<b>తెలంగాణ రాష్ట్రం - ముఖ్యమైన విషయాలు </b>


<b>తెలంగాణ రాష్ట్రం - ముఖ్యమైన విషయాలు </b>

తెలంగాణ రాష్ట్రం - ముఖ్యమైన విషయాలు

తెలంగాణ రాష్ట్ర గీతం : జయ జయహే తెలంగాణ

జయ జయహే తెలంగాణ అనునది తెలంగాణ రాష్ట్ర గీతం. తెలంగాణ చరిత్ర, వర్తమానాలను బొమ్మగట్టి.. భవిష్యత్తుపై అంతులేని ఆశ్వాసాన్ని ప్రకటించిన ఈ గీతం 11 చరణాలతో రూపొందింది. ఇందులోని నాలుగు చరణాలను ఎంచుకొని రాష్ట్ర గీతంగా పాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే ఈ గీతానికి తుది మెరుగులు దిద్దారు. మారిన పరిస్థితుల్లో ఆయన కొన్ని సవరణలను చేశారు.

ఈ గేయ రచయిత అందెశ్రీ. ఆయనది వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి గ్రామం.

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

.

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలను నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ప్రభుత్వం 17 నవంబర్ 2014న అధికారికంగా ఓ ప్రకటన విడుదలు చేసింది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్  


• తెలంగాణ రాష్ట్ర పుష్పం – తంగేడు


• తెలంగాణ రాష్ట్ర జంతువు – జింక


• తెలంగాణ రాష్ట్ర చెట్టు – జమ్మి


• తెలంగాణ రాష్ట్ర పక్షి - పాలపిట్ట (ఇండియన్ రోలర్)


• ఫలం- మామిడి


• క్రీడ- కబడ్డీ

రాష్ట్ర పండుగలు: బతుకమ్మ, బోనాలు

  

 

తెలంగాణ సంస్కృతి, ఆవిర్భావం, కళలు, పరిశ్రమలు & భౌగోళిక చరిత్ర