటర్ బ్రూక్

కళలు

యునెటైడ్ కింగ్‌డమ్

13

సంఘుమి బ్యూల్చువాక్

సామాజిక సేవ

మిజోరాం

14

గోపిరామ్ బార్గైన్ బురభాకట్

కళలు

అస్సాం

15

బిజోయ చక్రవర్తి

ప్రజా వ్యవహారాలు

అస్సాం

16

సుజిత్ చటోపాధ్యాయ

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

17

జగదీష్ చౌదరి(మరణానంతరం)

సామాజిక సేవ

ఉత్తర ప్రదేశ్

18

సుల్టిమ్ర్‌ చోంజోర్

సామాజిక సేవ

లద్దాఖ్

19

మౌమా దాస్

క్రీడ‌లు

పశ్చిమ బెంగాల్

20

శ్రీ‌కాంత్‌ డాటర్

సాహిత్యం, విద్య

అమెరికా

21

నారాయణ్ దేబ్నాథ్

కళలు

పశ్చిమ బెంగాల్

22

చుట్ని దేవి

సామాజిక సేవ

జార్ఖండ్

23

దులారి దేవి

కళలు

బీహార్

24

రాధే దేవి

కళలు

మణిపూర్

25

శాంతి దేవి

సామాజిక సేవ

ఒడిశా

26

వయన్ డిబియా

కళలు

ఇండోనేషియా

27

దాదుదన్ గాధవి

సాహిత్యం, విద్య

గుజరాత్

28

పరశురామ్ ఆత్మారామ్ గంగవనే

కళలు

మహారాష్ట్ర

29

జై భగవాన్ గోయల్

సాహిత్యం, విద్య

హరియాణ

30

జగదీష్ చంద్ర హాల్డర్

సాహిత్యం, విద్య

పశ్చిమ బెంగాల్

31

మంగల్ సింగ్ హజోవరీ

సాహిత్యం, విద్య

అస్సాం

32

అన్షు జంసేన్పా

క్రీడ‌లు

అరుణాచల్ ప్రదేశ్

33

పూర్ణమాసి జానీ

కళలు

ఒడిశా

34

మాతా బి. మంజమ్మ

జోగతి కళలు

కర్ణాటక

35

దామోదరన్ కై తప్రమ్

కళలు

కేరళ

36

నామ్‌డియో సి కాంబ్లే

సాహిత్యం, విద్య

మహారాష్ట్ర

37

మహేష్‌భాయ్ -నరేష్‌భాయ్ కనోడియా (ద్వయం)(మరణానంతరం)

కళలు

గుజరాత్

38

రజత్ కుమార్ కర్

సాహిత్యం, విద్య

ఒడిశా

39

రంగసామి లక్ష్మీనారాయణ కశ్యప్ సాహిత్యం,

విద్య

కర్ణాటక

40

ప్రకాష్ కౌర్

సామాజిక సేవ

పంజాబ్

41

నికోలస్ కజనాస్

సాహిత్యం, విద్య

గ్రీస్‌

42

కె కేశవసామి

కళలు

పుదుచ్చేరి

43

గులాం రసూల్ ఖాన్

కళలు

జమ్మూ, కశ్మీర్

44

లఖా ఖాన్

కళలు

రాజస్థాన్

45

సంజిదా ఖాతున్

కళలు

బంగ్లాదేశ్

46

వినాయక్ విష్ణు ఖేదేకర్

కళలు

గోవా

47

నిరు కుమార్

సామాజిక సేవ

ఢిల్లీ

48

లజవంతి

కళలు

పంజాబ్

49

రత్తన్ లాల్

సైన్స్ అండ్ ఇంజనీరింగ్

అమెరికా

50

అలీ మణిక్‌ఫాన్

ఇతరులు-గ్రాస్‌రూట్స్‌ ఇన్నోవేషన్

లక్షద్వీప్

51

రామచంద్ర మంజి

కళలు

బిహార్

52

దులాల్ మంకి

కళలు

అస్సాం

53

నానాడ్రో బి మరక్

ఇతరులు- వ్యవసాయం

మేఘాలయ

54

రెబెన్ మషంగ్వా

కళలు

మణిపూర్

55

చంద్రకాంత్ మెహతా

సాహిత్యం, విద్య

గుజరాత్

56

డాక్టర్ రట్టన్ లాల్ మిట్టల్

వైద్యం

పంజాబ్

57

మాధవన్ నంబియార్

క్రీడ‌లు

కేరళ

58

శ్యామ్ సుందర్ పాలివాల్

సామాజిక సేవ

రాజస్థాన్

59

డాక్టర్ చంద్రకాంత్ సంభాజీ పాండవ్

వైద్యం

ఢిల్లీ

60

డాక్టర్ జె ఎన్ పాండే(మరణానంతరం)

వైద్యం

ఢిల్లీ

61

సోలమన్ పప్పయ్య సాహిత్యం,

విద్య- జర్నలిజం

తమిళనాడు

62

పప్పమ్మల్

ఇతరులు- వ్యవసాయం

తమిళనాడు

63

డాక్టర్ కృష్ణ మోహన్

పాతి వైద్యం

ఒడిశా

64

జస్వంతిబెన్ జామ్నాదాస్ పోపాట్ వాణిజ్యం,

పరిశ్రమలు

మహారాష్ట్ర

65

గిరీష్ ప్రభుణ్

సామాజిక సేవ

మహారాష్ట్ర

66

నందా ప్రస్టీ

సాహిత్యం, విద్య

ఒడిశా

67

కె కె రామచంద్ర పులవర్

కళలు

కేరళ

68

బాలన్ పుతేరి

సాహిత్యం, విద్య

కేరళ

69

బీరుబాలా రభా

సామాజిక సేవ

అస్సాం

70

కనక రాజు

కళలు

తెలంగాణ

71

బొంబాయి జయశ్రీ రామ్‌నాథ్

కళలు

తమిళనాడు

72

సత్యారామ్ రీయాంగ్

కళలు

త్రిపుర‌

73

డాక్టర్ ధనంజయ్ దివాకర్ సాగ్డియో

వైద్యం

కేరళ

74

అశోక్ కుమార్ సాహు

వైద్యం

ఉత్తర ప్రదేశ్

75

డాక్టర్ భూపేంద్ర కుమార్ సింగ్ సంజయ్

వైద్యం

ఉత్తరాఖండ్

76

సింధుటై సప్కల్

సామాజిక సేవ

మహారాష్ట్ర

77

చమన్ లాల్ సప్రూ(మరణానంతరం)

సాహిత్యం, విద్య

జమ్మూ, కశ్మీర్

78

రోమన్ శర్మ

సాహిత్యం,విద్య- జర్నలిజం

అస్సాం

79

ఇమ్రాన్ షా

సాహిత్యం, విద్య

అస్సాం

80

ప్రేమ్‌ చంద్ శర్మ

ఇతరులు- వ్యవసాయం

ఉత్తరాఖండ్

81

అర్జున్ సింగ్ షేఖావత్

సాహిత్యం, విద్య

రాజస్థాన్

82

రామ్ యత్న శుక్లా

సాహిత్యం, విద్య

ఉత్తర ప్రదేశ్

83

జితేందర్ సింగ్ షంటీ

సామాజిక సేవ

ఢిల్లీ

84

కర్తార్ పరాస్ రామ్ సింగ్

కళలు

హిమాచల్ ప్రదేశ్

85

కర్తార్ సింగ్

కళలు

పంజాబ్

86

డాక్టర్ దిలీప్ కుమార్ సింగ్

వైద్యం

బీహార్

87

చంద్ర శేఖర్ సింగ్

ఇతరులు-వ్యవసాయం

ఉత్తర ప్రదేశ్

88

సుధా హరి నారాయణ్ సింగ్

క్రీడలు

ఉత్తర ప్రదేశ్

89

వీరేందర్ సింగ్

క్రీడ‌లు

హరియాణ

90

మృదుల సిన్హా(మరణానంతరం)

సాహిత్యం, విద్య

బిహార్

91

కె సి శివశంకర్(మరణానంతరం)

కళలు

తమిళనాడు

92

గురు మా కమలి సోరెన్

సామాజిక సేవ

పశ్చిమ బెంగాల్

93

మరాచీ సుబ్బూరామన్

సామాజిక సేవ

తమిళనాడు

94

పి సుబ్రమణియన్(మరణానంతరం)

వాణిజ్యం, పరిశ్రమలు

తమిళనాడు

95

నిడుమోలు సుమతి

కళలు

ఆంధ్రప్రదేశ్

96

కపిల్ తివారీ

సాహిత్యం, విద్య

మధ్యప్రదేశ్

97

ఫాదర్ వల్లస్(మరణానంతరం)

సాహిత్యం, విద్య

స్పెయిన్

98

డాక్టర్ తిరువెంగడం వీరరాఘవన్(మరణానంతరం)

వైద్యం

తమిళనాడు

99

శ్రీ‌ధర్ వెంబు

వాణిజ్యం, పరిశ్రమలు

తమిళనాడు

100

కె వై వెంకటేష్

క్రీడ‌లు

కర్ణాటక

101

ఉషా యాదవ్

సాహిత్యం, విద్య

ఉత్తర ప్రదేశ్

102

కల్ క్వాజీ సజ్జాద్ అలీ జహీర్

ప్రజా వ్యవహారాలు

బంగ్లాదేశ్


ఇంజనీరింగ్ విద్యార్థిని సంధ్యాశ్రీ రికార్డు
కేజీ నల్ల నువ్వుల్లో ఎన్ని గింజలు ఉంటాయో లెక్కపెట్టిన ఇంజనీరింగ్ విద్యార్థిని హెచ్‌కే సంధ్యాశ్రీ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. కేజీలో 3,78,615 నువ్వులు ఉన్నట్టు ఆమె లెక్కించింది. కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా హొసూరుదొడ్డి గ్రామానికి చెందిన సంధ్యాశ్రీ... బెంగళూరు సమీపంలోని బిడదిలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది.

షి’పాహి సమావేశం...
హైదరబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జనవరి 27న ‘షి’పాహి (సిపాయి నుంచి స్ఫూర్తిగా తీసుకున్నది) మొదటి వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, ఒక షీ షటిల్ బస్‌ను అదనపు డీజీపీ స్వాతిలక్రా, సైబరాబాద్ సీపీ సజ్జనార్, ప్రముఖ సినీ అనుష్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ ‘డయల్ 100’వాహనాల ను తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా డ్రైవర్లు నడపనున్నారు.

జాతీయ ఇంధన పొదుపు అవార్డులను ప్రకటించే సంస్థ?
కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డులు-2020లలో 13 అవార్డులను భారతీయ రైల్వే కై వసం చేసుకుంది. జనవరి 11న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా) ఆర్‌కే సింగ్ ఈ అవార్డులను రైల్వే అధికారులకు అందజేశారు.
అవార్డుల్లో... పశ్చిమ రైల్వే ప్రథమ బహుమతి, తూర్పు రైల్వేకు ద్వితీయ బహుమతి, ఈశాన్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్లకు రవాణా కేటగిరీలో మెరిట్ సర్టిఫికెట్ దక్కాయి. రైల్వే వర్క్ షాప్ సబ్ కేటగిరీలో విజయవాడ డీజిల్ లోకోషెడ్ ప్రథమ బహమతి సాధించింది.

భారత మహిళా పైలట్ల రికార్డు
పూర్తిగా మహిళా పైలట్లతోనే ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి భారత మహిళా పైలట్లు సరికొత్త చరిత్ర లిఖించారు. ఎయిర్ ఇండియాకి చెందిన ‘‘బోయింగ్ 777’’ విమానాన్ని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌లోని బెంగళూరు వరకు విజయవంతంగా నడిపారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన విమానం సుదీర్ఘ ప్రయాణం దాదాపు 16 గంటల తర్వాత జనవరి 11న బెంగళూరుకు చేరుకుంది. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరే, కెప్టెన్ శివానీ మన్హాస్ అనే నలుగురు పైలట్లు ఈ విమానాన్ని నడిపించారు.
విశేషాలు...
  • అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం గుండా ఎక్కడా ఆగకుండా(నాన్‌స్టాప్) ప్రయాణించి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ఈ విమానం ల్యాండయింది.
  • ఈ మార్గంలో ప్రయాణం ద్వారా 10 టన్నుల ఇంధనాన్ని పైలట్లు ఆదా చేశారు.
  • మొత్తం 13,993 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 16 గంటల్లో అధిగమించింది.
  • ఈ ఎయిర్‌ఇండియా (ఏఐ 176) విమానానికి జోయాఅగర్వాల్ ప్రధాన పైలట్‌గా వ్యవహరించారు.

నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2020విజేత?
ఎయిర్ కండీషనర్ల తయారీ అగ్రగామి వోల్టాస్ కంపెనీ... ఇంధన మంత్రిత్వ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు- 2020’ను గెలుచుకుంది. పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఆటంకం కలుగకుండా ఇంధన వినియోగాన్ని తగ్గించే సంస్థలను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును అందజేస్తుంది. వరుసగా నాలుగోసారి అవార్డును దక్కించుకోవడం గర్వంగా ఉందని కంపెనీ సీఈవో డెరైక్టర్ ప్రదీప్ బక్షి తెలిపారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ బాధ్యతను ఈ అవార్డు మరింత పెంచిందని బక్షి వివరించారు.

జనవరి 2021 స్పోర్ట్స్

రాజస్తాన్ రాయల్స్ డెరైక్టర్‌గా శ్రీలంక క్రికెటర్
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరను ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ తమ టీమ్ డెరైక్టర్‌గా నియమించింది. 2015లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 46 ఏళ్ల సంగక్కర ప్రస్తుతం మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో (అన్ని ఫార్మాట్లు) అతను 28,000 పైచిలుకు పరుగులు చేశాడు.
పార్టీ నుంచి ఓలి బహిష్కరణ
నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని బహిష్కరించాలని మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం జనవరి 24న నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ తెలిపింది. ఓలిని కమ్యూనిస్ట్ పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి 2020, డిసెంబర్‌లో తొలగించిన విషయం తెలిసిందే.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేత?
భారత క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో మరో విజయాన్ని అందుకుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ట్రోఫీ నిర్వహణలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. జనవరి 19న ముగిసిన చివరి టెస్టులో భారత్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిని గెలుచుకోగా.. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్‌లో అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టిన ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించగా, ఆస్ట్రేలియా జట్టుకు టిమ్ పైన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఉన్న బ్రిస్బేన్‌లో జరిగింది. బ్రిస్బేన్ మైదానంలో భారత జట్టుకిదే తొలి టెస్టు విజయం.

జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలు?
హంగేరి మహిళా జిమ్నాస్ట్ అగ్నెస్ కెలెటి జీవించి ఉన్న ఒలింపిక్ చాంపియన్స్ లో అతిపెద్ద వయస్కురాలుగా గుర్తింపు పొందారు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జనవరి 9న కెలెటి తన 100వ పుట్టినరోజును జరుపుకుంది. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో కెలెటి ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించింది. అలాగే 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు సాధించింది. 1957లో ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన ఆమె 2015లో హంగేరికి తిరిగివచ్చింది.
హంగేరి రాజధానిబుడాపెస్ట్; కరెన్సీ: ఫోరింట్
హంగేరి ప్రస్తుత అధ్యక్షుడు: జెనోస్ ఓడర్
హంగేరి ప్రస్తుత ప్రధానమంత్రి: విక్టర్ ఓర్బన్

దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం
భారత దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జనవరి 10న ప్రారంభమైంది. దేశంలోని ఆరు నగరాల్లో జరిగే ఈ టోర్నీని కరోనా నేపథ్య పరిస్థితుల్లో ‘బయో బబుల్’ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఏ వేదికలోనూ ప్రేక్షకులకు ప్రవేశం లేదు. జనవరి 26 నుంచి నాకౌట్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తారు. జనవరి 31న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
టోర్నీ నిర్వహణలో భాగంగా... మొత్తం 38 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఆరేసి జట్లతో కూడుకున్న ఐదు ఎలైట్ గ్రూప్‌లు... ఎనిమిది జట్లతో కూడిన ఒక ప్లేట్ గ్రూప్ ఉంది.
జట్ల వివరాలు-వేదికలు
ఎలైట్ గ్రూప్ ఎ’జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రైల్వేస్, త్రిపుర.
వేదిక: బెంగళూరు
ఎలైట్ గ్రూప్ బి’: హైదరాబాద్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, అస్సాం.
వేదిక: కోల్‌కతా
ఎలైట్ గ్రూప్ సి’: గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, బరోడా, ఉత్తరాఖండ్.
వేదిక: వడోదర
ఎలైట్ గ్రూప్ డి’: సర్వీసెస్, సౌరాష్ట్ర, విదర్భ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా. వేదిక: ఇండోర్
ఎలైట్ గ్రూప్ ఇ’ఆంధ్ర, హరియాణా, ముంబై, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి. వేదిక: ముంబై
ప్లేట్ గ్రూప్: మేఘాలయ, చండీగఢ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్.
వేదిక: చెన్నై
రవిశాస్త్రిపై పుస్తకం...
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి క్రికెట్ కెరీర్‌పై పుస్తకం రానుంది. 2021 ఏడాది వేసవిలో ఈ పుస్తకం ద్వారా తన క్రికెట్ జీవితం గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర విషయాలను శాస్త్రి బయటపెట్టనున్నాడు. ఈ పుస్తకానికి సహ రచయితగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయాజ్ మెమన్ వ్యవహరించనుండగా... హార్పర్ కోలిన్స్ ఇండియా పబ్లిషర్‌గా ఉండనుంది.

జనవరి 2021 వ్యక్తులు

కిలిమంజారోను అధిరోహించిన ఐపీఎస్ అధికారి తరుణ్
ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి జనవరి 22న అధిరోహించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు పర్వతాలను ఆయన అధిరోహించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ హైదరాబాద్ నగర నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీస్ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణుడైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన అన్వితారెడ్డి కూడా జోషితో కలసి కిలిమంజారోను అధిరోహించారు. ఆమె ప్రస్తుతం రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాలలో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. కిలిమంజారో పర్వతం ఆఫ్రికా దేశం టాంజానియాలో ఉంది.
టాంజానియా రాజధాని: డోడోమా; కరెన్సీ: టాంజానియన్ షిల్లింగ్
టాంజానియా ప్రస్తుత అధ్యక్షుడు: జాన్ మాగుఫులి
టాంజానియా ప్రస్తుత ప్రధానమంత్రి: కాసిమ్ మజాలివా

ఏ మాజీ సీజేఐకి జెడ్ ప్లస్ భద్రతను కల్పించారు?
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌కు కేంద్రప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. దేశంలో ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) కమాండోలు భద్రత కల్పిస్తారు. జస్టిస్ గొగోయ్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రముఖుల్లో 63వ వారు. ఆయనకు 8 నుంచి 12 మంది కమాండోల భద్రత ఎల్లప్పుడూ ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ రెండో భద్రతా విభాగం.
2019లో రాజ్యసభకు...
2019 నవంబర్‌లో సీజేఐగా రిటైరైన గొగోయ్‌ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ సీజేఐగా జస్టిస్ గొగోయ్ నిలిచారు. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు.
సుప్రీంకోర్టు 46వ సీజేఐగా....
అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ గొగోయ్ 2001లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు 46వ సీజేఐగా 2018, అక్టోబర్ 3న ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 17న పదవీ విరమణ చేశారు. 2019, నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు.
భారత్ - కీలక భద్రతా వ్యవస్థలు
భారత్‌లో వీఐపీలు, వీవీఐపీల కోసం ఐదు రకాలైన భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. అవి:

  • స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)
  • జెడ్ ప్లస్ కేటగిరీ
  • జెడ్ కేటగిరీ
  • వై కేటగిరీ
  • ఎక్స్ కేటగిరీ

టాక్ షో లెజెండ్ ల్యారీ కింగ్ కన్నుమూత
అర్ధ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి సరికొత్త అధ్యాయం సృష్టించిన టాక్ షో లెజెండ్... ల్యారీ కింగ్(లారెన్స్ హార్వే జీగర్) కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాజ్ ఏంజెలిస్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో జనవరి 23న 87 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. 1933 నవంబర్ 19న అమెరికాలోని న్యూయార్క్‌లోని యూదుల కుటుంబంలో జన్మించిన ల్యారీ... 1985 నుంచి 2010 వరకు సుదీర్ఘకాలం రేడియో హోస్ట్‌గా ఉన్నారు.
సీఎన్‌ఎన్‌లో...
ల్యారీ కింగ్ 2010 నుంచి సీఎన్‌ఎన్‌లో పనిచేశారు. ఆయన నిర్వహించిన 50వేలకు పైగా కార్యక్రమాలు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యాయి. 1995లో మధ్యప్రాచ్యం శాంతి చర్చలకు ల్యారీకింగ్ అధ్యక్షత వహించారు. ఎలిజబెత్ టేలర్, మిఖాయిల్ గోర్బచెవ్, బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, లేడీ గాగా వరకు ఆయన ఎందరో ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. ఓరా మీడియా సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు.

అమెరికా రక్షణ మంత్రిగా నియమితులైన నల్లజాతీయుడు?
అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్ జనరల్ అస్టిన్ నియమితులయ్యారు. దీంతో అమెరికా రక్షణ మంత్రి పదవి చేపట్టిన తొలి నల్లజాతీయుడిగా అస్టిన్ నిలిచారు. అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్... రక్షణ మంత్రిగా అస్టిన్ నామినేషన్‌ను జనవరి 22న రికార్డు స్థాయిలో 93-2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెరైక్టర్ టామ్ మూయిర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్ విధుల్లో చేరారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనాపై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యువతి?
జాతీయ బాలికా దినోత్సవం(జనవరి 24) సందర్భంగా జనవరి 24న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి వ్యవహ రించారు. హరిద్వార్‌కు చెందిన 20 ఏళ్ల గోస్వామి జనవరి 24న ముఖ్యమంత్రి హోదాలో అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకాలను సమీక్షించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు.
జాతీయ బాలికా దినోత్సవం
జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
2008 ఏడాది నుంచి...
ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అలాగే అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్‌‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం...
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది.

మణిపూర్ హైకోర్టు సీజేగా నియామకం కానున్న న్యాయమూర్తి?
మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని కొలీజియం డిసెంబర్ 16న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ సంజయ్ నేపథ్యం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (1969-1982)గా పనిచేసిన జస్టిస్ పి.రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు జస్టిస్ సంజయ్ కుమార్ 14 ఆగస్టు 1963న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1988లో న్యాయ పట్టా అందుకున్నారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఆగస్టు 8, 2008న అదనపు న్యాయమూర్తిగా, జనవరి 20, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం జస్టిస్ సంజయ్ కుమార్‌ను తెలంగాణకు కేటాయించారు. 2019 అక్టోబర్ 14న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

ఐడీఆర్‌బీటీ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) నూతన డెరైక్టర్‌గా జనవరి 25న ప్రొఫెసర్ డి.జానకిరామ్ బాధ్యతలు చేపట్టారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ సాధించిన ఆయనకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీలో అపార అనుభవం ఉంది. ఐఐఐటీ కర్నూలు బోర్డు మెంబర్‌గా, ఐఐఐటీ తిరుచ్చి సెనేట్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. పలు యూనివర్సిటీలకు సేవలు అందిస్తున్నారు. 150కిపైగా పరిశోధన పత్రాలు రాశారు. బిగ్ డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీస్‌లో ఉన్న సవాళ్లకు పరిష్కారాలపై ఆయన పరిశోధనలు సాగిస్తున్నారు. ఐడీఆర్‌బీటీ ప్రధాన కార్యలయం హైదరాబాద్‌లో ఉంది.
తెలంగాణ నుంచి ఎయిర్ వైస్‌మార్షల్ హోదా పొందిన తొలి వ్యక్తి?
తెలంగాణకు చెందిన ఎయిర్ వైస్‌మార్షల్ విష్ణుభొట్ల నాగరాజ్ శ్రీనివాస్‌కు రాష్ట్రపతి అవార్డు లభించింది. రక్షణ రంగంలో ఆయనందించిన సేవలకుగానూ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీనివాస్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి విశిష్టసేవా పతకానికి ఎంపికచేసింది. తెలంగాణ నుంచి ఎయిర్ వైస్‌మార్షల్ హోదా పొందిన తొలి వ్యక్తి శ్రీనివాసే. వరంగల్‌లో ఆగస్టు 8, 1963న జన్మించిన శ్రీనివాస్.. 1985, జూన్ 14న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకౌంట్స్ విభాగంలో చేరారు.
రెండు పుస్తకాలు...
2008లో ‘బడ్జెటింగ్ ఫర్ ఇండియన్ డిఫెన్స్: ఇష్యూస్ ఆఫ్ కాంటెంపరరీ రిలవెన్స్’, 2010లో ‘డిఫెన్స్ ఆఫ్‌సెట్స్: ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా’అనే రెండు పుస్తకాలు శ్రీనివాస్ రాశారు.
హెచ్‌ఎస్‌సీఎల్ ఎండీగా నియమితులైన వ్యక్తి?
హిందుస్తాన్ స్టీల్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌సీఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ ఇంజినీర్(సివిల్) తాడి లక్ష్మీనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకంపై కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జనవరి 27న ఆమోదం తెలిపింది. ఐదేళ్ల వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
డబ్ల్యుహెచ్‌ఓ సమావేశం...
జనవరి 27న ఆన్‌లైన్‌లో జరిగిన డబ్ల్యుహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు 148 వసెషన్ సమావేశానికి భారత ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చూపిన చొరవ, ముందస్తు సన్నాహాలు, సమైక్య వ్యూహాలు సత్ఫలితాలనిచ్చాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2020 యేడాది శాస్త్రవిజ్ఞాన రంగానిదేనని అన్నారు. డబ్ల్యుహెచ్‌వోలో కొనసాగాలన్న అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తున్నదని తెలిపారు.

దేశంలోనే బెస్ట్ సీఎం ఎవరు తెలుసా?
దేశంలోని అత్యుత్తమ ముఖ్య మంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిలిచారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ సర్వేలో బెస్ట్ సీఎంలలో మూడో స్థానాన్ని వైఎస్ జగన్ సాధించారు. తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఘనత సాధించారు.
బెస్ట్ సీఎంలు వీరే..
1) నవీన్ పట్నాయక్ - ఒడిశా
2) అరవింద్ కేజ్రీవాల్ - ఢిల్లీ
3) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్
4) పినరయి విజయన్ - కేరళ
5) ఉద్ధవ్ ఠాక్రే - మహారాష్ట్ర
6) భూపేశ్ బఘేల్ - ఛత్తీస్‌గఢ్
7) మమతా బెనర్జీ - పశ్చిమబెంగాల్
8) శివరాజ్ సింగ్ చౌహాన్ - మధ్య ప్రదేశ్
9) ప్రమోద్ సావంత్ - గోవా
10) విజయ్ రూపానీ - గుజరాత్

యాప్ రుణాలపై ఏర్పాటైన ఆర్‌బీఐ ప్యానెల్ అధ్యక్షుడు ఎవరు?
సక్రమ మార్గంలో డిజిటల్ లెండింగ్ (డిజిటల్ మార్గాల్లో రుణాల వ్యాపారం) ప్రోత్సాహానికి అవసరమైన నియంత్రణ చర్యలను సూచించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జనవరి 13న ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్, యాప్‌ల ద్వారా అధిక వడ్డీ రేట్లకు రుణాలను మంజూరు చేస్తూ, తర్వాత వసూళ్ల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
ఆర్‌బీఐ అధ్యయన బృందానికి... ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయంత్ కుమార్‌దాస్ అధ్యక్షత వహించనున్నారు. బృందం మూడు నెలల్లోగా తన నివేదికను ఆర్‌బీఐకి సమర్పించనుంది. బృందంలో సభ్యులుగా ఆర్‌బీఐ అధికారులు అజయ్‌కుమార్ చౌదరి, పీ వాసుదేవన్, మనోరంజన్ మిశ్రాతోపాటు, మోనెక్సో ఫిన్‌టెక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ మెహతా, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాహుల్ శశి ఉంటారు.

పద్మ విభూషణ్ అవార్డీ, సంగీతకారుడు కన్నుమూత
ప్రఖ్యాత భారతీయ సంప్రదాయ సంగీతకారుడు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89) జనవరి 17న ముంబైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని బదాయులో ఉస్తాద్ వారిస్ హుస్సేన్ ఖాన్, సబ్రీ బేగం దంపతులకు 1931, మార్చి 3న ముస్తఫా ఖాన్ జన్మించారు. ప్రఖ్యాత సంగీతకారుడు మురాద్ బక్షీకి మనవడు అయిన ఆయన 1991లో పద్మశ్రీ, 2006లో పద్మభూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2003లో కళా రంగంలో అత్యుత్తమ పురస్కారమైన సంగీత నాటక అకాడెమీ అవార్డుతో ఆయనను సత్కరించారు.

సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత
స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలు, కరోనా కారణంగా హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో జనవరి 18న తుదిశ్వాస విడిచారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నర్సింగరావు... హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడు.
నర్సింగరావు గురించి...

  • 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో జన్మించారు.
  • 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు.
  • విద్యార్థి దశలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1952లో జరిగిన ముల్కీ ఉద్యమం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.
  • తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు.
  • సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ సభ్యుడిగా పనిచేశారు.

కవి, రచయిత, చరిత్రకారుడు లూథర్ ఇక లేరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి (సీఎస్) నరేంద్ర లూథర్ (89) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 18న తుది శ్వాస విడిచారు. 1932 మార్చి 23న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జన్మించిన నరేంద్ర.... కవి, రచయిత, చరిత్రకారుడు, కాలమిస్టు, సొసైటీ ఫర్ సేవ్ రాక్ అధ్యక్షుడిగా హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేశారు.
నరేంద్ర లూథర్ గురించి...

  • హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా, పరిశ్రమల శాఖ డెరైక్టర్‌గా సేవలందించారు.
  • 1991లో ఉమ్మడి ఏపీ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు.
  • హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్వరూపం వంటి అంశాలపై 15కు పైగా పుస్తకాలు రాశారు.
  • హైదరాబాద్ శిలల విశిష్టతపై రాక్యుమెంటరీ పేరుతో డాక్యుమెంటరీ తీశారు.
  • హైదరాబాద్‌లో శిలలను ధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా సొసైటీ ఫర్ సేవ్ రాక్స్ అధ్యక్షుడిగా పనిచేశారు.
  • ‘విట్ అండ్ విస్‌డమ్ సొసైటీ, యుద్దవీర్ ఫౌండేషన్ తదితర సంస్థల్లో కీలక పాత్ర పోషించారు.

లూథర్ రచనల్లో కొన్ని...
హైదరాబాద్-ఏ బయోగ్రఫీ, లష్కర్-ది స్టోరీ ఆఫ్ సికింద్రాబాద్, పోయెట్, లవర్, బిల్డర్, మహ్మద్ అలీ కుతుబ్‌షా-ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్, ది ఫ్యామిలీ సాగా.
రామన్ మెగసెసె అవార్డీ డాక్టర్ శాంత కన్నుమూత
ప్రముఖ ఆంకాలజిస్ట్, శాస్త్రజ్ఞురాలు, చెన్నై అడయార్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్-హాస్పిటల్ చైర్మన్, పద్మవిభూషణ్ డాక్టర్ వి.శాంత (93) కన్నుమూశారు. ఆస్తమాతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జనవరి 19న తుదిశ్వాస విడిచారు. నోబెల్ గ్రహీతలు సర్ సీవీ రామన్, సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన శాంత.. 1927 మార్చి 11న చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించారు.
నోబెల్ బహుమతికి కూడా....
డాక్టర్ శాంత.. 1949లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. 1955లో అదే కాలేజీలో ఎండీ చదువు ముగించి వెంటనే వైద్యవృత్తిలోకి ప్రవేశించారు. 1955 నుంచి మరణించే వరకు క్యాన్సర్ రోగులకు తన సేవలు అందించారు. క్యాన్సర్‌పై పోరులో ఆమె చేసిన పరిశోధనలు, వైద్యరంగానికి ఆమె చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. రామన్ మెగెసెసె అవార్డును సైతం అందుకున్న శాంత... 2005లో నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు.

అమెరికా ఎన్నవ అధ్యక్షుడిగా జో బెడైన్ ప్రమాణ స్వీకారం చేశారు?
యూనెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియర్(జో బెడైన్) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న క్యాపిటల్ భవనంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెడైన్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్‌‌ట్స ప్రమాణం చేయించారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా 78 ఏళ్ల బెడైన్ రికార్డు నెలకొల్పారు. కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో కొంత మంది సమక్షంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెడైన్ ప్రమాణ స్వీకారానికి డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు.
ఉపాధ్యక్షురాలిగా కమల...
అధ్యక్షుడుగా బెడైన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు... అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా ఇండో-ఆఫ్రో అమెరికన్ మహిళ కమల హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. కమలతో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్లజాతి మహిళగా, తొలి ఇండో-అమెరికన్‌గా, తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గా, తొలి ఆసియా-అమెరికన్ మహిళగా 56 ఏళ్ల కమల రికార్డు నెలకొల్పారు.
బెడైన్ ప్రస్థానం...

  • జో బెడైన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు.
  • యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు.
  • 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు.
  • మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు.
  • దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు.
  • సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా అప్పట్లో పేరుగాంచారు. మొత్తం ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు.
  • 1972లో జరిగిన కారు ప్రమాదంలో బెడైన్ మొదటి భార్య చనిపోయారు. 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.
  • బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బెడైన్ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.


తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ హిమ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్లారు.
జస్టిస్ హిమా కోహ్లి...
ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమా న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె 1999-2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున, పలుప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.
2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా...

  • 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన హిమా... 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.
  • ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
  • జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

జో బెడైన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోదం
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బెడైన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు జనవరి 7న అధికారికంగా అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లలో బెడైన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. దీంతో 78 ఏళ్ల బెడైన్ 2021, జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. జనవరి 7న విడుదలైన బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ‘‘ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితా’’లో ఈ విషయం వెల్లడైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి జనవరి 7న టెస్లా షేర్ల ధర ప్రకారం ఎలాన్ మస్క్ సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. జనవరి 7న టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా నియమితులైన వారు?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే వెంకట్రాము జనవరి 7న బాధ్యతలు స్వీకరించారు. చెల్లింపులు, ఉత్పత్తులు, అనుబంధ సాంకేతిక వ్యవస్థల మీద ఈయనకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2002-2015 మధ్య యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆరేళ్ల పాటు భారత వైమానిక దళంలోనూ వెంకట్రాము పనిచేశారు.

సింగరేణి సీఎండీ శ్రీధర్ పదవీకాలం పొడిగింపు
సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీగా ఎన్.శ్రీధర్ మరో ఏడాది కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం 2020, డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోగా, మరో ఏడాది పాటు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జనవరి 5న ఉత్తర్వులు జారీ చేశారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఎన్.శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. సింగరేణి సీఎండీగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి.

బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ బోర్డు సభ్యునిగా ఎంపికైన తొలి భారతీయ ప్రొఫెసర్?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ఇంగ్లిష్ ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్.. 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిల్ ప్రచురణ కేంద్రం (పబ్లిషింగ్ హౌస్) ఎడిటోరియల్ బోర్డులో సభ్యత్వానికి ఎంపికయ్యారు. తద్వారా ఈ ఘనత పొందిన తొలి భారతీయ ప్రొఫెసర్‌గా నిలిచారు. బ్రిల్ నుంచి రానున్న క్రిటికల్ పోస్త్‌హ్యూమనిజం’అనే ఈ-పుస్తక ధారావాహికకు ఆయన ఎంపికయ్యారు. ప్రొఫెసర్ ప్రమోద్ రచించిన పుస్తకాలు, జర్నల్స్ ఆధారంగా ఆయనకు ఈ అవకాశం దక్కింది. హెచ్‌సీయూలోనే ప్రొఫెసర్ ప్రమోద్ విద్యనభ్యసించారు.
1683లో ప్రారంభం...
నెదర్లాండ్‌‌సలోని లీడెన్ నగరంలో 1683లో బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ ప్రారంభమైంది. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఇంటర్నేషనల్ లా, సైన్స్ లోని కొన్ని విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రచురణలను ఈ సంస్థ వెలువరిస్తుంది.

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీకి ఐదేళ్ల జైలు శిక్ష
ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహమాన్ లఖ్వీకి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు(ఏటీసీ) జనవరి 8న ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్న కేసుకు సంబంధించి లాహోర్‌లోని ఏటీసీ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ ఈ తీర్పునిచ్చారు. మూడు నేరాలకు సంబంధించి, ఐదేళ్ల చొప్పున, మూడు శిక్షలు ఒకేసారి అమలయ్యేలా ఈ తీర్పును ప్రకటించారు. అలాగే, మూడు నేరాలకు సంబంధించి వేర్వేరుగా పాకిస్తాన్ కరెన్సీలో 10 వేల జరిమానా విధించారు. 2008, నవంబర్ 26న ముంబై ఉగ్ర దాడులు జరిగాయి.

ఏ దేశ అధ్యక్షుడిపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సామాజిక మాధ్యమం ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా జనవరి 9న ప్రకటించింది. ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి. కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది.
ఇప్పటికే...
ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి.

కేంద్ర మాజీ మంత్రి మాధవ్‌సింహ్ సోలంకీ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి మాధవ్‌సింహ్ సోలంకీ(93) జనవరి 9న గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో తుదిశ్వాస విడిచారు. 1927, జూలై 30న జన్మించిన సోలంకీ 1991 నుంచి 1992 దాకా విదేశాంగ మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. గుజరాత్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన తనయుడు భరత్‌సింహ్ సోలంకీ సైతం గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కన్నుమూత
సీనియర్ పాత్రికేయులు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు(87) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా జనవరి 10న విజయవాడలో తుదిశ్వాస వదిలారు. 1933 ఆగస్టు 10న కృష్ణాజిల్లాలో జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఏడు దశాబ్దాలపాటు పాత్రికేయునిగా, రచయితగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి జర్నలిసు్ట ఈయనే.
రచయితగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా తుర్లపాటి పనిచేశారు.

  • జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం వివిధ హోదాల్లో 33 ఏళ్లపాటు ఆంధ్రజ్యోతి పత్రికలోనే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
  • తుర్లపాటి రచనలు జాతక కథలు (1958), జాతి నిర్మాతలు (1968), మహానాయకులు (1971), 1857 విప్లవ వీరులు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం-నా గళం వంటివి ప్రజాదరణ పొందాయి.
  • వేలాది సభలకు అధ్యక్షత వహించి 1993లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్‌‌ట్సలో స్థానం పొందారు.

కేంద్ర జలసంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన అధికారి?
పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో)గా పనిచేసిన ఎస్కే హల్దర్‌ను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే జైన్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యుడు(డబ్ల్యూపీఅండ్‌పీ)గా వ్యవహరిస్తున్న ఎస్కే హల్దర్ అత్యంత సీనియర్ కావడంతో ఆయన్ని తదుపరి సీడబ్ల్యూసీ చైర్మన్‌గా కేంద్రం నియమించింది.
హల్దర్ కృష్ణా బోర్డు చైర్మన్‌గా, పీపీఏ సీఈవోగా 2016 నుంచి 2018 వరకు పనిచేశారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల (బేసిన్)తో పాటు పోలవరం ప్రాజెక్టుపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంది.

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (57) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1963, మే 15న హైదరాబాద్‌లో జన్మించిన నర్సింగ్ యాదవ్ ఇంటర్ వరకు చదువుకున్నారు. హేమా హేమీలు అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నర్సింగ్ యాదవ్‌కి ‘క్షణ క్షణం’చిత్రంతో మంచి పేరొచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనదైన శైలిలో ఆయన ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో ఆయన నటించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. డిసెంబర్ 31న రాష్ట్ర సచివాలయంలో నీలం సాహ్ని నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతర్ రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ఆదిత్యనాథ్‌దాస్ తొలి సంతకం చేశారు.
సాగునీటి శాఖ కార్యదర్శిగా...
ఆదిత్యనాథ్ దాస్ సుదీర్ఘకాలం సాగునీటి శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999 - 2001 వరకు వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2007 వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2016 వరకు సాగునీటి శాఖ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సర్వీసులో కూడా పలు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పటి వరకు జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.

ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా నియమితులైన అధికారి?
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ డిసెంబర్ 31న ఉత్తుర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఓడరేవుల్లో వాణిజ్య అవకాశాలను పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, ఒప్పందాలు అమలయ్యేలా చూడటం వంటి బాధ్యతలను రవీంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు.
ఆప్కో చైర్మన్‌గా చిల్లపల్లి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావును ఆప్కో చైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత వర్గాల తరఫున సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ముందున్నారు.

తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళా?
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు.
జస్టిస్ హిమా కోహ్లి...
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమా న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె 1999-2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున, పలుప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.
2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా...
  • 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన హిమా... 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.
  • ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
  • జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

ఏపీ హైకోర్టు కొత్త సీజేగా నియమితులైన న్యాయమూర్తి పేరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం...
  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలి.
  • మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహ్మద్ రఫీఖ్, ఒడిశా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.మురళీధర్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీబ్ బెనర్జీలు బాధ్యతలు స్వీకరించాలి.
  • కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలి.


రైల్వే బోర్డు కొత్త చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
రైల్వే బోర్డు కొత్త చైర్మన్, సీఈఓగా సునీత్ శర్మ నియమితులయ్యారు. డిసెంబర్ 31వ తేదీతో చైర్మన్‌గా వీకే యాదవ్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో శర్మ నియామకం జరిగింది. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శర్మ రైల్వే రంగంలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాయ్‌బరేలిలోని అత్యాధునిక రైలు బోగీల తయారీ కేంద్రంలో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్‌లో సేవలందించారు. డీజిల్ ఇంజిన్లను విద్యుత్తు ఇంజిన్లుగా మార్పు చేయడంలో కీలకపాత్ర పోషించారు. సాంకేతిక నైపుణ్యం, రైల్వేలోని వివిధ విభాగాల్లో పనిచేసిన 34 ఏళ్ల అనుభవం ఆయనకు ఉంది. చివరిగా ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌గా సేవలు అందించారు.

మాజీ హాకీ ఆటగాడు మైకేల్ కిండో కన్నుమూత
భారత హాకీ మాజీ ఆటగాడు, 1975లో ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మైకేల్ కిండో(73) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 31న తన స్వస్థలం ఒడిశాలోని రూర్కెలాలో తుదిశ్వాస విడిచారు. ఫుల్ బ్యాక్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కిండో 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ కూడా ఆడారు. ఈ పోటీల్లో భారత్ కాంస్యం గెలుచుకుంది. భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్న గిరిజన తెగలకు చెందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆయనను భారత ప్రభుత్వం ‘అర్జున’ అవార్డుతో సత్కరించింది.

ఇస్రో చైర్మన్ శివన్ పదవీ కాలం పొడిగింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ పదవీ కాలాన్నీ మరో సంవత్సర కాలం పొడిగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శివన్ పదవీ కాలాన్నీ పొడిగిస్తూ అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీస్ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్ కటికితల డిసెంబర్ 31న ఓ ప్రకటన విడుదల చేశారు.
2018, జనవరి 15న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శివన్ పదవీ కాలం 2021, జనవరి 14తో ముగియనుంది. అయితే 2021 ఏడాది గగన్‌యాన్-1, చంద్రయాన్-3 లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించారు. దీంతో 2022, జనవరి 14 వరకు ఇస్రో చైర్మన్ పదవిలో శివన్ కొనసాగనున్నారు.

కృషి పండిట్ అవార్డీ, శాసనమండలి సభ్యుడు కన్నుమూత
కృషి పండిట్ అవార్డు గ్రహీత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత చల్లా రామకృష్ణారెడ్డి (72) ఇక లేరు. కరోనాకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 1న తుదిశ్వాస విడిచారు. 1948 ఆగస్టు 27న కర్నూలు జిల్లాలోని అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో జన్మించిన చల్లా... ఏజీ బీఎస్సీతో పాటు ఎంఏ చదివారు.
1983లో తొలిసారి...
1983లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానానికి, 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1994 ఎన్నికల్లో కోవెలకుంట్లలో ఓడిపోయారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోవెలకుంట్ల నుంచి సాధించారు. 2009 ఎన్నికల్లో బనగానపల్లెలో ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర పాటు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019లో వైఎస్సార్‌సీపీలో చేరారు.
కళారంగంలోనూ...
చల్లా రాజకీయ రంగానికే కాకుండా సాహిత్య, కళా, వ్యవసాయ రంగాలకు కూడా తనవంతు సేవలందించారు. ఆయన కవితలు, రచనలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సైరా చిన్నపురెడ్డి, సత్యాగ్రహం సినిమాల్లో హీరోగా నటించారు. 1977-1982 మధ్యకాలంలో జొన్న పంటలో మంచి దిగుబడి సాధించి అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా కృషి పండిట్ అవార్డు స్వీకరించారు.

సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా జనవరి 1న సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డెరైక్టర్‌గా పనిచేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన సోమ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. డిసెంబర్ 31న తాజాగా పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో సోమ మండల్ బాధ్యతలు చేపట్టారు.
కోవిడ్-19 వ్యాక్సిన్లు స్వేచ్ఛగా ఎగుమతి, దిగుమతి
విలువ పరిమితి లేకుండా కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండెరైక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) ఈ మేరకు నిబంధనలను సవరించింది.

కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్(86) కన్నుమూశారు. 2020, అక్టోబర్‌లో మెదడులో రక్తస్రావమై కోమాలోకి వెళ్లిన బూటా సింగ్... ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ జనవరి 2న తుదిశ్వాస విడిచారు. నలుగురు ప్రధానుల కేబినెట్‌లో పనిచేసి, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన బూటా సింగ్.. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా ముస్తఫాపూర్‌లో 1934, ఆగస్టు 21న జన్మించారు.
1962లో తొలిసారి...

  • బూటాసింగ్ 1962లో మొదటిసారి పంజాబ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరఫున 8 పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • 2007-10 కాలంలో షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించారు.
  • 1998లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జార్ఖండ్ ముక్తిమోర్చా లంచం కేసులో ఇరుక్కుని పదవి నుంచి వైదొలగారు.
  • ఆపరేషన్ బ్లూస్టార్‌కు, అనంతరం సిక్కులపై దాడుల సమయంలో కేంద్రానికి మద్దతుగా నిలిచిన బూటాసింగ్‌ను 1984లో సిక్కు పెద్దలు మతం నుంచి బహిష్కరించారు.

హార్స్ రేస్‌లో కిందపడి జాకీ మృతి
హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్‌లో (హెచ్‌ఆర్సీ) విషాదం చోటుచేసుకుంది. జనవరి 2న ఉస్మాన్‌సాగర్ ప్లేట్ డివిజన్-2 రేసులో పాల్గొన్న రాజస్తాన్‌కు చెందిన జాకీ జితేందర్ సింగ్ (25) గోల్డెన్ టేబుల్ అనే గుర్రం పైనుంచి పడి ప్రాణం విడిచాడు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బాగ్చీ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ జనవరి 4న ప్రమాణం చేశారు. ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చీని కోల్‌కతా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా బదిలీ అయిన ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి హైకోర్టు జనవరి 4న ఘనంగా వీడ్కోలు పలికింది.

ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి ఇకలేరు
ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ (64) గుండెపోటుతో జనవరి 5న చెన్నైలో కన్నుమూశారు. 1957, నవంబర్ 30న నెల్లూరులో జన్మించిన వెన్నెలకంటి... సినీ వినీలాకాశంలో మాటల, పాటల రచయితగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 11 ఏళ్ళకే కవితలు, పద్యాలు రాశాడు. ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని, ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశాడు. తొలినాళ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా పనిచేసిన వెన్నెలకంటి... శ్రీరామచంద్రుడు సినిమాతో గీత రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. దాదాపు రెండు వేల పాటలు రాశారు.

క్రీడా శాఖ సహాయ మంత్రి పదవికి లక్ష్మీ రతన్ రాజీనామా
తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా జనవరి 5న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు పంపారు. మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ టీమ్ మాజీ కెపె్టన్ అయిన శుక్లా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాదలచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. హౌరా(నార్త్) నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికై న శుక్లా తన ఎంఎల్‌ఏ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.
పశ్చిమ బెంగాల్....
రాజధాని: కోల్‌కతా;
ప్రస్తుత గవర్నర్: జగ్‌దీప్ ధన్‌కర్;
ప్రస్తుత ముఖ్యమంత్రి: మమతా బెనర్జీ;
హైకోర్టు: కలకత్తా హైకోర్టు(కలకత్తా హైకోర్టు కోల్‌కతా నగరంలో ఉంది);
కలకత్తా హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్;
మొత్తం లోక్‌సభ సీట్లు: 42
మొత్తం రాజ్యసభ సీట్లు: 16

హైకోర్టు సీజేగా జస్టిస్ గోస్వామి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. జనవరి 6న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి, అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి పాల్గొన్నారు.
జస్టిస్ గోస్వామి...

  • 1961 మార్చి 11న అస్సాం రాష్ట్రం జోరాత్‌లో జన్మించిన జస్టిస్ గోస్వామి... 1985లో గౌహతి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
  • 1985 ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
  • 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 2019లో పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.
  • జస్టిస్ గోస్వామి మంచి క్రికెటర్ కూడా. ఆయన రంజీ ట్రోఫీలో అస్సాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ లెవల్ అండర్ 19, అండర్ 21లో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు.

తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ హిమ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్లారు.
జస్టిస్ హిమా కోహ్లి...
ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన హిమా న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె 1999-2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున, పలుప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు.
2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా...

  • 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన హిమా... 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు.
  • ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరించారు.
  • జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. జనవరి 7న విడుదలైన బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ‘‘ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితా’’లో ఈ విషయం వెల్లడైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి జనవరి 7న టెస్లా షేర్ల ధర ప్రకారం ఎలాన్ మస్క్ సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. జనవరి 7న టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా నియమితులైన వారు?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే వెంకట్రాము జనవరి 7న బాధ్యతలు స్వీకరించారు. చెల్లింపులు, ఉత్పత్తులు, అనుబంధ సాంకేతిక వ్యవస్థల మీద ఈయనకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2002-2015 మధ్య యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆరేళ్ల పాటు భారత వైమానిక దళంలోనూ వెంకట్రాము పనిచేశారు.